WU:ISHU
నా పేరు కె.ఐశ్వర్య్.నేను కాకరపర్తి భావనారాయణ కళాశాలలో బాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుతున్నాను.
kopuri.Ishwarya | |
---|---|
జననం | 11-10-1994 Vijayawada |
జాతీయత | Indian |
వృత్తి | Student |
వ్యాసరచన పోటీ కొరకు వ్యాసం
దుర్గాబాయి దేశ్ ముఖ్
మార్చుదుర్గాభాయి దేశ్ ముఖ్ ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు ఒక ప్రత్యేక సామాజిక కార్యకర్త అని పేరు. ప్రముఖంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఆమె రాజమండ్రి,జులై 15, 1909 న జన్మించింది. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి స్నాతక పట్టా పొందింది.తర్వాత న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది. ఆమె భారతదేశం లో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు.దుర్గాభాయి దేశముఖ్ ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకురాలు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క ప్రణాళికా సంఘం సభ్యురాలు.
బాల్యం మరియు చదువు
మార్చు1909వ సంవత్సరం జూలై 15వ తేదీన కాకినాడలో కృష్ణ్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు.బెనారిస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.
వివాహం
మార్చువీరి వివాహము 1953 జనవరి 22న చోటు చేసుకుంది. వివాహం చేసుకున్న దుర్గాబాయి ఆ తరువాత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గా మారింది.
ఆమె స్ధాపించినవి
మార్చుఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.
సంఘ సంస్కర్తగా
మార్చుసంఘ సంస్కర్తగా బాల్య వివాహము, వరకట్నం వంటి దురాచారాలపై పోరాడింది.ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాబడింది. ఆమెలోని ధైర్యసాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు. స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమీషన్ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి నాయకులతో కలిసి పని చేసిన ఆమె స్ర్తీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషి చేశారు.
డాక్టరేట్
మార్చురెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్ర్తీ అభ్యున్నతి కోసం ఎన లేని కృషి చేస్తున్నాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
అవార్డులు
మార్చు- పాల్ జి.హాఫ్మన్ అవార్డు.
- నెహ్రూ అక్షరాస్యత అవార్డు.
- UNESCO అవార్డు (అక్షరాస్యత రంగంలో అసాధారణమైన పని కోసం)భారతదేశం యొక్క ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ అవార్డు.
రచనలు
మార్చు1943లో దుర్గాబాయి ఆంధ్రమహిళ అనే పేరుతో ఒక మాస పత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాల్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దానిపేరు విజయదుర్గగా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ప్రచురించారు. లక్ష్మీ అనే నవల సీరియల్‌గా ప్రచురించారు. చిన్నతనం నుంచీ శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రమహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్‌చంద్ కథలను తెలుగులోకి అనువదించారు.
మరణం
మార్చుచైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడ్డ దుర్గాబాయి...1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు.