వల్లూరి నారాయణ రావు

వల్లూరి నారాయణ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలమూరు నియోజకర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

వల్లూరి నారాయణ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 -1985
1985 - 1989
నియోజకవర్గం ఆలమూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1945
మండపేట, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2021 డిసెంబర్ 1
మండపేట
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశమ్ పార్టీ
తల్లిదండ్రులు వల్లూరి రామస్వామి
జీవిత భాగస్వామి లక్ష్మి సరోజిని
సంతానం వెంకటసూర్యకుమారి, నామస్వామి చౌదరి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

వల్లూరి నారాయణ రావు 1981లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో జరిగిన ఎన్నికల్లో ఆలమూరు నియోజకర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాలిన సూర్యభాస్కరరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వల్లూరి నారాయణ రావు 1985 జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1989 ఎన్నికల్లో టీడీపీ తరపున, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

వల్లూరి నారాయణ రావు తరువాత కొంతకాలం టీడీపీకి దూరంగా ఉంది తిరిగి అనంతరం పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నూతనంగా ఏర్పాటైన మండపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుపులో కీలకంగా పని చేశాడు.

వల్లూరి నారాయణ రావు 2021 డిసెంబర్ 1న అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.[1][2]

మూలాలు

మార్చు
  1. Eenadu (1 December 2021). "మాజీ ఎమ్మెల్యే వల్లూరి కన్నుమూత". Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.
  2. iDreamPost (1 December 2021). "మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు మృతి..." (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.