వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం
.
- విధి విధానాల ప్రతిపాదన ఆమోదం పొందింది
- ఆ ప్రకారం విధాన పేజీని తయారు చెయ్యాలి
- సమీక్షా సంఘం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
- కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.
తెవికీలో నిర్వాహకులు అమలు చేసే కొన్ని కీలక నిర్ణయాలు ఎన్నో చర్చోపచర్చల తరువాతనే తీసుకుని, అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయాలు సాధారణంగా విస్తృత ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ప్రతి నిర్ణయానికీ వ్యతిరేకత ఉంటుంది. ముఖ్యంగా నిరోధం వంటి నిర్ణయాలు ఒకరో అంతకంటే ఎక్కువ మందో వాడుకరులను ప్రభావితం చేస్తాయి. ఆ నిర్ణయాలపై ఆయా వాడుకరులు విభేదించవచ్చు. అలాగే, ఆ నిర్ణయాలు తీసుకునే ముందు చేసే చర్చల్లో కొందరు వాడుకరులు వివిధ కారణాల వల్ల తమ అభిప్రాయాలను వెల్లడించక పోయి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉండకపోవచ్చు. న్యాయబద్ధంగానే ఉన్నప్పటికీ, బాధిత వాడుకరులకు అలా అనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బాధితులకు తరుణోపాయం ఏంటి?
ప్రస్తుతం ఒక తరుణోపాయం ఉంది: తనపై విధించిన నిరోధాన్ని పునస్సమీక్షించమని నిరోధం విధించిన నిర్వాహకుని కాకుండా ఇతర నిర్వాహకులను కోరవచ్చు. ఈ కొత్త నిర్వాహకులు నిరోధ నిర్ణయం తీసుకున్న చర్చలో పాల్గొని ఉండకూడదు. అయితే తెవికీలో చురుగ్గా ఉండే వాడుకరుల సంఖ్యను గమనిస్తే, అలాంటి జోక్యం చేసుకోకుండా ఉన్న నిర్వాహహకులు ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో బాధితులకు మరొక అవకాశం కలిగించడమే ఈ విధాన ఉద్దేశం.
ఇంగ్లీషు వికీపీడియాలో గతంలో ఒక మధ్యవర్తిత్వ సంఘముండేది. అది రికమెండేషను మాత్రమే ఇచ్చేది. దాని నిర్ణయం శిరోధార్యమేమీ కాదు. కానీ, వారి ఆర్బిట్రేషన్ కమిటీ నిర్ణయాలు మాత్రం ఎన్వికీకి శిరోధార్యం. దీన్లో ఎన్వికీ వాడుకరులే సభ్యులుగా ఎన్నికౌతారు, బయటి వికీల వారు కాదు. అయితే తెవికీలో ఆర్బిట్రేషన్ కమిటీ పెట్టుకునేంత మంది అనుభవమున్న వాడుకరులు లేరు. అందుచేత బయటివారితో ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు తిసుకునే నిరోధ నిర్ణయాలపై ఒక సమీక్షా విధానాన్ని ఏర్పరచుకోవడమే ఈ ప్రతిపాదన పేజీ ఉద్దేశం. దీని కోసం ఒక సంఘాన్ని ఏర్పరచుకోవాలని సముదాయం సూత్రప్రాయంగా నిశ్చయించింది. ఈ సంఘ నిర్మాణం, దాని హోదా, పని మార్గదర్శకాలు వగైరాలను ఈ పేజీ ప్రతిపాదిస్తోంది.
సంఘ నిర్మాణం
మార్చు- పేరు: వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం
- పరిధి: నిర్వాహకులు వాడుకరులపై విధించే నిరోధాలపై సమీక్ష.
- సభ్యుల సంఖ్య: 3
- సభ్యుల కాలావధి: రెండేళ్ళు
- హోదా: ఈ సంఘం తన దృష్టికి వచ్చిన కేసును దర్యాప్తు చేసి, రికమెండేషన్లు మాత్రమే ఇస్తుంది. వాటిని బట్టి సముదాయం నిర్ణయం తీసుకుంటుంది.
సభ్యుల అర్హతలు
మార్చు- వికీపీడియా విధానాలు, పద్ధతుల పట్ల అవగాహన కలిగిన వాడుకరులై ఉండాలి. (దీనికి కొలబద్దగా వారు ఏ వికీపీడియాల్లో నైనా, ఏ పేరుబరిలోనైనా కనీసం 5000 దిద్దుబాట్లు చేసి ఉండాలి.)
- తెలుగు వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే సభ్యులై "ఉండకూడదు". (అంటే గత మూడేళ్ళలో మొత్తం 50 దిద్దుబాట్లకు మించి చేసి ఉండకూడదు)
- తెలుగు మాతృభాషగా కలిగినవారు లేదా తెలుగు క్షుణ్ణంగా రాయడం చదవడం తెలిసినవారై ఉండాలి.
వివాదంలో ఉన్న పక్షాలు
మార్చుఈ విచారణకు సంబంధించినంత వరకూ నిరోధం విధించిన నిర్వాహకుడు, దానికి గురైన వాడుకరి - వీరిద్దరూ ప్రత్యర్థి పక్షాలు. నిరోధ చర్చల్లో వీరికి మద్దతుగా నిలిచిన వాడుకరులు ఈ పక్షాల్లోకి రారు.
నిబంధనలు, మార్గదర్శకాలు
మార్చు- ఈ ప్రతిపాదన నెగ్గి విధానంగా మారితే, అప్పటి నుండి ఇది అమల్లోకి వస్తుంది. దీనికి ముందు జరిగిన నిరోధాలు అప్పీలుకు అనర్హం.
- నిరోధం విధించినప్పటి నుండి, అది ముగిసాక వారం వరకూ అప్పీలు చేసుకోవచ్చు.
- నిరోధిత వాడుకరి, మరో నిర్వాహకుని చేత సమీక్షింపజేసే అవకాశాన్ని వాడుకున్నప్పటికీ, సమీక్షా సంఘాన్ని ఆశ్రయించవచ్చు. వాడుకోకపోయినా ఆశ్రయించవచ్చు.
అభ్యర్ధన, విచారణ, రికమెండేషను అమలు
మార్చు- నిర్వాహకుల నిరోధానికి గురైన వాడుకరి, ఈ సమీక్షా సంఘానికి తన వాదన చెబుతూ తగు ఆధారాలల నిచ్చి ఫిర్యాదు చేసుకుంటారు.
- ఫిర్యాదు లేనిదే సంఘం జోక్యం చేసుకోదు.
- ఫిర్యాదు బాధితుడు మాత్రమే చెయ్యాలి.
- ఫిర్యాదు ముగ్గురు సభ్యులలో ఎవరికైనా, ఎందరికైనా చెయ్యవచ్చు. అభ్యర్ధన సభ్యుల స్వంత వికీలోని చర్చా పేజీలో గాని, ఈ మెయిలు ద్వారా గానీ, లేదా ఆ సభ్యులు సూచించిన మరే పద్ధతిలోనైనా చెయ్యవచ్చు.
- సమీక్షా సంఘం ఆ కేసును తోసిపుచ్చవచ్చు, లేదా విచారణకు స్వీకరించవచ్చు.
- స్వీకరించినదీ లేనిదీ వారు తెవికీలో రచ్చబండలో సంబంధిత నిర్వాహకులనూ, బాధితునీ ప్రస్తావిస్తూ తమ నిర్ణయాన్ని తెలియబరచాలి.
- సభ్యుల్లో ఎవరైనా, ఎందరైనా కేసుపై దర్యాప్తు చెయ్యవచ్చు. సంఘం, చర్య తీసుకున్న నిర్వాహకుని వివరణ కోరితే నిర్వహకుడు తన తరపున వాదనను వినిపిస్తూ తగు ఆధారాలను ఇస్తారు.
- విచారణకు స్వీకరించాక, (
2) 7 రోజుల్లో సంఘం ఈ అధారాలను పరిశీలించి, తన నిర్ణయాన్ని తగు హేతువులతో వెలువరిస్తుంది. ఈ సమయంలో సంఘం అడిగితే తప్ప ఇరుపక్షాలు గానీ, మరెవ్వరైనా గానీ ఎటువంటి వాదనలూ చెయ్యరాదు, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు. సంఘ నిర్ణయం సముదాయానికి ఒక రికమెండేషను మాత్రమే. శిరోధార్యమేమీ కాదు. ఎందుకంటే, నిర్వాహకుని నిర్ణయాన్ని సమీక్షిస్తూ నిపుణుల సలహాకు గాను, సముదాయం ఈ సంఘాన్ని నియమించుకుంది. సంఘం సముదాయానికి సలహా ఇస్తుంది. అంతిమ నిర్ణయం మాత్రం సముదాయానిదే. - ఈ రికమెండేషన్ను పాటించాలా తిరస్కరించాలా అనే ప్రశ్నపై సముదాయం వోటింగు నిర్వహిస్తుంది. చర్చేమీ జరగదు, రెండు ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని వోటింగు ద్వారా ఎంచుకుంటుంది. వోటింగుకు గడువు (
1) 2 రోజులు. ఈ వోటింగులో, వివాదంలో ఉన్న రెండు పక్షాలకూ ప్రమేయం ఉండదు. సముదాయం తీసుకునే నిర్ణయం ఇరుపక్షాలకూ శిరోధార్యమే. వోట్లు సమానంగా వస్తే, సంఘం ఇచ్చిన రికమెండేషన్ను ఆమోదించినట్లే - విచారణకు, వోటింగుకూ పట్టిన (
3) 9 రోజుల గరిష్ఠ కాలంలో నిర్వాహకులు విధించిన నిరోధం అమలు ఆగదు, జరుగుతుంది. - విచారణ తెవికీలో ఉన్న విధానాల ప్రకారం జరుగుతుంది. తెవికీలో విధానం స్పష్టంగా లేకున్నా, అసలే లేకున్నా ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్న విధానాన్ని అనుసరిస్తుంది.
పర్యవసానాలు
మార్చు- నిర్ణయం వచ్చేనాటికి నిరోధం ఇంకా అమల్లో ఉంటే, నిర్ణయం ఆ నిరోధాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే నిర్ణయం నిరోధానికి వ్యతిరేకమైతే, నిరోధం తక్షణమే ముగుస్తుంది. అప్పటికే నిరోధ కాలం ముగిస్తే, ప్రభావమేమీ ఉండదు.
- ఈ ఫలితాన్ని నిరోధాల సమీక్షా పేజీలో చేరుస్తారు.
- నిర్ణయం, నిరోధానికి వ్యతిరేకంగా వస్తే అది ఆ నిర్వాహకునిపై అభిశంసనగా భావించరాదు.
- నిర్ణయం, నిరోధానికి అనుకూలంగా వస్తే అది నిరోధిత వాడుకరిపై కొత్త అభియోగంగానో, మరో నిరోధంగానో భావించరాదు.
అభిప్రాయాలు
మార్చుబాగున్నవి, అయితే సూచనలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఇచ్చిన సూచనలు అమలు పరచగలిగే అధికారం కూడా ఉంటే బాగుంటుంది అలా కుదరని పక్షములో సముదాయం నిర్ణయం మీద కేవలం ఓటింగ్ కాకుండా ఒక విధివిధానం ఉంటే బాగుంటుంది, ప్రతిదీ ప్రజాస్వామ్య పద్దతిలో ఓట్ల సంఖ్య ప్రకారం తుది నిర్ణయం చేయలేము.ఎక్కువ మిత్ర బలం వున్న వాడుకదారునికే తీర్పు అనుగుణం గా ఉంటుంది, ఇది సమన్యాయానికి విఘాతం Kasyap (చర్చ) 12:14, 5 జూన్ 2020 (UTC)
చర్చ
మార్చురచ్చబండ పాలసీలు అన్ని బాగున్నాయి, వాడుకరి నిరోధక సమీక్ష సంఘం...
- సభ్యుల సంఖ్య 3,
- సభ్యుల అర్హతల పై రెండు చాలా ఇబ్బంది, ఉదాహరణకు
- వాడుకరికి కనీసం 5000 దిద్దుబాట్లు ఉండాలి అన్నారు.
వాడుకరి రికార్డులకు కోసం నా లాంటోళ్లు (వికిపీడియా రికార్డులకు)వ్యతిరేకంగా ఉంటారు, అనగా ఒకే దిద్దుబాటు తో ఒక వ్యాసాన్ని నిర్మిస్తాను. (నా సొంత డబ్బా కాదు నా వ్యాసాలు గమనించండి నాకు కాస్త అనుభవం వచ్చాక రాసిన ఈ మద్య రాసిన వ్యాసాలు)
- రెండవది గత మూడేళ్లలో మొత్తం 50 లోపు దిద్దుబాట్లు మించి చేయకూడదు అన్నారు.
- నా అభిప్రాయం ప్రకారం అలాంటి వాడుకరి చాలా బిజీగా ఉంటారు.
- వారు ఏ వాడుకరి నిరోధానికి ఎప్పుడు గురి అయ్యారు ఎలా తెలుస్తోంది.
- వెయ్యి రోజుల దిద్దుబాట్లు 50 లోపు చేసేవారు వాళ్లు గమనించే నాటికి వాడుకరి నిరోధం కాలం ముగిసిపోతుంది పై రెండు నిబంధనలు సమీక్ష సంఘం ద్వార పూర్తిస్థాయి న్యాయం వాడుకరికి లభించదు ఏమో అనుకుంటున్నాను సార్.ప్రభాకర్ గౌడ్ నోముల 16:44, 3 జూన్ 2020 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, కొన్ని ముఖ్యమైన విషయాలను మళ్ళీ మీ దృష్టికి తెస్తాను. కొన్నిటిని మీరు గమనించలేదేమోనని నాకు అనిపిస్తోంది
- 5000 దిద్దుబాట్లు తెలుగేతర వికీలో చేసి ఉండాలి. సభ్యుడు అనుభవశాలి అయి ఉండాలనేది మన ఆవశ్యకత. దానికి వేరే కొలబద్ద ఉంటే దాన్ని పరిశీలించవచ్చు.
- తెవికీలో మూడేళ్లలో మొత్తం 50 లోపు దిద్దుబాట్లు మించి చేయకూడదు అని ఎందుకన్నామంటే, వాళ్ళు తెలుగు వికీపీడియాలో చురుగ్గా ఉండకూడదు అనేది మన ఆవశ్యకత కాబట్టి
- అలాంటి వ్యక్తికి ఏ వాడుకరి ఎప్పుడు నిరోధానికి గురి అయ్యారో ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించారు. నిరోధిత వాడుకరి వారిని అభ్యర్ధించినప్పుడే వాళ్ళకు తెలుస్తుంది. అభ్యర్ధన లేకపోతే వాళ్ళసలు జోక్యం చేసుకోరు
- __చదువరి (చర్చ • రచనలు) 02:50, 4 జూన్ 2020 (UTC)
Kasyap గారూ, "సూచనలు అమలు పరచగలిగే అధికారం కూడా ఉంటే బాగుంటుంది" - "సముదాయం సర్వోన్నతం" కాబట్టి, తుది నిర్ణయం సముదాయానిదే అయి ఉండాలనే అభిప్రాయంతో అలా రాసాను. సముదాయానికి ఈ సమీక్షా సంఘం ఒక ఎక్స్పర్ట్ ఎడ్వైస్ ఇస్తుంది. దాన్ని బట్టి సముదాయం నిర్ణయం తిసుకుంటుంది. ఇకపోతే.., వోటింగు మాత్రమే కాకుండా చర్చి జరగాలన్న మీ అభిప్రాయం- ఈ విషయంలో నేను ఏమనుకున్నానంటే, నిరోధ నిర్ణయం జరిగే ముందే సముదాయం దీనిపై చర్చించే అవకాశం కలిగింది కాబట్టి మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్పర్టుల అభిప్రాయం కూడా వచ్చింది కాబట్టి వోటింగు సరిపోద్ది అనుకున్నాను. ఇతర వాడుకరులు ఏమంటారో చూద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 12:44, 5 జూన్ 2020 (UTC)
- చదువరి గారూ, ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తున్నందుకు అభినందనలు. ఐతే, కొన్ని సవరణలను కోరుతున్నాను:
- వికీ నియమాల పట్ల అవగాహన ఉందో లేదోనన్న పరిశీలనకు ఐదువేల ఎడిట్లు మాత్రమే కొలబద్ద కాదు, అందుకు బదులుగా ఆ ప్రతిపాదిత వాడుకరికి కొన్ని ప్రశ్నలు అడిగి, దానికి వారి సమాధానాలు ఎలా ఉన్నాయన్నదాని ఆధారంగా అవగాహన నిర్ణయించవచ్చు. ఈ పద్ధతి ఆంగ్ల వికీపీడియాలో నిర్వాహక హక్కు కోరి దరఖాస్తు చేసుకున్నవారి పట్ల అమలుచేయడం ఉన్నదే.
- "ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయంతో సమానం" అన్న ఆదర్శప్రాయమైన న్యాయసూత్రాన్ని అనుసరించి రెండు రోజుల్లో పరిశీలన, నిర్ణయం వెలువడాలన్న ఏర్పాటు సాగుతుందన్నది అర్థమవుతోంది. అది గొప్ప ఆదర్శం. అయితే, రెండు రోజులు అన్న కాలావధి ఆచరణ సాధ్యం కాదేమోనని నా అభిప్రాయం. దాన్ని వారం రోజులుగా మార్చగలిగితే కనీసం వారాంతాల్లోనైనా సమయాన్ని వెచ్చించేలా ఆ సమీక్షకులు ప్రణాళిక వేసుకోగలుగుతారు కాబట్టి పరిశీలించమని మనవి.
- వికీపీడియాలో నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే జరగాలి కాబట్టి ఈ సమీక్షా సంఘం చేసేవి సూచనలే అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే క్యాబినెట్ కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, కమీషన్ల వలె ఇవి సూచనలను అందిస్తుంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాల వలె, సముదాయమే ఇక్కడ సుప్రీం కాబట్టి సముదాయం తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవడానికి ఈ సమీక్షా సంఘం చేసిన సూచనలు ప్రాతిపదికగా తీసుకుని తిరిగి చర్చిస్తుంది. అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే - ఒక బహిరంగమైన సమీక్ష జరుగుతుందన్న ఎరుక ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తగ్గి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. --పవన్ సంతోష్ (చర్చ) 17:24, 17 జూన్ 2020 (UTC)
- సభ్యుల సూచనలను పరిగణన లోకి తిసుకుని కింది మాపులు చేసాను
- సమీక్షా సంఘం దర్యాప్తు గడువును 2 రోజుల్ నుండి 7 రోజులకు పెంచాను
- ఆ తరువాత సముదాయం వోటింగు గడువును 1 రోజు నుండి 2 రోజులకు పెంచాను
- కాబట్టి మొత్తం గడువు 3 రోజుల నుండి 9 రోజులైంది.
- సభ్యుల సూచనలను పరిగణన లోకి తిసుకుని కింది మాపులు చేసాను
పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 04:07, 2 సెప్టెంబరు 2020 (UTC)
- నిర్వాహకులు వాడుకరులపై విధించే నిరోధాలతో పాటుగా తెలుగు వికీపీడియా వ్యాప్తంగా ప్రభావం చూపించే విధానాల చర్చలపై నిర్ణయాలు వికీ పద్ధతిలో జరిగాయా లేదా అన్నది కూడా ఈ సంఘం పరిశీలించగలిగే వాటిలో చేరిస్తే బావుంటుంది. చర్చలో జరిగే అభిప్రాయాలను ఇది పరిశీలించదు, నిర్ణయం తీసుకున్న పద్ధతి సరైనదా కాదా అని మాత్రమే కేవలం పద్ధతినే పరిశీలన చేస్తుంది. చర్చ ఇంకా ముగియలేదు కనుక నా ఈ అభిప్రాయం పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 05:58, 21 సెప్టెంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారి సూచనతో నేనూ ఏకీభవిస్తున్నాను.అవసరమైన మంచి సూచన.--యర్రా రామారావు (చర్చ) 06:26, 21 సెప్టెంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరు చేసిన సూచన బాగుంది. పవన్ సంతోష్, యర్రా రామారావు గార్లకు..., సమీక్షా సంఘం ఏర్పాటై తన విధులు నిర్వహిస్తున్న క్రమంలో, అప్పుడు ఈ సూచనను కూడా పరిగణలోకి తీసుకుందాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:57, 29 సెప్టెంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారి సూచనతో నేనూ ఏకీభవిస్తున్నాను.అవసరమైన మంచి సూచన.--యర్రా రామారావు (చర్చ) 06:26, 21 సెప్టెంబరు 2020 (UTC)
నిర్ణయం
మార్చునిరోధ నిర్ణయాల సమీక్షా విధానం, వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను.
- నిర్వాహకులు వాడుకరులపై విధించే నిరోధాలపై సమీక్ష చేసేందకు వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం పేరులో ఒక సమీక్షా సంఘం ఏర్పాటు చేయడుతుంది. 3గురు సభ్యులు ఉండే ఈ సంఘంలోని సభ్యులు ప్రతి రెండేళ్ళకొకసారి మారుతూఉంటారు. తన దృష్టికి వచ్చిన కేసును ఈ సంఘం దర్యాప్తు చేసి ఇచ్చిన రికమెండేషన్లను బట్టి సముదాయం నిర్ణయం తీసుకుంటుంది. తుది నిర్ణయం సముదాయానిదే.
- వాడుకరి నిరోధాల సమీక్షా సంఘంలో సభ్యులు తెలుగు మాతృభాషగా కలిగినవారు లేదా తెలుగు క్షుణ్ణంగా రాయడం చదవడం తెలిసినవారై ఉండాలి. వికీపీడియా విధానాలు, పద్ధతుల పట్ల అవగాహన కలిగిన వాడుకరులై ఉండి, ఏ వికీపీడియాల్లోనైనా, ఏ పేరుబరిలోనైనా కనీసం 5000 దిద్దుబాట్లు చేసినవారై ఉండాలి. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో చురుగ్గా పాల్గొనని సభ్యులై (గత మూడేళ్ళలో మొత్తం 50 కంటే తక్కువ దిద్దుబాట్లు) ఉండాలి.
- నిరోధాల సమీక్షా గడువు మొత్తం 9 రోజులు (సమీక్షా సంఘం దర్యాప్తుకు 7 రోజులు, సముదాయం వోటింగుకు 2 రోజులు).
- వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను తయారుచేసి, సంఘ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిదింగా దీనిని ప్రతిపాదన చేసిన చదువరి గారిని కోరుతున్నాను. అలాగే, సంఘ ఏర్పాటు ప్రక్రియలో ఆసక్తి గల సభ్యులు కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:34, 29 సెప్టెంబరు 2020 (UTC)