వాడుకరి:Chaduvari/వ్యాసం చెక్‌లిస్టు
This template is being used in the wrong namespace. To nominate this talk page for deletion, go to Miscellany for deletion.
తొలగింపు విధానం ప్రకారం ఈ వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను "తొలగింపు కొరకు వ్యాసాలు" పేజీకి అనుబంధంగా ఉన్న ఈ వ్యాసపు ఉపపేజీలో రాయండి. వ్యాసంలో మార్పు చేర్పులు చేసేందుకు అభ్యంతరమేమీ లేదు. కానీ పేజీని పూర్తిగా ఖాళీ చెయ్యరాదు. చర్చ పూర్తయేంతవరకూ దీన్ని తొలగించనూ కూడదు. మరింత సమాచారం కోసం, తొలగింపు మార్గదర్శకాలు చూడండి. |
వికీపీడియా:మెరుగైన వ్యాసాలు పేజీలను తయారుచేసే ముందు చేసిన నేపథ్యంలో చేసిన పని ఇది. దీన్నుండి ఆ పేజీలు తయారయ్యాయి. చారిత్రికావసరం తప్పించి ఇక దీంతో వేరే పనేమీ లేదు.
వికీపీడియాలోని వ్యాసాల్లో చెయ్యడానికి చాలా పనులున్నాయి. ఒక్కో పనికి ఒక్కో స్థాయి కార్య కుశలత అవసరం. ఏయే పనులు చెయ్యాలి, రోజుకు/నెలకు/సంవత్సరానికి ఎన్ని పనులు చెయ్యాలి అనే లక్ష్యాలను స్పష్టంగా తమకు తామే నిర్దేశించుకుని పని చేసే వాడుకరులు కొందరున్నప్పటికీ, ఎక్కువమంది అలాంటి లక్ష్యాలు పెట్టుకోరు. ఏ పనులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేదానిపై స్పష్టత లేకపోవడం దీనికొక ప్రధాన కారణం. ఆ గజిబిజిని తొలగించి, వాడుకరులు తమతమ సామర్థ్యాలకు అనుగుణమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక క్రమ పద్ధతిలో, సమయబద్ధంగా పని చేసుకుంటూ పోయేందుకు అవసరమైన ముడిసరుకును అందించడం ఈ పేజీ లక్ష్యాల్లో ఒకటి. ఈ క్రమంలో వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచడాన్ని ఒక ఉద్యమంగా చెయ్యడం రెండో లక్ష్యం. వికీపీడియా సముదాయాన్ని ఒక్కటి చేసి, ప్రభావవంతమైన నిర్మాణాత్మకమైన సమష్టి కృషిని సమర్థవంతంగా చెయ్యడం మూడో లక్ష్యం.
ఈ మూడు లక్ష్యాలతో ఒక ఉద్యమాన్ని నడపాలి. ఈ ఉద్యమం మూడు స్థాయిల్లో ఉంటుంది. అన్ని స్థాయిల్లోనూ వాడుకరులు వ్యాసాన్ని మెరుగు పరుస్తారు. ఈ మూడు స్థాయిల్లో కూడా కొత్త పాఠ్యాన్ని చేర్చే అవసరం లేదు; కేవలం ఉన్న కంటెంటును మెరుగు పరచడమే! వాడుకరులు తమతమ ఆసక్తులను బట్టి ఏ స్థాయి ఉద్యమంలోనైనా, ఎన్ని స్థాయిల్లోనైనా పాల్గొనవచ్చు.
యాంత్రికానువాదం చేసి సృష్టించిన వ్యాసాలను ఈ ఉద్యమంలో చేర్చడం లేదు.
మొదటి స్థాయి ఉద్యమం
మార్చువ్యాసంలోని భాషలో ఉన్న దోషాలను సవరించడం. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, మరియు వంటి పడికట్టు పదాల తొలగింపు మొదలైనవి. ఈ పని చేస్తే వికీపీడియా వ్యాసాలు బాగా తేటపడతాయి. ఒక్కొక్క వాడుకరి రోజుకొక్క వ్యాసం చెయ్యవచ్చు ననేది ఒక అంచనా. యాంత్రికానువాదం చేసి సృష్టించిన వ్యాసాలను వదిలెయ్యాలి. ఆ వ్యాసాలను ఈ ఉద్యమంలో చేర్చడం లేదు.
వాడుకరులకు ఈ పని చెయ్యడానికి ఉన్న సౌలభ్యాలు.
- ఈ పని చేసేందుకు భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
- ఎక్కువ సమయం పెట్టాల్సిన పనిలేదు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
రెండవ స్థాయి ఉద్యమం
మార్చువికీపీడియా విజ్ఞాన సర్వస్వ వ్యాసం పేజీకి ఉండాల్సిన కనీసం మాత్రపు హంగులను సమకూర్చడం.
వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.
- ఈ పని చేసేందుకు భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
- వికీపీడియా కుశలత: ప్రాథమిక స్థాయి కుశలత ఉంటే చాలు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.
క్రమ సంఖ్య | అంశం | వ్యక్తి | సంస్థ | గ్రామం/పట్టణం/
నగరం/మండలం/ జిల్లా |
సినిమా | ఇతర పేజీలు |
---|---|---|---|---|---|---|
1 | సమాచారపెట్టె: సమాచారపెట్టె ఉంటే అందులో ఉండాల్సిన కనీస సమాచారం రాయాలి. అసలు పెట్టే లేకపోతే, సంబంధిత సమాచారపెట్టెను చేర్చి సమాచారం చేర్చాలి. (ఏ వ్యాసానికి ఏ మూస చేర్చాలో కింద రాయండి.)
|
••• | ••• | ••• | ••• | |
2 | వ్యాసంలో జనన వివరం రాయాలి | ••• | ••• | ••• | ••• | |
3 | వ్యాసంలో మరణ వివరం రాయాలి (జీవించి ఉన్న వ్యక్తులకు కాకుండా) | ••• | ••• | |||
4 | సమాచారపెట్టెలో జనన వివరం రాయాలి | ••• | ••• | |||
5 | సమాచారపెట్టెలో మరణ వివరం రాయాలి | ••• | ••• | |||
6 | తేదీ పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి | ••• | ••• | |||
9 | తేదీ పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి | ••• | ||||
10 | సంవత్సరం పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి | ••• | ||||
11 | సంవత్సరం పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి | ••• | ||||
12 | ఫలానా సంవత్సరంలోని జననాలు అనే వర్గాన్ని చేర్చాలి | ••• | ||||
13 | ఫలానా సంవత్సరంలోని మరణాలు అనే వర్గాన్ని చేర్చాలి | ••• | ||||
14 | అంతర్వికీ లింకులను చేర్చాలి | ••• | ••• | ••• | ••• | ••• |
15 | పేజీకి ఎడమ వైపున ఉన్న నేవిగేషను లింకుల్లో "వికీడేటా అంశం" లింకు లేకపోతే, సంబంధిత అంశానికి ఈ పేజీని జతపర్చాలి. అంశం అసలు ఉనికిలోనే లేకపోతే, ఆ అంశాన్ని సృష్టించాలి. | ••• | ••• | ••• | ••• | ••• |
16 | {{Authority control}} మూస: పేజీని ఎడిట్ మోడులో తెరిచి, అడుగున, మిగతా మూసలకు పైన ఈ మూసను ఉంచి పేజీని భద్రపరచండి. అయినా ఈ మూస పేజీలో కనిపించకపోతే, ఆందోళన పడవద్దు. ఈ పేజీకి సంబంధించిన వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లేమీ లేకపోతే, ఈ మూస కనిపించదు. కాబట్టి, పేజీని సేవు చేసాక, మూస కనబడ్డం లేదే అని ఆందోళన పడనక్కర్లేదు. మూసను పెట్టి మర్చిపోవాలి, అంతే) | ••• | ||||
17 | ఐ.ఎమ్.డి.బి ఐడీ (సమాచారపెట్టెలో ఈ ఐడీని చేర్చాలి.) | ••• | ••• | |||
18 | పేజీలో బొమ్మ లేకపోతే, కామన్స్‌లో వ్యాస విషయానికి సంబంధించిన సముచితమైన బొమ్మ ఉంటే దాన్ని చేర్చాలి | ••• | ••• | ••• | ••• | ••• |
మూడవ స్థాయి ఉద్యమం
మార్చుఈ స్థాయిలో వ్యాసానికి ఉండాల్సిన ఇతర హంగులను సమకూర్చాలి. ఆ హంగులు కింది పట్టికలో చూడవచ్చు.
వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.
- భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
- వికీపీడియా కుశలత: మధ్య స్థాయి కుశలత ఉంటే చాలు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.
క్రమ సంఖ్య | అంశం | వ్యక్తి | సంస్థ | గ్రామం/పట్టణం/
నగరం/మండలం/ జిల్లా |
సినిమా | ఇతర పేజీలు |
---|---|---|---|---|---|---|
1 | ప్రవేశిక (వ్యాసంలో విషయ సూచికకు ముందు వచ్చే ఉపోద్ఘాతం లాంటి భాగమే ప్రవేశిక. వ్యాసానికి ఉపోద్ఘాతాన్ని, వ్యాసం లోని ముఖ్యాంశాల సారాంశాన్నీ ప్రవేశికలో రాయాలి.) | ••• | ••• | ••• | ••• | ••• |
2 | మూలాలను చేర్చాలి: వ్యాసంలో అవసరమైన చోట్ల సముచితమైన మూలాలను చేర్చాలి. {{ఆధారం}} అనే మూసలు ఉంటే, మూలాలను చేర్చి వాటిని తొలగించాలి. | ••• | ••• | ••• | ••• | ••• |
3 | వ్యాసం వికీకరణ (విభాగాలుగా విభజన, వ్యాసపు ఆకృతి సవరణ, అనుచితమైన బయటి లింకుల తొలగింపు, | ••• | ••• | ••• | ••• | ••• |
4 | మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.
ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి, |
••• | ••• | ••• | ••• | ••• |
5 | {{Authority control}}: పేజీలో అడుగున ఈ మూస కనబడుతూ ఉంటే సరే! ఎడిట్ మోడ్‌లో మూస కనబడినప్పటికీ, సేవు చేసాక కనబడకపోతే, దాని వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లు ఏమీ లేనట్లే. వికీడేటా అంశం పేజీకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫయర్లను చేర్చండి. వెంటనే ఇక్కడ వికీపీడియా పేజీలో మూస ప్రత్యక్షమౌతుంది. | ••• | ••• | ••• | ||
6 | మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.
ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి, |
••• | ••• | ••• | ••• | ••• |
ఉద్యమాన్ని నడపడం
మార్చుఒక్కొక్క స్థాయిలో ఏయే వ్యాసాల్లో పని చెయ్యవచ్చో ఆ వ్యాసాల జాబితా తయారు చెయ్యాలి. వాడుకరులు తమకు కావలసిన వ్యాసాలను ఎంచుకుని వాటిపై పనిచేస్తారు. ఒక వారంలో లేదా ఒక నెలలో పూర్తి చెయ్యగల పనిని మాత్రమే ఎంచుకుంటారు. ముందుగా విశేష వ్యాసాలు, ఈ వారం వ్యాసాలు, మీకు తెలుసా వ్యాసాలు.. వంటి "మొదటిపేజీలో ప్రదర్శించిన వ్యాసాల"తో ఒక జాబితాను తయారు చేసి, ఆ జాబితాపై పని చెయ్యాలి.
స్వయంసమీక్ష
మార్చువాడుకరులు తాము చేసిన పనిని తామే సమీక్షించుకుంటారు. సమీక్షకులు వేరే ఎవరూ ఉండరు.