వహాబ్ రియాజ్

పాకిస్తాన్ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్

మూస:Infobox minister

వహాబ్ రియాజ్
మానవుడు
లింగంపురుషుడు మార్చు
పౌరసత్వ దేశంపాకిస్తాన్ మార్చు
ప్రాతినిధ్య దేశంపాకిస్తాన్ మార్చు
పుట్టిన తేదీ28 జూన్ 1985 మార్చు
జన్మ స్థలంలాహోర్ మార్చు
వృత్తిcricketer మార్చు
చదువుకున్న సంస్థAitchison College మార్చు
Medical conditionకోవిడ్-19 వ్యాధి మార్చు
క్రీడక్రికెట్ మార్చు

వహాబ్ రియాజ్ (జననం 1985, జూన్ 28) పాకిస్తాన్ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

ప్రారంభ జీవితం, కుటుంబం

మార్చు

రియాజ్ 1985, జూన్ 28న పంజాబీ గుజ్జర్ కుటుంబంలో వ్యాపారవేత్త అయిన ముహమ్మద్ సికందర్ రియాజ్ కసానాకు జన్మించాడు.[1][2] లాహోర్‌లోని ప్రతిష్టాత్మక ఐచిసన్ కాలేజీలో చదువుకున్నాడు.[3] రియాజ్ జైనాబ్ చౌదరిని వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.[4]

క్రికెట్ రంగం

మార్చు

తరచుగా 90 mph (144.8 km/h) వేగంతో బౌలింగ్ చేసాడు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2015లో ఇతని ఆల్ రౌండ్ ప్రదర్శన అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన 33 మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[5][6] 2019 సెప్టెంబరులో, రియాజ్ ఆట పొట్టి ఫార్మాట్‌లపై దృష్టి పెట్టడానికి రెడ్-బాల్ క్రికెట్ నుండి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.[7] 2020 జూన్ లో, ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్ పర్యటనకు ముందు తాను మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని రియాజ్ చెప్పాడు.[8]

2022 ఏప్రిల్ లో, ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అతన్ని కొనుగోలు చేసింది.[9]

2023 జనవరిలో, 2022–23 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైగర్స్ తరపున ఆడుతున్నప్పుడు, 400 టీ20 వికెట్లు తీసిన మొదటి పాకిస్థానీ బౌలర్‌గా నిలిచాడు.[10]

రాజకీయ జీవితం

మార్చు

2023 జనవరిలో, మొహ్సిన్ రజా నఖ్వీ తాత్కాలిక పంజాబ్ ప్రభుత్వంలో రియాజ్ క్రీడల మంత్రిగా నియమితులయ్యాడు. కానీ అతని బిజీ షెడ్యూల్ కారణంగా కొనసాగలేకపోయారు.[11] తరువాత 2023, మార్చి 22న క్రీడలు, యువజన వ్యవహారాల కోసం ముఖ్యమంత్రి పంజాబ్‌కు సలహాదారుగా నియమించబడ్డాడు.[12][13]

మూలాలు

మార్చు
  1. "Wahab Riaz's father passes away". ARY News. 31 January 2017. Archived from the original on 30 మే 2021. Retrieved 12 June 2019.
  2. "Pakistani Cricketers And Their Wives At Wedding Of Wahab Riaz Sister". Health Fashion (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-12-22. Retrieved 2022-12-22.
  3. Newspaper, the (19 April 2011). "Wahab Riaz: A profile". DAWN.COM.
  4. "Wahab Riaz names his son after his late father Sikandar". Samaa. 17 March 2023.
  5. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. 10 January 2014. Retrieved 6 August 2018.
  6. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
  7. "Wahab Riaz takes break from red-ball cricket to focus on shorter formats". International Cricket Council. Retrieved 12 September 2019.
  8. "Wahab Riaz willing to return to Test cricket on England tour". ESPN Cricinfo. 15 June 2020. Retrieved 15 June 2020.
  9. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  10. Isam, Mohammad (21 January 2023). "BPL round-up: Pakistan players sparkle, Barishal surge up the table, and Dhaka flounder". Cricinfo. You may think Wahab Riaz is past his prime, but the 37-year-old's last two performances say otherwise. He has gone past 400 wickets in T20s, becoming the first player from Pakistan to do so.
  11. "Cricketer Wahab Riaz named as Punjab's caretaker sports minister". Geo News. 26 January 2023.
  12. "Wahab Riaz starts duties as adviser to Punjab CM on sports and youth affairs". www.geo.tv (in ఇంగ్లీష్). Retrieved 2023-03-23.
  13. "Wahab Riaz takes charge as Advisor to CM Punjab on Sports Affairs". The Nation (in ఇంగ్లీష్). 2023-03-23. Retrieved 2023-03-23.

బాహ్య లింకులు

మార్చు

Pakistan Cricket Board