వల్లభనేని సీతారామదాసు

శాస్త్రవేత్త

వల్లభనేని సీతారామదాసు వృక్ష శాస్త్రవేత్త. ఆయన ప్రొఫెసర్ వి.ఎస్. రామదాస్ గా ప్రఖ్యాతులు.[1][2]

వల్లభనేని సీతారామదాసు
వల్లభనేని సీతారామదాసు
జననంసా.శ. 1933
కృష్ణా జిల్లా, గుడ్ల వల్లేరు
నివాస ప్రాంతంకృష్ణా జిల్లా, గుడ్ల వల్లేరు
ఇతర పేర్లువి.ఎస్.దాసు
వృత్తిప్రొఫెసర్, రీడర్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిప్రముఖ వృక్ష శాస్త్రవేత్త
తండ్రివెంకటప్పయ్య

జీవిత విశేషాలు మార్చు

వి.ఎస్.రామదాసు గారు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు గ్రామంలో 1933 ఫిబ్రవరి 5 న జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకటప్పయ్య. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బోటనీ (ప్లాంట్ ఫిజియాలజీ) లో 1953 లో ఎం.ఎస్.సి పూర్తి చేసారు. 1957 లో ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయం నుండి డి.ఫిల్ డిగ్రీని చేసారు[3] . 1960 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఫోటోసింధసిస్ అంశం మీద పోస్టు డాక్టరల్ రీసెర్చి చేసి పరిశోధకులుగా రాణించారు.[4]

ఉద్యోగపర్వం మార్చు

ఆయన తొలిగా అలహాబాదు విశ్వవిద్యాలయం బోటనీ డిపార్డు మెంటులో అసిస్టెంటు ప్రొఫెసరుగా 1957 నుండి 59 వరకు ఉన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్లాంట్ ఫిజియాలజిస్టుగా 1959-60 లలో పరిశోధనలు చేసరు. స్వదేశం వచ్చి 1960-61 లలో వేకటేశ్వర విశ్వవిద్యాలయంలో వృక్ష శాస్త్ర విభాగంలో లెక్చరర్ గా పనిచేసారు. రీడరుగా 1961-67 లలో పనిచేసారు.[5] న్యూ ఫౌండ్ లాండ్ లోని మెమోరియల్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసరుగా 1967 నుండి 1969 వరకు పనిచేసారు. 1969-70 లలో తిరిగి వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీడరుగా, ప్రొఫేసర్ గా పనిచేసారు.[6] అదే విశ్వవిద్యాలయంలో 1970-77 లో సీనియర్ ప్రొఫెసరుగా, 1988 వరకు స్కూల్ ఆఫ్ బయోలాజికల్ అండ్ ఎర్త్ సైన్సెస్ స్కూల్ డీన్ గా వివిధ హోదాలలో పనిచేసారు. మధ్య కాలం 1978-80 లలో హైదరాబాదు విశ్వవిద్యాలయం లోని ఫోటోసింధసిస్ స్టడీస్ సెంటర్ డైరక్టరుగా పనిచేసారు.

పరిశోధనలు మార్చు

ఈయన జీవ రసాయన శాస్త్ర, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో నాలుగున్నర దశాబ్దాల పాటు పరిశోధనా విజయాలను సాధించారు[7]. కిరణ జన్య సంయోగ క్రియ రంగంలో నూతన ఆవిష్కరణలు చేసారు. కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి, అమెరికా ప్రభుత్వ వ్యవసాయ విభాగం (పి.ఎస్.480 పథకం), కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి మొదలగు వారి అనేక పరిశోధనా ప్రాజెక్టులకు ఈయన ప్రధాన పరిశోధకులుగా ఉన్నారు. ఆయన 2004 లో "photosyntheses- regulation undre under varying light regimes" అనే గ్రంథాన్ని రచించారు.[8]. దీనిని అమెరికాలో ప్రతిష్ఠాత్మక ప్రచురణ సంస్థ "సైన్స్ పబ్లిషర్స్" (న్యూ హాంషైర్) ప్రచురించింది.[9] ఈ పరిశోధనకు గానూ ఆయన న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్స్, యు.ఎస్.ఎకు జీవిత కాల సభ్యత్వాన్ని పొందారు.[10] హరిత రేణువులను ప్రప్రథమంగా వేరుచేసిన వృక్ష శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈయన అనేక గౌరవాలు, పదవులు, అవార్డులు, మెడల్స్ అందుకున్నారు.

1953 నుండి 1998 వరకు అమెరికా, బ్రిటన్, స్వీడన్, కెనడా మొదలగు దేశాలలో విస్తృతంగా పర్యటించి ఆయా దేశాల విశ్వవిద్యాలయాల పరిశోధనాలయాలలో గౌరవ పదవులను నిర్వహించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలలో గౌరవ సభ్యులుగా యున్నారు. 224 పరిశోధనా పత్రాలను, సమీక్షలను వెలువరించారు.. 20 మంది పరిశోధక విద్యార్థులను మార్గదర్శకులుగా, పర్యవేక్షకులుగా యున్నారు.[11]

అవార్డులు, గౌరవాలు మార్చు

 • 1975 : ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఫెలోషిప్.
 • 1978 : ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ.ఫెలోషిప్.[12]
 • 1991 : ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో ఫెలోషిఫ్.
 • 1978-79 : యు.జి.సి నేషనల్ లెక్చరర్.
 • 1985-86 : యు.జి.సి నేషనల్ లెక్చరర్.
 • 1981 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మెరిటోరియస్ టీచర్ అవార్డు.
 • 1978 : జె.జె.చినోయ్ మెమోరియల్ మెడల్, (ఇండియన్ సొసైటీ ఫర్ ప్లాంట్ ఫిజియాలజీ వారిచే)
 • 1985 : బీర్బల్ సహానీ అవార్డు, (ఇండియన్ బొటానికల్ సొసైటీ వారిచే)
 • 1991 : జగదీష్ చంద్రబోస్ అవార్డు (యుజిసె వారిచే)
 • 1986 : ఎస్.ఎం.సర్కార్ మెమోరియల్ అవార్డు ( కలకతా యూనివర్శిటీ వారిచే)
 • 1987 : హాసర్ సుమ్మున్ మెడల్ (అమెరికాలోని వాటుముల్ ఫౌండేషన్ వారిచే)
 • 1996 : ప్రొఫెసర్ ఎస్.బి.సక్సేనా అవార్డు.

అస్తమయం మార్చు

ఈయన డిసెంబరు 9 2010 న తన 77 వ యేట విజయవాడలో అనారోగ్యంతో మరణించారు.[13]

మూలాలు మార్చు

 1. "Eminent indian botanists, past and present" (PDF). Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-05-24.
 2. "Eminent Indian Botanists - Past and Present (Biographies and Contributions)". Archived from the original on 2014-12-23. Retrieved 2015-05-24.
 3. PERSONAL NEWS CURRENT SCIENCE, VOL. 101, NO. 6, 25 SEPTEMBER 2011 798 V. S. Rama Das (1933–2010)
 4. సంయోగ క్రియ పై పరిశోధకుల జాబితా[permanent dead link]
 5. current science November 20 ,1987, vol 56 no.22
 6. current science.ac.in
 7. "SPECIAL SECTION: PLANT MOLECULAR BIOLOGY CURRENT SCIENCE, VOL. 80, NO. 2, 25 JANUARY 2001 270 Plant molecular biology in India – The beginnings" (PDF). Archived from the original (PDF) on 8 ఆగస్టు 2017. Retrieved 24 మే 2015.
 8. [Das, V. S. R., Photosynthesis: Regulation Under Varying Light Regimes,Science Publishers, Enfield, USA and Plymouth,UK, 2004]
 9. Photosynthesis : Regulation under Varying Light Regimes – V. S. Rama Das[permanent dead link]
 10. న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, యు.ఎస్.ఎ
 11. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 41.
 12. "University of Hyderabad, Hyderabad". Archived from the original on 2016-03-04. Retrieved 2015-05-24.
 13. death news of v.s.rao

ఇతర లింకులు మార్చు