వర్ల రామయ్య
వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశాడు.[1] ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించక మునుపు పోలీసు శాఖలో పనిచేశాడు. 2009 లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపిగా పోటీ చేసి కాంగ్రెస్ కు చెందిన చింతా మోహన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.[2] 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. ఈయన కుమారుడు వర్ల కుమార్ రాజా 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పామర్రు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
జీవిత విశేషాలు
మార్చురామయ్య 1973 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ పట్టా పొందాడు. 1993 లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించాడు.
మూలాలు
మార్చు- ↑ "Varla Ramaiah(TDP):(ANDHRA PRADESH) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-08-16.
- ↑ "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.