వసంత్ కుమార్ రవి, భారతీయ వైద్యుడు, తమిళ సినిమా నటుడు.[1] ఆయన 10వ విజయ్ అవార్డ్స్, 2018లో జియో 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలి నటుడు పురస్కారం అందుకున్న తన తొలి చిత్రం తారామణి (2017). ఈ చిత్రంలో ఆయన నటనతో తమిళం, తెలుగు చిత్రసీమల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు.

వసంత్ రవి
జననం (1990-04-18) 1990 ఏప్రిల్ 18 (వయసు 34)
వృత్తినటుడు, వైద్యుడు, వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

2023లో విడుదలైన అశ్విన్స్, జైలర్ చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు.[2][3]

ఆయన రవి ముత్తుకృష్ణన్ కుమారుడు. వీరిది నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వ్యాపారం.

కెరీర్

మార్చు

ఆయన ముందుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్‌లో హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు.[4] ఆ తరువాత 2013లో, ఆయన దర్శకుడు రామ్ రూపొందించిన తారామణి సినిమాలో నటించాడు.[5] అయితే ఈ సినిమా ఆగస్టు 2017లో విడుదలయింది. అయినా ఈ చిత్రం ఆయనకు సానుకూల సమీక్షలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో అతని నటనతో పాటు ఆండ్రియా జర్మియా ప్రధాన పాత్రలో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.[6] ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్‌లో ఆయనకు ఉత్తమ పురుష నటుడిగా అరంగేట్రం చేసినందుకు పురస్కారం అందుకున్నాడు. 2018 విజయ్ అవార్డ్స్‌లో ఆయనకి ఉత్తమ తొలి నటుడు అవార్డు కూడా లభించింది.[7][8][9][10]

2018 జూన్ 16న జరిగిన 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో, ఆయన ఉత్తమ తొలి నటుడిగా అవార్డు పొందాడు. ఆయన రెండవ చిత్రం 2021లో వచ్చిన రాకీ. ఇది అపారమైన విమర్శకుల ప్రశంసలను అందుకుంది, అయితే ఇది ఒక మోస్తరు బాక్స్-ఆఫీస్ విజయం మాత్రమే.

మూలాలు

మార్చు
  1. "Acting cannot be taught; there is no set principle: Vasanth Ravi - Times of India". The Times of India. Retrieved 19 July 2018.
  2. "Asvins Review: 'అశ్విన్స్‌' మూవీ రివ్యూ". Sakshi. 21 June 2023. Archived from the original on 21 June 2023. Retrieved 21 June 2023.
  3. "Vasanth Ravi to play a dreaded villain to Rajinikanth in Jailer". DT Next. 4 August 2022. Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.
  4. "Another doctor-turned-actor in K'town". deccanchronicle.com (in ఇంగ్లీష్). 1 June 2016. Retrieved 4 June 2018.
  5. IANS (1 August 2017). "Fortunate to be launched by director Ram: Vasanth Ravi". Business Standard India. Retrieved 4 June 2018.
  6. Anantharam, Chitra Deepa (30 April 2018). "What is 'Taramani' Vasanth Ravi up to now?". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 4 June 2018.
  7. "Vijay awards 2018: Nayanthara, Vijay Sethupathi win best actor award, Dhanush and Anirudh perform together. See pics". hindustantimes.com (in ఇంగ్లీష్). 4 June 2018. Retrieved 4 June 2018.
  8. Upadhyaya, Prakash. "Vijay Awards 2018: Here is the complete list of winners [Photos]". International Business Times, India Edition. Retrieved 4 June 2018.
  9. "Winners: 65th Jio Filmfare Awards (South) 2018 - Times of India". The Times of India. Retrieved 17 June 2018.
  10. Upadhyaya, Prakash. "Vijay Awards 2018: Here is the complete list of winners [Photos]". International Business Times, India Edition. Retrieved 4 June 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=వసంత్_రవి&oldid=3959826" నుండి వెలికితీశారు