వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం
వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఉన్న దేవాలయం.[1] తెలంగాణ ప్రభుత్వం పునఃనిర్మించిన ఈ దేవాలయంలో 2023 సెప్టెంబరు 4న సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది.[2]
వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | జనగామ జిల్లా |
ప్రదేశం: | వల్మిడి, పాలకుర్తి మండలం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు |
ప్రధాన పండుగలు: | శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 2023 |
చరిత్ర
మార్చుపాలకుర్తి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్మిడి గ్రామం చరిత్ర కలిగిన ఊరు. ఈ గ్రామానికి రెండు వైపులా మునులగుట్ట, రాములగుట్ట అనే రెండు గుట్టలు ఉన్నాయి. మునుల గుట్టపై మునులు తపస్సు, రాముల గుట్టపై సీతారామ లక్ష్మణులు నివసించారని ఇక్కడి వారు చెప్పుకుంటారు. రాముడిదిగా భావించే రాతిపై చెక్కిన పాదముద్రలు, అనేక శిల్పాలు ఉన్నాయి. రాముడి నడయాడిని నేలగా, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలంగా ఉన్న ఒకప్పటి వాల్మీకిపురమే నేటి వల్మిడి అని పురాణాతిహాసాలు, తరతరాలుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ గ్రామంలోని గుట్టపై వాల్మీకి మహర్షి రామాయణం రచించాడని చరిత్రకారుల అభిప్రాయం.[3]
కొండపై ఉన్న గుండం (చెరువు) కరువు కాలంలో కూడా ఎండిపోదు. తాళ్లచెరువు సమీపంలో లభించిన శాసనం, 1567 జూలై 18న కుతుబ్ షాహీల కాలంలో ఈ సరస్సు నిర్మించబడిందని సూచిస్తుంది. శ్రీరామనవమి పండుగలో భాగంగా రాములగుట్టలో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది.[4]
నిర్మాణం
మార్చుఅంతటి చరిత్ర గల ఈ గుట్టపై పురాతనమైన సీతారామచంద్రస్వామి గుడి ఉండేది. దానికి అనుబంధంగా 2009లో లక్ష రూపాయలతో కల్యాణ మండపం కట్టించబడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దాదాపు 50 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని పునఃనిర్మించింది.[5] ఈ దేవాలయ నిర్మాణంలో పూర్తిగా 10వేల టన్నుల నల్ల గ్రానైట్ ఉపయోగించబడింది. యాదాద్రి దేవాలయ పునఃనిర్మాణంలో పాల్గొన్న వారే ఈ దేవాలయాన్ని నిర్మించారు. కొండపైకి వెళ్ళేందుకు మెట్లు, స్వాగత తోరణం, ప్రహరీ, కనమ దారి, భక్తులు సేదతీరేందుకు కుటీరాలు నిర్మించారు.[6]
విగ్రహాల ప్రతిష్టాపనోత్సవం
మార్చుఈ దేవాలయ ప్రారంభోత్సవంతోపాటు సీతారామచంద్రస్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం 2023 సెప్టెంబరు 2 నుండి 4వ తేదీ వరకు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించబడింది. సన్నూరు ఆలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల రంగాచార్యస్వామి పర్యవేక్షణలో ఇతర అర్చకులు పూజలను ఘనంగా జరిపారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో సెప్టెంబరు 4న సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో ఇతర విగ్రహాలు, దేవాలయ గోపురంపై కలశం ప్రతిష్టించబడ్డాయి.[7] ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి.హరీష్ రావు, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[8]
మూలాలు
మార్చు- ↑ India, The Hans (2023-08-31). "Valmidi to soak in devotion". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-07.
- ↑ telugu, NT News (2023-09-04). "Valmidi temple | వల్మిడిలో 50 కోట్లతో సీతారామచంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణం.. నేడు ప్రారంభోత్సవం". www.ntnews.com. Archived from the original on 2023-09-04. Retrieved 2023-09-07.
- ↑ Telugu, TV9 (2023-09-04). "Jangaon: వల్మిడిలో సీతారామచంద్రస్వామి ఆలయం పునఃప్రారంభం.. విగ్రహ ప్రతిష్ట చేసిన చినజీయర్ స్వామి". TV9 Telugu. Archived from the original on 2023-09-07. Retrieved 2023-09-07.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mahender, Adepu (2018-07-11). "Valmidi replete with hidden history". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-28. Retrieved 2023-09-07.
- ↑ telugu, NT News (2023-09-04). "రాములోరి గుడికి రారండోయ్." www.ntnews.com. Archived from the original on 2023-09-04. Retrieved 2023-09-07.
- ↑ "Valmidi Ramalayam Jangaon : భద్రాద్రిని తలపించేలా వల్మిడి రామాలయం.. చినజీయర్ స్వామి చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన". ETV Bharat News. 2023-09-04. Archived from the original on 2023-09-07. Retrieved 2023-09-07.
- ↑ telugu, NT News (2023-09-04). "TS Ministers | వల్మిడి దేవాలయ అభివృద్ధికి కృషి : మంత్రులు". www.ntnews.com. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-07.
- ↑ "Jangaon: వల్మిడి రామాలయంలో వైభవంగా విగ్రహాల పునఃప్రతిష్ఠాపన". EENADU. 2023-09-04. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-07.