వాడుకరి:S172142230149/ఇసుకపెట్టె1

బ్రహ్మవైవర్త పురాణం లోని గణపతి ఖండములోని కథ. నారదుడు నారాయణ మునిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు." దేవతాశ్రేష్ఠుడైన గణపతి వృత్తాంతం ఏమిటి, గణపతి ఏవిధంగా జన్మించాడు, అతడు ఎట్టి తపస్సు చేసెను , బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ఉండగా ఇతడు అగ్రపూజకు ఏవిధంగా అర్హుడయ్యాడు, గణపతి ఏ దేవుడి అంశ, గజముఖుడైన గణపతి ఏక దంతుడు ఎలా అయ్యాడు, గణపతి యోనిజుడా, అయోనిజుడా ?" ఈ విధంగా ప్రశ్నించిన నారదునికి శ్రీమన్నారాయణుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు." గణపతి చరిత్ర అత్యంత రహస్యమైనది. సుఖమును, మోక్షమును కలిగించునది. దేవతలను పీడిస్తున్న రాక్షసులను సంహరించడానికి దుర్గాదేవి గా జన్మించి రాక్షసులందరిని సంహరించిన దేవత దక్షుని పుత్రిక సతీదేవి గా జన్మించింది. ఆ తరువాత సతీదేవికి ఈశ్వరునితో వివాహం జరుగుతుంది. నీరీశ్వర యాగం లో తన తండ్రి ఈశ్వరుని దూషించడం విని ప్రాణత్యాగం చేసి తరువాతి జన్మలో హిమవంతుడు, మేనాదేవి ల కుమార్తె గా జన్మిస్తుంది. పార్వతికి యుక్త వయస్సు వచ్చిన తరువాత శంకరునికి ఇచ్చి వివాహం చేస్తారు.

వివాహం అయిన తరువాత శంకరుడు పార్వతీ దేవిని తీసుకొని నిర్జనమైన నర్మదా తీరానికి వెళ్ళి అక్కడ రతిక్రీడలు జరుపుతుంటాడు. శంకరుడు వెయ్యి దివ్య సంవత్సరాలు రతిక్రీడలలో కాలం గడపడం చూసి దేవతలు సంకోచంలో పడి వీరిరువురికి ఏవిధమైన సంతానం కలుగునో అని ఆలోచించి బ్రహ్మ వద్దకు వెడతారు. బ్రహ్మ తనలోకమైన సత్య లోకం నుండి శ్రీమహావిష్ణువు లోకమైన వైకుంఠా నికి దేవతలతో వెడతాడు.

పరమేశ్వరుని వీర్యం పార్వతి లో ప్రవేశిస్తే దేవతలను, రాక్షసులను కూడా సంహరించే పుత్రుడు జన్మిస్తాడని అందువలన పరమశివు ని వీర్యస్కలనం భూమి మీద పడేటట్లు చేయండి అని శ్రీమహావిష్ణువు వారికి తరుణోపాయం చెబుతాడు.


ఆ మాటలు విన్న బ్రహ్మ తన లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. దేవతలచ్చటనుండి నర్మదా తీరం లోని పర్వతముల నడుమనున్న స్థలమునకు చేరి భయ విషణ్ణవదనులవుతారు. భయం వల్ల ఇంద్రుడు కుబేరుడి ని, కుబేరుడు వరుణుడి ని, వరుణుడు వాయువు ని, వాయువు యమధర్మరాజు ని, యముడు అగ్నిదేవు ని, అగ్నిదేవుడు సూర్యుడి ని, సూర్యుడు చంద్రుడి ని ఒకరినొకరు చూసుకొని పరమశివుడి రతిని భంగం చేయమంటారు.


అప్పుడు మొదట ఇంద్రుడు శివునితో

కింకరోషి మహాదేవ యోగీశ్వర నమోస్తుతే
జగదీశ జగద్భీజ భక్తానాం భయభంజన

మహాదేవ నీవేమి చేయుచున్నావు? యోగీశ్వరుడవు , జగదీశ్వరుడవు, భక్తుల భయము పొగొట్టే నీకు నమస్కారము.

ఈ విధమ్ముగా ఒకరివెనుక ఒకరు [[ఇంద్రుడు], వాని తరువాత సూర్యుడు,వాని తరువాత చంద్రుడు,చంద్రుడి తరువాత పవనుడు ఇంద్రుడగిన ప్రశ్ననే వేస్తారు. అప్పుడు పరమశివుడు పార్వతిని వదిలిపెట్టి ఆమె ఏమి అనుకొనునో అని ఆలోచించుచున్న సమయయం లో వీర్యస్కలనం జరిగి భూమి మీద పడుతుంది. ఆ వీర్యస్కలనము వల్ల జన్మించినవాడే కుమారస్వామి.

ఇలా వీర్యస్కలనం భూమిపై పడినప్పుడు శంకరుడు రతి కార్యము వదిలి ఆక్కడ ఉన్న దేవతలకు పార్వతి శాపము ఇచ్చునేమో యని తలంచి వారందరిని పరుగెత్తి పారిపోమ్మని సూచిస్తాడు. ఆ మాట విని పారిపోతున్న దేవతలు పార్వతి తన శయ్య మీదనుంచి లేచినప్పుడు కనిపిస్తారు. వారందరిని సంతానం కలుగకుండ ఉండుడని శపిస్తుంది.

ఆవిధంగా శపించి, క్రోధముతో ఉన్న పార్వతిని చూస్తే శివునకు భయం కలిగింది.పార్వతి, తాను సంతానానికి దూరమైనదని తలంచుకొని భూమిని తన పాదనఖాంగుష్ఠముతో రాయుచుండెను.శివుడు ఆమెను ఓదార్చుచు, "నీవు నావిషయమున ప్రసన్నురాలువు కమ్ము.నేను నీవలననే మంగళస్వరూపుడిని అయి ఉన్నాను.నీవు లేనిచో నేను శవము వలె అమంగళస్వరూపుడనైయుండువాడను" అనెను.ఆ విధంగా వేడుకొన్న శివునితో పార్వతి

కింత్వాహం కథయిష్యామి సర్వజ్ఞం సర్వరూపిణం
ఆత్మారామం పూర్ణకామం సర్వదేహేష్వధిష్ఠితం
కామినీ మానసం కామమప్రజ్ఞం స్వామి యేవదత్
సర్వేషాం హృదయజ్ఞం చ హృదీయం కథయామికిం
సుగోప్యం సర్వవారీణాం లజ్జాజనకకారణం
అకథ్యమపి సర్వాసాం మహేశ కథయామితే

"మహేశా! సర్వేశ్వరుడవైన నీకు సర్వము తెలుసు, సమస్తరూపములు కలిగి ఆత్మరాముడవైన యోగివి. కామాసక్తురాలగు స్త్రీ తన మనస్సులోని కోరికను తెలివితక్కువగ భర్తతోనైనను చెప్పుకొనును. నీవు అందరికోరికలు తెలిసిన వాడవు, సమస్తసుఖములలో గొప్పదైన స్త్రీ సుఖము ప్రియుడితో రమించడము, భర్తతో సమానమైన పుత్రుడికి జన్మనివ్వడం "అని రహస్యమైన కోరికను సిగ్గుతో వ్యక్తపరచింది.

ఆమాటలు విన్న శివుడు పార్వతితో పుణ్యకవ్రతము గురించి చెప్పనారంభించెను.పార్వతీ మాత అత్యంత నియమ నిష్ఠలతో వ్రతాన్ని పూర్తిచేస్తుంది. అప్పుడు శ్రీ మహా విష్ణువు అక్కడకు వచ్చి మీకు గణపతి జన్మిస్తాడని చెబుతాడు.