వాడుకరి:Chaduvari/ధగధగలు మిలమిలలు మినుకుమినుకులు

వికీపీడియాలో నెలనెలా జరిగిన ముఖ్యమైన పనుల క్లుప్త జాబితా (నేనంతే... దుష్ట సమాసాలు చేస్తా, రాస్తా. ఇది ప్రధాన పేరుబరి కాదు కాబట్టి) ఇది. పనిలో పనిగా.. నేను చేసిన పనులు కూడా ఇంకో కాలములో. గొప్ప పనులు, మంచి పనులు, ఒకమాదిరి పనులూ ఈ జాబితాలో ఉంటాయి. పట్టిక, ఇలా తిరగేసిన తేదీవారీ వరసలో ఉంటే నచ్చలేదా..? సరే.., క్ర. సం ను నొక్కండి, తేదీవారీ వరసలో వస్తుంది.

క్ర సం సంవ

త్సరం

నెల వికీలో జరిగిన ముఖ్యమైన పనులు నేను చేసిన పనులు
2024 మే ఎన్నికల ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. లక్ష్యాన్ని అధిగమించింది.

తెవికీ బడి కొనసాగింది.

2024 ఏప్రిల్ తెవికి బడిలో శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయ్.
2024 మార్చి స్త్రీవాదం, ఫోక్‌లోర్ ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది.
2024 ఫిబ్రవరి వికీ చరిత్రలోనే అత్యధికంగా కొత్త వ్యాసాలు (బాటు వ్యాసాలు కాకుండా) వచ్చిన నెల. స్త్రీవాదం ప్రాజెక్టు దీనికి ప్రధాన కారణం
2024 జనవరి విశాఖలో తెవికీ పండగ 2024 విజయవంతంగా జరిగింది.
1 2021 జనవరి
2 2020 డిసెంబరు
3 2020 నవంబరు భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పటికే ఉన్న జిలాల పేజీలతో పాటు కొత్త జిల్లాలకు పేజీలు సృష్టించడం,జిల్లా ముఖ్యపట్టణాలకు కొత్తగా పేజీలు సృష్టించడం ప్రాజెక్టు సంకల్పం. జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టును రూపొందించాను. అందులో సభ్యుడిగా పని కూడా మొదలుపెట్టాను. 104 అనువాద వ్యాసాలను ప్రచురించాను. అందులో 88 కొత్త పేజీలు. మిగతావి - ఈ సరికే ఉన్న పేజీల్లోని సమాచార స్థానంలో కొత్త సమాచారాన్ని చేర్చాను. నవంబరు 23 న 13 వ్యాసాలు, నవంబరు 25 న 11 వ్యాసాలు ప్రచురించాను.
4 2020 అక్టోబరు నెల రోజుల వ్యవధితో అనువాద ఉపకరణంతో వ్యాసరచన ఋతువు జరిగింది. ఋతువులో భాగంగా 36 వ్యాసాలను అనువదించాను. AWB వాడుకరి అనుమతి విధానాన్ని ప్రతిపాదించి, చర్చకు పెట్టాను. చర్చలో పెద్దగా ఎవరూ పాల్గొన;లేదు.
5 2020 సెప్టెంబరు మానవిక అనువాద పరిమితి తొలగింపు ప్రతిపాదనపై చర్చ, ఆ తరువాత వోటింగు జరిగింది. వోటింగు కాలంలో ఆవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపాదన వీగిపోయింది. ప్రతిపాదనకు వ్యతిరేకంగా నా వాదనను వినిపించాను. దానిపై జరిపిన వోటింగును వ్యతిరేకించాను. వోటింగు సమయంలో జరిపిన ప్రచారాన్ని, వోటింగు తెచ్చిన అంశాలనూ వ్యతిరేకించాను.

వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష విధానం పేజీని తయారు చేసాను. అందులోకి సభ్యులుగా తీసుకునేందుకు కొందరిని ప్రతిపాదించాను.వారికి రాసాను. ఇద్దరు చేరారు.

6 2020 ఆగస్టు మొలకల విస్తరణ ఋతువు మొలకల విస్తరణ ప్రాజెక్టు నిర్వహణ, మొలకల విస్తరణ. ఈ ప్రాజెక్టులో నేను విస్తరించిన మొలకల జాబితాను ఇక్కడ చూడొచ్చు
7 2020 జూలై మొలకల విస్తరణ ఋతువు మొలకల విస్తరణ ప్రాజెక్టు నిర్వహణ, మొలకల విస్తరణ
8 2020 జూన్ మొలకల విస్తరణ ఋతువు మొలకల వర్గీకరణ చేసి, ప్రాజెక్టు మొదలుపెట్టాను. మొలకల విస్తరణ చేసాను. నిరోధ నిర్ణయాల సమీక్షా సంఘం కోసం విధివిధానాలతో కూడిన వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం పేజీని తయారు చేసాను. ఈ విధివిధానాలు కొన్ని మార్పులతో సెప్టెంబరు చివర్లో ఆమోదం పొందింది.
9 2020 మే వాడుకరులపై విధించే నిరోధాలను సమీక్షించేందుకు ఒక సమీక్షా సంఘం ఉండాలని రచ్చబండలో తగు మద్దతుతో సముదాయం అంగీకరించింది. ఈ సమీక్షా సంఘం ప్రతిపాదనను ప్రవేశపెట్టాను
10 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం. 30 రోజుల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కింద ఏప్రిల్ నెలలో 31 లక్షల బైట్లు చేర్చాను. ఆ వివరాలు చూడండి
11 2020 మార్చి 1. మరియుల ఏరివేత. రామారావు, వెంకటరమణ గార్లతో కలిసి AWB వాడి మరియులను ఏరేసాను.

2. యాంత్రికానువాద వ్యాసాల స్థానంలో కొత్త పేజీలను సృష్టించాలని అనుకున్న 20 వ్యాసాల సృష్టి పూర్తైంది.

12 2020 ఫిబ్రవరి గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలను (~2000) తొలగించడం. గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలను (~2000) తొలగించాను. తొలగించిన పేజీల స్థానంలో కొత్త పేజీలను తిరిగి సృష్టించడం మొదలు. మార్చి ముగిసే లోపు 20 వ్యాసాలు సృష్టించాలనే లక్ష్యం.

అనువాద పరికరంలో మానవిక అనువాదాలు కనీసం 30% ఉండాలని ప్రతిపాదించాను. "మరియు" లను రానీయకుండా, ఒక వడపోత ఉండాలని కూడా ప్రతిపాదించాను. ఈ చర్చలో ఒక్కరే పాల్గొన్నారు. చర్చ మేరకు నిర్ణయం ప్రకటించి అమలు చేసాను.

13 2020 జనవరి గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల తొలగింపుపై మరో చర్చ జరిపి ఆ వ్యాసాలను తొలగించాలని నిర్ణయించింది గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల తొలగింపుపై మరో చర్చను మొదలుపెట్టాను. మొత్తం ఈ విషయంపై జరిగిన చర్చలన్నిటినీ ఒక వ్యాస శృంఖలగా చేర్చాను.
14 2019 డిసెంబరు
15 2019 నవంబరు
16 2019 అక్టోబరు
17 2019 సెప్టెంబరు
18 2019 ఆగస్టు
19 2019 జూలై
20 2019 జూన్
21 2019 మే
22 2019 ఏప్రిల్
23 2019 మార్చి
24 2019 ఫిబ్రవరి
25 2019 జనవరి
26 2018 డిసెంబరు
27 2018 నవంబరు
28 2018 అక్టోబరు
29 2018 సెప్టెంబరు