పంజాబీలు
పంజాబీలు (పంజాబీ: پنجابی, ਪੰਜਾਬੀ, पंजाबी), లేదా పంజాబీ ప్రజలు, పాకిస్తాన్, ఉత్తర భారతదేశాల్లో విస్తరించిన పంజాబ్ ప్రాంతానికి చెందిన ఇండో-ఆర్యన్ జాతికి చెందిన ప్రజలు. పంజాబ్ అన్న పేరుకు ఐదు జలాల భూమి (పర్షియన్ భాష: పంజ్ ("ఐదు") ఆబ్ ("జలాలు").[2] ఈ ప్రాంతానికి ఆ పేరును భారత దేశాన్ని ఆక్రమించిన తుర్కో-పర్షియన్ విజేతలు[3] పెట్టగా, మొఘల్ పాలనా కాలంలో ప్రాచుర్యం పొందింది.[2][4] భారత్, పాకిస్తాన్ ఇరుదేశాల్లోనూ పంజాబ్ ధాన్యాగారంగా పేరొందింది.[5][6]
پنجابی ਪੰਜਾਬੀ पंजाबी | |
---|---|
Total population | |
పంజాబీలు: సుమారు 125 million[1][a] | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
Pakistan | 93,500,000 |
India | 29,102,477 |
Saudi Arabia | 872,000 |
Canada | 430,705 |
United Kingdom | 273,000 |
United States | 250,000 |
Tanzania | 77,000 |
Australia | 71,228 |
Kenya | 69,000 |
Japan | 68,000 |
Iran | 64,000 |
Thailand | 64,000 |
Malaysia | 56,400 |
Libya | 54,000 |
Philippines | 50,000 (2016)[16] |
Oman | 37,000 |
Indonesia | 35,000 to 60,000. |
Singapore | 26,000 |
Mauritius | 26,000 |
Norway | 24,000 |
Sweden | 24,000 (2013) |
Bangladesh | 23,700 |
Greece | 20,000 |
New Zealand | 19,752 |
Germany | 18,000 (2020) |
Netherlands | 15,000 |
Myanmar | 11,000 |
Nepal | 10,000 |
Fiji | 9,300 |
Réunion | 3,800 |
Afghanistan | 3,000 |
Switzerland | 1,000 |
భాషలు | |
మతం | |
ప్రధానంగా: పాకిస్తాన్ లో ఇస్లాం భారత దేశంలో సిక్ఖు మతం & హిందూ మతం మైనారిటీలు: |
పంజాబ్ ప్రాంతంలోని వివిధ తెగలు, కులాలు, మతాలకు చెందిన నివాసులను విస్తృతమైన సాధారణపదం పంజాబీ అన్నది వాడడం 18వ శతాబ్ది ప్రారంభం నుంచి మొదలైంది. దీనికి ముందు పంజాబ్ ప్రాంతంలో భాషాపరమైన, చారిత్రికమైన, జాతిపరమైన సామాన్య లక్షణాలు, సాధారణ చరిత్ర పంచుకునే ఉన్నా ప్రజల్లో పంజాబీ అన్న జాతిపర, సాంస్కృతక గుర్తింపు ఉండేది కాదు.[7][8][9]
పంజాబ్ చరిత్ర
మార్చుప్రపంచంలోకెల్లా అంత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో పంజాబ్ ఒకటి. పంజాబ్ అన్న పేరు మొట్టమొదట 14వ శతాబ్దిలో ప్రాంతాన్ని సందర్శించిన ఇబ్న్ బతూతా వ్రాతల్లో కనిపిస్తుంది.[10] ఈ పదం విస్తృత ప్రయోగంలోకి 16వ శతాబ్ది ఉత్తరార్థం నుంచి ప్రారంభమైంది. 1580 నాటి తారిఖ్-ఎ-షేర్షా సూరిలో పంజాబ్ యొక్క షేర్ ఖాన్ కోట నిర్మించినట్టు కనిపిస్తుంది. పంజాబ్ కు సంస్కృత సమానార్థకమైన పంచ-నద (ఐదు నదుల దేశం) అన్నది మహాభారత ఇతిహాసంలో కనిపిస్తుంది. పంచనద అన్న పేరు మళ్ళీ అబుల్ ఫజల్ రాసిన ఐన్-ఎ-అక్బరీ (మొదటి భాగం)లో తిరిగి కనిపిస్తుంది. అబుల్ ఫజల్ ఈ ప్రాంతాన్ని లాహోర్, ముల్తాన్ విభాగాలుగా ప్రస్తావించారు. ఐన్-ఎ-అక్బరీ రెండవ సంపుటిలో పంజ్ నద్ అన్న పదం కనిపిస్తుంది.[11] మొఘల్ చక్రవర్తి జహంగీర్ తన తుజ్క్-ఇ-జహంగీరిలో పంజాబ్ అన్న పదాన్ని ప్రస్తావించారు.[12] పంజాబ్ అన్న పదం పర్షియన్ నుంచి వచ్చింది, భారత చరిత్రలోని టర్కీ విజేతలు ఈ పదాన్ని ప్రవేశపెట్టారు.,[13] ఈ పదానికి అర్థం ఐదు (పంజ్), జలాలు (ఆబ్), అంటే ఐదు నదుల భూమి. ఐదు ప్రధానమైన నదులతో సారవంతమైన ప్రాంతం కావడంతో బ్రిటీష్ ఇండియా కాలం నుంచీ పంజాబ్ భారత దేశపు ధాన్యాగారంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ ప్రాంతంలోని ఐదు నదుల్లో మూడు పాకిస్తాన్లోని పంజాబ్ లో ప్రధానంగా ప్రవహిస్తూండగా, మిగతా రెండూ హిమాచల్ ప్రదేశ్, భారతీయ పంజాబ్ రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రవహిస్తూంది.
మతాలు
మార్చుపంజాబ్ ప్రాంతంలో ప్రధానమైన మతాలుగా ఇస్లాం, హిందు, సిక్ఖు మతాలు ఉన్నాయి. హిందూమతంలోని వేదాలు, మహాభారత యుద్ధం వంటి ప్రధానమైన ఘట్టాలన్నీ ఇక్కడే జరిగిన హృదయ భూమిగా పంజాబ్ వర్థిల్లింది. పంజాబ్ లోనే ఏకేశ్వరోపాసన కలిగిన మతమైన సిక్కు మతం జన్మించింది.[14][15] సూఫీ తత్వానికి పలువురు ప్రఖ్యాత గురువులు, అనుచరులు [16] పంజాబ్ లోనే జన్మించారు.[17] అలాగే ఇస్లాంకు చెందిన అహ్మదియా శాఖ పంజాబ్ లోనే జన్మించింది.
పంజాబీ ముస్లింలు
మార్చుపంజాబీ ముస్లింలు (పంజాబీ: پنجابی مسلمان (షాముఖీ)) అన్నది తూర్పు పాకిస్తాన్, వాయువ్య భారతదేశం ప్రదేశాల్లో విస్తరించిన పంజాబ్ ప్రాంతానికి చెందిన భాషాపరమైన, భౌగోళికమైన, మతపరమైన జన సమూహం. పంజాబీ జాతిలో అత్యంత పెద్ద సముదాయమైన[19] పంజాబీ ముస్లింలు ఇస్లాంను అనుసరిస్తూ, పంజాబీ భాష మాట్లాడుతారు. 90 కోట్లకు పైగా జనాభాతో,[19] పాకిస్తాన్ లో అతి ఎక్కువ జనాభా కలిగిన జాతిగానూ, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంఖ్యాధిక్య ముస్లిం జాతిగానూ నిలుస్తోంది.[20] పంజాబీ ముస్లింలలో ఎక్కువమంది ఇస్లాంలో సున్నీ శాఖకు చెందినవారు. వీరిలో మైనారిటీలుగా షియాలు, పంజాబ్ లోనే ప్రారంభమైన అహ్మదియ్యా వంటి శాఖల వారు ఉన్నారు.
పంజాబీ ముస్లింల మాతృభూమి ప్రధానంగా పాకిస్తానీ ప్రావిన్సు అయిన పంజాబ్ లో నెలకొన్నాయి. ఉత్తర అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ లలో చెప్పుకోదగ్గ సముదాయాలు, మధ్య ప్రాచ్యంలో పెద్ద స్థాయిలో విదేశీ జనాభాగా వీరికి ప్రపంచవ్యాప్త డయాస్పోరా ఉంది.
మతాలు group |
జనాభా % 1881 |
జనాభా % 1891 |
జనాభా % 1901 |
జనాభా % 1911 |
జనాభా % 1921 |
జనాభా % 1931 |
జనాభా % 1941 |
---|---|---|---|---|---|---|---|
ఇస్లాం | 47.6% | 47.8% | 49.6% | 51.1% | 51.1% | 52.4% | 53.2% |
హిందూ మతం | 43.8% | 43.6% | 41.3% | 35.8% | 35.1% | 30.2% | 29.1% |
సిక్ఖు మతం | 8.2% | 8.2% | 8.6% | 12.1% | 12.4% | 14.3% | 14.9% |
క్రైస్తవం | 0.1% | 0.2% | 0.3% | 0.8% | 1.3% | 1.5% | 1.5% |
ఇతర మతాలు / మతం లేని వారు | 0.3% | 0.2% | 0.2% | 0.2% | 0.1% | 1.6% | 1.3% |
పంజాబీ హిందువులు
మార్చుపంజాబీ హిందువులు అన్నది హిందూ మతం అనుసరిస్తూ, భారత ఉపఖండంలోని పంజాబీ ప్రాంతంలో తమ మూలాలు కానీ, నేపథ్యం కానీ ఉన్న జనసమూహం. భారతదేశంలో పంజాబీ హిందువులు ప్రధానంగా పంజాబ్, హర్యానా, జమ్ము, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నారు. పంజాబీ హిందువులు అమెరికా, కెనడా, యుకె, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దుబాయ్ వంటి ప్రాంతాలకు నిరంతరంగా వలసలు కొనసాగుతూ వచ్చాయి.
పంజాబ్ ప్రాంతంలో చారిత్రికంగా ఎప్పటినుంచో హిందూ మతం ప్రాచుర్యంలో ఉంది. హిందూ మతం పంజాబ్ లో విలసిల్లిన కాలానికి ఆ ప్రాంతానికి ఇస్లాం ఆగమనం కానీ, ఆ మట్టిపై సిక్ఖు మతం జననం కానీ జరగలేదు. సిక్ఖు మతపు తొలి గురువు గురు నానక్ సహా బందా సింగ్ బహదూర్, భాయ్ మతీ దాస్ వంటి ప్రముఖ సిక్ఖు నాయకులు, గురువులు అందరూ పంజాబ్ ప్రాంతానికి చెందిన హిందూ కుటుంబాలకు చెందినవారే. పలువురు పంజాబీ హిందువులు అనంతర కాలంలో సిక్ఖుమతంలో చేరారు. నిజానికి పంజాబీ హిందువులు తమ మూలాలను వేదకాలం నుంచి అన్వేషించవచ్చు.
ఆధునిక భారత పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ మహా నగరాలకు అత్యంత ప్రాచీనమైన హిందూ మత సంబంధ నామాలు ఉన్నాయి. అలాంటివే లాహోర్, జలంధర్, చండీగఢ్, మొదలైన నగరాల పేర్లు. భారత ప్రధానులు ఐ.కె.గుజ్రాల్, గుల్జారీ లాల్ నందా, భారత జట్టు పూర్వ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రముఖ శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా తదితరులు పంజాబీ హిందువులే.
పంజాబీ సిక్ఖులు
మార్చుసిక్కు మతము (ఆంగ్లం : Sikhism) (పంజాబీ ਸਿੱਖੀ ), గురునానక్ ప్రబోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథము గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథము లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం, పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు.[21]
పంజాబీ క్రైస్తవులు
మార్చుపంజాబీ క్రైస్తవులు పాకిస్తాన్ లోని క్రైస్తవ సమూహాల్లో అతి ఎక్కువ సంఖ్యాకులు. ప్రావిన్సులోని ప్రధానమైన మత సమూహం ముస్లిములు, వారు జనాభాలో 90 శాతానికి పైగా ఉన్నారు. లాహోర్లోని చర్చిల్లో కేథెడ్రల్ చర్చ్ ఆఫ్ రిసరెక్షన్, సేక్రెడ్ హార్ట్ కేథెడ్రెల్, లాహోర్, సెయింట్ ఆండ్రూస్ చర్చ్, లాహోర్, సెయింట్ జోసెఫ్ చర్చి, లాహోర్ వంటివి ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. భారతదేశంలోని పంజాబీ ప్రాంతాలైన పంజాబ్ రాష్ట్రంలో 1.1 శాతంగానూ, హర్యానాలో 0.19 శాతంగానూ ఉన్నారు. బ్రిటీష్ పరిపాలనలో హిందు, చురా, మఝబీ సిక్ఖు మతాల నుంచి క్రైస్తవంలోకి మారారు.[22]
1839 వేసవిలో మహారాజా రంజీత్ సింగ్ మరణించడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడి, తర్వాతి వారసత్వ యుద్ధాల్లో దర్బారు రాజ్యాన్ని బలహీనం చేసింది. ఆ పరిణామాల అనంతరం రెండు ఆంగ్లో-సిక్ఖు యుద్ధాలు జరిగి చివరకు ఆంగ్లేయులకు పంజాబ్ ఆఖరున దత్తమైన రాజ్యంగా బ్రిటీష్ ఇండియాలో 1849లో కలిసిపోయింది.
1877లో సెయింట్ థామస్ దినోత్సవాన వెస్ట్ మినిస్టర్ అబ్బే, లండన్ లో రెవరెండ్ థామస్ వల్పై ఫ్రెంచ్ తొలి ఆంగ్లికన్ బిషప్ ఆఫ్ లాహోరును నియమించి, దాని కింద అప్పటి బ్రిటీష్ వలస పాలనలోని మొత్తం పంజాబ్ లో క్రైస్తవ కార్యకలాపాలు బాధ్యత అప్పగించారు. ఇది 1887 వరకూ ఇలానే కొనసాగింది. ఆ కాలంలో ఆయన లాహోర్ డివినిటీ కళాశాలను 1870లో తెరిచారు.[23][24][25] రెవరెండ్ థామస్ పాట్రిక్ హ్యూస్ చర్చి మిషనరీ సొసైటీ యొక్క మిషనరీగా పెషావర్ లో (1864–84) పనిచేసి, ప్రాచ్య పండితుడై డిక్షనరీ ఆఫ్ ఇస్లాం (1885) గ్రంథాన్ని సంకలనం చేశారు.[26]
మిషనరీలు పోర్చుగల్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ ప్రాంతాల నుంచి వలసదారులతో కలిసివచ్చారు. క్రైస్తవాన్ని ప్రధానంగా 18, 19 శతాబ్దాల్లో భారతదేశానికి బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చారు. బ్రిటీష్ వారు నెలకొల్పిన నగరాల్లో ఈ అంశం సుస్పష్టంగా కనిపిస్తుంది. బ్రిటీష్ వారు అభివృద్ధి చేసిన రేవు నగరం కరాచీలో పాకిస్తాన్ లో అతిపెద్ద చర్చి అయిన సెయింట్ పాట్రిక్ కెథెడ్రల్, బ్రిటీష్ కంటోన్మెంట్ నెలకొల్పిన రావల్పిండిలో అనేక చర్చిలో ఆ దశలో నిర్మించినవే.
మొత్తం పంజాబీ క్రైస్తవుల సంఖ్య పాకిస్తాన్ లో దాదాపు 28 లక్షలు కాగా, భారత పంజాబ్ లో 3 లక్షలు. వీరిలో దాదాపుగా సగం మంది రోమన్ కేథెలిక్ లు కాగా, మిగతా సగం ప్రొటెస్టెంట్లు. పలువురు ఆధునిక పంజాబీ క్రైస్తవులు బ్రిటీష్ పరిపాలన కాలంలో మతం మారిన వారి వారసులే, వారిలో చురా వర్గం నుంచి క్రైస్తవం స్వీకరించినవారూ ఉన్నారు. చురాలు బ్రిటీష్ ఇండియా కాలంలో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున క్రైస్తవంలోకి మారారు. మత విషయాల్లో ఉత్సాహవంతులైన బ్రిటీష్ సైనికాధికారులు, క్రైస్తవ మిషనరీలు మఝబీ సిక్ఖు సముదాయం కూడా హిందూ చురాలతో పాటుగా క్రైస్తవం స్వీకరించారు. భారత విభజన తర్వాత వీరు పాకిస్తానీ పంజాబ్, భారత పంజాబ్ ప్రాంతాలలో విభజింపబడ్డారు. ఇక్కడే కాక ఉత్తర ప్రదేశ్, రోహిలా ఖండ్ ప్రాంతాల్లోనూ మఝబీ సిక్ఖులు చాలా పెద్ద సంఖ్యలో క్రైస్తవంలోకి మారడంతో[27] సిక్ఖు సంస్థలు వేగంగా ప్రతిస్పందించి మత మార్పిడులు నిరోధించడానికి సిక్ఖు మిషనరీలను పంపారు.[28]
సంస్కృతి
మార్చుపంజాబీల సంస్కృతి పంజాబ్ ప్రాంతపు సంస్కృతి. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన, వైవిధ్యభరితమూ, సుసంపన్నమూ అయిన సంస్కృతుల్లో ఒకటి.
జిప్సీలు, ఓద్లు, సాధ్లు, గుజార్లు, అహిర్లు, ఖత్రీలకు ఇది మాతృస్థానం; ఇక్కడకు స్కైలాక్స్, అలెగ్జాండర్, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ వచ్చారు. ఆర్యనిజం, జొరాస్ట్రియన్ మతము, హెలెనిజం, బౌద్ధం, ఇస్లాం, సిక్ఖు మతం గతంలో సంవదిస్తూ పోటీపడడం ఇక్కడ చూశాం. ఆలోచనలు, కార్యాల్లో ప్రతి సంపర్కంలోనూ, ప్రతి ఉపద్రవంలోనూ, ప్రతి తాజా విప్లవంలోనూ ఈ భూమి ఎంత వెల చెల్లించింది? దాని రక్తంలోనూ, మేధలోనూ గ్రీస్, చైనా, టిబెట్, అరేబియా, ఈజిప్ట్, మధ్య, పశ్చిమ భారతాల నుంచి స్వీకరించి, సమన్వయం ఎలా చేసుకుంది? దాన్ని తెలుసుకుంటే మనం బౌద్ధం, దాని బయటి ఉద్దేశాలను కలప, రంగు, రాయి, చేతల్లో కూడా అనుసరించలేక కేవలం పంజాబీల మతంలోపలి కొంత భాగంగా ఎందుకు మిగిలిందో తెలుస్తుంది, ఎందుకు బ్రాహ్మణ కర్మకాండ జారిపోయి క్షత్రియ తాత్త్వికత, వేదాంతం ఎందుకు నిలిచాయో అర్థమవుతుంది; పర్షియాలో దాని మాతృభూమి నుంచి ఇస్లాం వాక్యం కన్నా స్ఫూర్తి ఎందుకు గ్రామీణ పంజాబ్ ను ఆకట్టుకుందో; చైనీస్, బెంగాలీ పిల్లల ఆటలు, చైనీయుల పిగ్తాల్, చైనీయుల ఇంద్రజాలం, గ్రీక్ అర్థ వృత్తాకార హెల్మెట్, రోజువారీ ఆహారం, పనులకు టర్కీ పదాలు, విక్రమాదిత్య రాజపుత్ కథలు, సంప్రదాయాలు, బౌద్ధ జానపద కథలు, సాధువుల కథలు, జ్ఞానం, పర్షియా, అరేబియాకు చెందిన ప్రేమికుల గాథలు, ఎందుకు ఈ భూమిలో తన స్థానాన్ని వెతుక్కున్నాయో, ఈ స్థానికుల ప్రేమను చురగొన్నాయో; అలానే ఎందుకు రామకృష్ణుల ఆరాధన ఇక్కడ వేళ్ళూనుకోలేదో, ఎందుకు సాధువులు విలసిల్లారో, ఇతర సంస్కృతులతో పోలిస్తే ఎందుకు చరిత్ర గతిలో మార్పులు అతికొద్ది స్థాయిలోనే జీవితంలోనూ, సాహిత్యంలోనూ నమోదయ్యాయో తెలుస్తుంది.
—మోహన్ సింగ్, ఎ హిస్టరీ ఆఫ్ పంజాబ్ లిటరేచర్ (1100-1932)[29]
భాష
మార్చుపంజాబీ /pʌnˈdʒɑːbi/[30] (షాముఖీ: پنجابی [paṉjābī] Error: {{Transliteration}}: unrecognized language / script code: Punjabi (help); గురుముఖీ: ਪੰਜਾਬੀ pañjābī)[31] ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో (2015 నాటికి) ఉన్న భాష.[32][33]. పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష.[34][35][36][37]
పంజాబీ వంటకాలు
మార్చుపంజాబీ వంటకాలు భారత్, పాకిస్థాన్ దేశాల్లో విస్తరించిన పంజాబీ ప్రాంతాల సంప్రదాయక ఆహారం. తందూరీ తరహా వంట తయారీ ఈ వంటకాల్లోని ప్రత్యేక విధానం. ఈ విధానం ప్రస్తుతం భారత్ లోని మిగిలిన ప్రదేశాల్లోనే కాక, యుకె, కెనెడా వంటి ఇతర దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది.
పురాతన సింధూ లోయ నాగరికతలోని జీవినవిధానం, వ్యవసాయ ప్రభావం ఈ ప్రాంతపు వంటకల్లో చాలా ఉంటుంది. ఈ వంటకాల్లో ప్రాంతీయ ప్రధాన పంటలు కీలకపాత్ర పోషిస్తాయి. శాఖాహారమైనా, మాంసాహారమైనా వెన్న ఎక్కువగా వాడటంతో ఈ వంటలు చాలా రుచికరమైనవిగా ప్రసిద్ధి చెందాయి. సర్సాన్ డా సాగ్, మక్కీ డీ రోటీ వంటకాలు వీరి ప్రధాన వంటలు.
పంజాబీ వంటకాల్లో బాస్మతీ (Basmati rice) బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్నంతో చేసే వంటల్లో ఎక్కువగా బాస్మతీ బియ్యాన్నే వాడతారు ఈ ప్రాంతం వారు. పంజాబీలో వండిన బియ్యాన్ని "చోల్" అంటారు. చాలా శాఖాహార, మాంసాహార వంటల్లో ఈ బియ్యం రుచి పెంచుతుందని చెప్తుంటారు పంజాబీలు. అందుకే ఈ బియ్యాన్ని ఎక్కువగా వాడుతుంటారు.[38][39][40]
పంజాబీ సంగీతం
మార్చుభాంగ్రా 1980ల నుంచి అభివృద్ధి అయిన నాట్యానుకూలంగా పంజాబీ లయ కలగలిసిన ప్రసిద్ధ సంగీతం. భాంగ్రా అన్న పేరు పంజాబీ సంప్రదాయ, జానపద నృత్యాల్లో ఒకదాని పేరును సూచిస్తోంది. కనుక భాంగ్రా సంగీతంలో ఆడిపాడడానికి అనుకూలమైన సంగీతం, లయలకు గాయకుడు, సాహిత్యం వంటివాటి కన్నా ప్రాధాన్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భాంగ్రా సంగీతం ప్రాచుర్యం పొందింది. సూఫీ సంగీతం, ఖవ్వాలి వంటివి పంజాబ్ లోని ఇతర ప్రధాన సంగీత ప్రక్రియలు[41][42]
పండుగలు
మార్చుపంజాబీ ప్రజలు అనేక పండగలను జరుపుకుంటారు. వాటిలో మతపరమైనవి, సంస్కృతి పరమైనవి ఉన్నాయి. ఈ సాంస్కృతిక పండగలను అన్ని మతాల ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ పండగల గూర్చి పంజాబీ కాలెండరును ఉపయోగిస్తారు. వీటిలో మాఘి, లోహ్రీ, బసంత్, హోలీ, వైశాఖి, రాఖి, తీయన్, లోహ్రీ, వైశాఖి, దీపావళి వంటివి ఉన్నాయి.
సంప్రదాయ దుస్తులు
మార్చుపురాతన పంజాబు ప్రాంతంలో ప్రజలు పత్తినూలుతో చేసిన వస్త్రాలను ధరించేవారు. స్త్రీపురుషులు ఇరువురు ధరించే పైదుస్తులు మోకాలును తాకుతూ ఉంటాయి. రెండుభుజాను కలుపుతూ స్త్రీలు దుపట్టా అనే వస్త్రాన్ని ధరిస్తుంటారు.స్త్రీపురుషులురువురు నడుంచుట్టూ ఒక వస్త్రాన్ని ధరిస్తుంటారు. తలకు మఫ్లర్ ధరిస్తారు. [43] ఆధునిక పంజాబీ దుస్తులు ఈ శైలిలో తయారు చేయబడుతున్నా. అయినప్పటికీ దీర్ఘకాల చరిత్రలో ఈ దుస్తులు అనేకరూపాంతరాలు చెందాయి.
19-20 శతాబ్ధాలలో పంజాబీ ప్రాంతం నూలు వస్త్రాల ఉత్పత్తి అభివృద్ధి చెందింది. లుంగి, ఖెస్, దతాహి, చద్దర్, కోస్టింగ్, షర్టులు(చొక్కాలు), తెరలు, సిసి, తెహ్మత్, దుర్రీలు, తువ్వాలు, డస్టర్లు, పత్కాలు తయారుచేయబడ్డాయి.ఇవి హోషిపూర్, గుర్‌దాస్‌పూర్, పెషావర్, లాహోర్, [[ముల్తాన్[44]]], అమృతసర్, లూధియానా, ఝంగ్, షహ్పూర్(పాకిస్థాన్), జలంధర్, ఢిల్లీ, గుర్గావ్ రోహ్తక్, కర్నల్,రెవారి,పానిపట్ నగరాలలో మొదలైనవి ఉత్పత్తి చేయబడుతున్నాయి[45] పంజాబీ దుస్తులకు నేతపరిశ్రమ సంపాన్నతను అధికం చేసింది. దుస్తులు పంజాబీ ప్రజల సంప్రదాయాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.[46][47] వైవిధ్యమైన పంజాబీ పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, వివాహాది సంప్రదాయ వేడుకలో విభిన్నమైన దుస్తులు ధరిస్తుంటారు. వీటితో విభిన్నమైన సంప్రదాయ దుస్తులు ఆభరణాలు సాధారణం.[48][49]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Pakistani Punjabis + Indian Punjabis + Diaspora
- ↑ 2.0 2.1 Gandhi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. ISBN 978-93-83064-41-0.
- ↑ Canfield, Robert L. (1991). Turko-Persia in Historical Perspective. Cambridge, United Kingdom: Cambridge University Press. p. 1 ("Origins"). ISBN 0-521-52291-9.
- ↑ Shimmel, Annemarie (2004). The Empire of the Great Mughals: History, Art and Culture. London, United Kingdom: Reaktion Books Ltd. ISBN 1-86189-1857.
- ↑ "Punjab, bread basket of India, hungers for change". Reuters. January 30, 2012. Archived from the original on 2015-06-26. Retrieved 2016-07-18.
- ↑ "Columbia Water Center Released New Whitepaper: "Restoring Groundwater in Punjab, India's Breadbasket" – Columbia Water Center". Water.columbia.edu. 2012-03-07. Archived from the original on 2019-12-22. Retrieved 2013-07-12.
- ↑ Malhotra, Anshu; Mir, Farina (2012). Punjab reconsidered : history, culture, and practice. New Delhi: Oxford University Press. ISBN 9780198078012. Archived from the original on 2016-03-07. Retrieved 2016-07-18.
- ↑ Ayers, Alyssa (2008). "Language, the Nation, and Symbolic Capital: The Case of Punjab" (PDF). Journal of Asian Studies. 67 (3): 917–46. doi:10.1017/s0021911808001204.
- ↑ Thandi (1996). Pritam S, Shinder S (eds.). Globalisation and the region : explorations in Punjabi identity. Coventry, United Kingdom: Association for Punjab Studies (UK). ISBN 1874699054.
- ↑ Encyclopedia of Sikhism Archived 2016-09-12 at the Wayback Machine - Punjab
- ↑ "Ain-i-Akbari". Archived from the original on 2018-07-14. Retrieved 2016-07-18.
- ↑ Punjabi Adab De Kahani, Abdul Hafeez Quraishee, Azeez Book Depot, Lahore, 1973.
- ↑ Canfield, Robert L. (1991). Turko-Persia in Historical Perspective. Cambridge, United Kingdom: Cambridge University Press. p. 1 ("Origins"). ISBN 0-521-52291-9.
- ↑ "Sikhism Religion of the Sikh People". www.sikhs.org. Retrieved 2023-02-22.
- ↑ "BBC - Religion: Sikhism". www.bbc.co.uk (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-02-22.
- ↑ "BBC - Religions - Islam: Sufism". www.bbc.co.uk (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-02-22.
- ↑ Gaur (2009). Surinder S, Dayal I (eds.). Sufism in Punjab : mystics, literature, and shrines. Delhi: Aakar Books. ISBN 8189833936.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Religion
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 19.0 19.1 Ghandi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. p. 1. ISBN 978-93-83064-41-0.
- ↑ Ghandi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. p. 2. ISBN 978-93-83064-41-0.
- ↑ Adherents.com. "Religions by adherents". Archived from the original (PHP) on 2011-12-29. Retrieved 2007-02-09.
- ↑ Alter, J.P and J. Alter (1986) In the Doab and Rohilkhand: north Indian Christianity, 1815-1915. I.S.P.C.K publishing p196
- ↑ Churches and Ministers: Home and Foreign Events New York Times, 13 January 1878.
- ↑ An Heroic Bishop Chapter VI. His Fourth Pioneer Work: The Lahore Bishopric.
- ↑ Beginnings in India By Eugene Stock, D.C.L., London: Central Board of Missions and SPCK, 1917.
- ↑ British Library Archived 2016-03-04 at the Wayback Machine. Mundus.ac.uk (18 July 2002).
- ↑ Alter, J.P and J. Alter (1986) In the Doab and Rohilkhand: north Indian Christianity, 1815–1915. I.S.P.C.K publishing p183
- ↑ Alter, J.P and J. Alter (1986) In the Doab and Rohilkhand: north Indian Christianity, 1815–1915. I.S.P.C.K publishing p196
- ↑ Singh, Mohan (1956). A History of Panjabi Literature (1100-1932). Amritsar: Kasturi Lal & Sons. p. 2.
- ↑ Laurie Bauer, 2007, The Linguistics Student's Handbook, Edinburgh
- ↑ Kachru, Braj B.; Kachru, Yamuna; Sridhar, S. N. (27 March 2008). Language in South Asia. Cambridge University Press. p. 128. ISBN 978-1-139-46550-2. Retrieved 24 October 2014.
Sikhs often write Punjabi in Gurmukhi, Hindus in Devanagari, and Muslims in Perso-Arabic.
- ↑ "Världens 100 största språk 2010" [The world's 100 largest languages in 2010]. Nationalencyklopedin (in స్వీడిష్). 2010. Retrieved 12 February 2014.
- ↑ "What Are The Top 10 Most Spoken Languages In The World?". Archived from the original on 2017-03-08. Retrieved 2016-07-18.
- ↑ Barbara Lust, James Gair. Lexical Anaphors and Pronouns in Selected South Asian Languages. Page 637. Walter de Gruyter, 1999. ISBN 978-3-11-014388-1.
- ↑ "Punjabi language and the Gurmukhi and Shahmuhi scripts and pronunciation". Omniglot.com. Retrieved 2012-08-03.
- ↑ "Phonemic Inventory of Punjabi" (PDF). Archived from the original on 2015-07-16. Retrieved 2016-07-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Geeti Sen. Crossing Boundaries. Orient Blackswan, 1997. ISBN 978-81-250-1341-9. Page 132. Quote: "Possibly, Punjabi is the only major South Asian language that has this kind of tonal character. There does seem to have been some speculation among scholars about the possible origin of Punjabi's tone-language character but without any final and convincing answer..."
- ↑ "JEERA RICE RECIPE". indianfoodforever.com/.
- ↑ "KADHI CHAWAL RECIPE". www.indianfoodforever.com.
- ↑ "Punjabi Pulao Biryani". khanapakana.com/. Archived from the original on 2020-11-28.
- ↑ Pande, Alka (1999). Folk music & musical instruments of Punjab : from mustard fields to disco lights. Ahmedabad [India]: Mapin Pub. ISBN 18-902-0615-6.
- ↑ Thinda, Karanaila Siṅgha (1996). Pañjāba dā loka wirasā (New rev. ed.). Paṭiālā: Pabalikeshana Biūro, Pañjābī Yūniwarasiṭī. ISBN 8173802238.
- ↑ Mohinder Singh Randhawa. (1960) Punjab: Itihas, Kala, Sahit, te Sabiachar aad.Bhasha Vibhag, Punjab, Patiala.
- ↑ url=http://punjabisuits.net Archived 2020-10-22 at the Wayback Machine
- ↑ Parshad, Gopal (2007) Industrial development in Northern India: a study of Delhi, Punjab and Haryana, 1858-1918 [1]
- ↑ "Punjabi Dressing". Coloursofpunjab.com. Archived from the original on 2015-05-03. Retrieved 2015-05-17.
- ↑ "Baisakhi Dress,Bhangra Dress,Gidda Dress,Dress for Baisakhi Festival". Baisakhifestival.com. Retrieved 2015-05-17.
- ↑ "Traditional Dresses of Punjab | Traditional Punjabi Attire". Discoveredindia.com. Archived from the original on 2015-09-23. Retrieved 2015-05-17.
- ↑ "Baisakhi Dress | Baisakhi Costume | Bhangra Dress". Baisakhi Festival (in ఇంగ్లీష్). Archived from the original on 2020-03-26. Retrieved 2020-03-26.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు