వర్ని మండలం

తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం

వర్నిమండలం , తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం..[1]

వర్ని
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, వర్ని స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, వర్ని స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, వర్ని స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°31′57″N 77°53′42″E / 18.5324°N 77.8950°E / 18.5324; 77.8950
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం వర్ని (వర్ని మండలం)
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 72,230
 - పురుషులు 35,311
 - స్త్రీలు 36,919
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.19%
 - పురుషులు 58.51%
 - స్త్రీలు 36.10%
పిన్‌కోడ్ 503201

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బోధన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

పునర్వ్యవస్థీకరణ పూర్వాపరాలు మార్చు

2016 పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ మండలంలో 23 (ఇరవైమూడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఆ తరువాత 2019 లో ఏర్పడిన చందూర్ మండలంలో 6 గ్రామాలు, మొస్రా మండలంలో 5 గ్రామాలు చేరాయి.

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72,230 - పురుషులు 35,311 - స్త్రీలు 36,919; అక్షరాస్యత - మొత్తం 47.19% - పురుషులు 58.51%- స్త్రీలు 36.10%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 244 చ.కి.మీ. కాగా, జనాభా 32,971. జనాభాలో పురుషులు 16,194 కాగా, స్త్రీల సంఖ్య 16,777. మండలంలో 8,216 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. రాజ్‌పేట
  2. వర్ని
  3. మల్లారం
  4. జాకోర
  5. ఖునిపూర్
  6. జలాల్‌పూర్
  7. సయ్యిదాపూర్
  8. సిద్దాపూర్
  9. పైడిమల్
  10. తగిలెపల్లి
  11. శంకోర
  12. కారేగావ్

గమనిక:నిర్జన గ్రామలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు