వేగుళ్ల జోగేశ్వర రావు
వేగుళ్ల జోగేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మండపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
వేగుళ్ల జోగేశ్వరరావు | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | మండపేట నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1961 పాతిమీద గ్రామం, మండపేట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
తల్లిదండ్రులు | వేగుళ్ల వీర్రాజు | ||
జీవిత భాగస్వామి | విజయలక్ష్మి |
జననం, విద్యాభాస్యంసవరించు
వేగుళ్ల జోగేశ్వరరావు 1961లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, మండపేట, పాతిమీద గ్రామంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీకామ్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితంసవరించు
వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట మండపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలమూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిక్కిన కృష్ణార్జున చౌదరి చేతిలో ఓడిపోయాడు.
వేగుళ్ల జోగేశ్వరరావు 2009లో నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన మండపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పై వి.వి.ఎస్.ఎస్.చౌదరి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో వైసీపీ అభ్యర్థి గిరజాల వెంకటస్వామి నాయుడు పై[1], 2019లో వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
మూలాలుసవరించు
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.