వాడుకరి చర్చ:Newafrican/సోమంచి కోదండ రామయ్య
Contested deletion
మార్చుప్రభాకర్ గారికి నమస్తే. నేను పైన పేర్కొన్న ఉత్తరేశ్వర దేవాలయం, బలగ, శ్రీకాకుళం కు సంబందించి కోదండ రామయ్య గురించి వ్యాసం రాసాను. దీనికి సంబందించిన 1934 వ సంవత్సరం డాక్యుమెంట్ కూడా వికీమీడియా లోనూ internet.archives.org లోనూ లభ్యమవుతోంది. దీనికి సంబందించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా లభ్యమవుతున్నాయి, కాగా అవి ప్రైవేటు డాక్యుమెంట్లు కనుకనే ఇందులో పొందుపరచలేదు. చాల దేవాలయాలు ఎవరు నిర్మించారో వివరాలు కూడా తెలియని పరిస్థితి ఉంది. వాటిని వెలుగులోకి తేవాలని అనుకుంటున్నాను, తెలిసిన లభ్యమవుతున్న వివరాలను వీలువెంబడి ప్రచురించాలని నేను భావిస్తున్నాను. ఈ వ్యాసంలో తటస్థత లేదా ఇతర అంశాలు ఉండాలని భావిస్తున్నారా ? సూచించగలరు. శ్రీకాకుళం, బలగ, లో గల ఉత్తరేశ్వర దేవాలయం ఎవరు నిర్మించారో ఎవరు పునరుద్దరించారో వివరాలు తెలిచేయడం ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఈ వ్యాసం తొలగింపు అవసరం లేకుండా కొనసాగాలని భావిస్తున్నాను. మీలాంటి వారి సూచనలతో ఇంకా మెరుగుపరచాబడాలని భావిస్తున్నాను. Newafrican (చర్చ) 12:48, 3 డిసెంబరు 2021 (UTC)
కోదండరామయ్య స్వయంగా తాను ఏ రచనలు చేయనప్పటికీ, ఇతర రచయితల మీద చాలా గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగించాడు. తన కుమారుడయిన సోమంచి వాసుదేవరావుతో పాటు వ్యాసంలో పేర్కొన్న ఇతర రచయితలకు స్ఫూర్తినిచ్చిన మార్గదర్శకుడు. తెలుగునాట చాలామంది విశిష్టవ్యక్తులు ఉన్నప్పటికీ చరిత్రను లిఖించే సంప్రదాయం పెద్దగా లేకపోవడం వలన వెలుగులోకి రాని వ్యక్తులను పరిచయం చేయడం ఈ వ్యాసం ఉద్దేశ్యం. Newafrican (చర్చ) 10:54, 29 డిసెంబరు 2021 (UTC)
Newafrican గారికి నమస్తే. సోమంచి కోదండ రామయ్య మంచి వ్యాసం రాశారు. దీనికి కొంత ప్రాధాన్యత రావాలంటే కొన్ని మూలాలు విషయ ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్లు ప్రైవేటు డాక్యుమెంట్లు కూడా మూలాలుగా చేర్చవచ్చు ముఖ్యంగా మీకు చెప్పొచ్చేది ఏమిటంటే వ్యాసం తొలగించాలని నా ఉద్దేశం అసలే కాదు, విషయ ప్రాధాన్యత చేరిస్తే వ్యాసం డిలీట్ కాకుండా ఉంటుంది. అభివృద్ధి చేయమని ఇంకా అతనిపైన రీసెర్చ్ చేసి విషయ ప్రాధాన్యత పెంచడం మా ప్రధాన ఉద్దేశం ఈ వ్యాసం విషయంలో మీకేమైనా సహాయం కావాలంటే అడగవచ్చు.ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 15:02, 29 డిసెంబరు 2021 (UTC)
- ప్రభాకర్ గారికి నమస్తే. మీ స్పందనకు కృతజ్ఞతలు. మీరు చెప్పిన సూచనలను తప్పక దృష్టిలో పెట్టుకుంటాను. లభ్యమవుతున్న అందుబాటులో ఉన్న మూలాలు ఆధారాలను వీలువెంబడి చేరుస్తాను. Newafrican (చర్చ) 02:50, 8 జనవరి 2022 (UTC)
- Newafrican గారు, ఈ వ్యాసానికి సరైన మూలాలు ఇంకా చేర్చేలేదు. 2022 మే 20వ తేదిలోపు మూలాలను చేర్చగలరు. లేదంటే, 21వ తేదీన ఈ వ్యాసం తొలగించబడుతుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:39, 11 మే 2022 (UTC)
- ప్రణయ్ రాజ్ గారికి నమస్తే. ఈ వ్యాసంలో వనరులు వద్ద మూలాలు వద్ద ( అవి కూడా ముద్రించబడిన గ్రంధం యొక్క ఆధారాలే) ఆధారాలు పేర్కొన్నాను. ఈ వివరాలతో ISBN నెంబరుతో ఒక గ్రంధం కూడా రాబోతోందని తెలిసింది. అది కూడా ప్రామాణికం అవుతుంది. కనుక మరికొంత వేచి వుండాలని నా అభిప్రాయం. కృతజ్ఞతలు. Newafrican (చర్చ) 04:28, 15 మే 2022 (UTC)
- ప్రణయ్ రాజ్ గారికి నమస్తే. ఒకవేళ మీరు ఈ విషయంలో ఏకీభవించనట్లయితే , గడువును మరికొంతకాలం పొడిగించగలరు. కృతజ్ఞతలు. Newafrican (చర్చ) 04:38, 15 మే 2022 (UTC)
- Newafrican గారూ, మీరు సోమంచి కోదండ రామయ్య జీవిత విశేషాలతో 19వేల బైట్ల వ్యాసం రాసి, ఆయన గురించిన ప్రస్తావన ఉన్న ఒక లింకును మాత్రమే మూలంగా చేర్చారు. సోమంచి కోదండ రామయ్య గారి గురించి మీరు రాసిన సమాచారపు విషయ ప్రాముఖ్యతను నిర్థారించడానికి, మీరు రాసిన వివరాలు ఉన్నవాటిని ( సోమంచి కోదండ రామయ్య జీవిత విశేషాలు ప్రచురించబడిన వెబ్సైట్ల లింకులు, వార్త పత్రికలు, పుస్తకాలు వంటివి) మూలాలుగా చేర్చాల్సివుంటుంది. గమనించగలరు. 2021 డిసెంబరు 1న మీరు ఈ వ్యాసం సృష్టించారు. మరుసటిరోజు వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు తొలగింపు మూసను పెట్టారు. ఆ తరువాత వ్యాసంలో మీరు కొంత సమాచారం, ఒక మూలం చేర్చి పక్కన పెట్టెసారు. అందుకే నేను చర్చాపేజీలో రాయాల్సివచ్చింది. మీకు ఎంత గడువు కావాలో తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 07:46, 15 మే 2022 (UTC)
- ప్రణయ్ రాజ్ గారికి నమస్తే. ఒకవేళ మీరు ఈ విషయంలో ఏకీభవించనట్లయితే , గడువును మరికొంతకాలం పొడిగించగలరు. కృతజ్ఞతలు. Newafrican (చర్చ) 04:38, 15 మే 2022 (UTC)
- ప్రణయ్ రాజ్ గారికి నమస్తే. ఈ వ్యాసంలో వనరులు వద్ద మూలాలు వద్ద ( అవి కూడా ముద్రించబడిన గ్రంధం యొక్క ఆధారాలే) ఆధారాలు పేర్కొన్నాను. ఈ వివరాలతో ISBN నెంబరుతో ఒక గ్రంధం కూడా రాబోతోందని తెలిసింది. అది కూడా ప్రామాణికం అవుతుంది. కనుక మరికొంత వేచి వుండాలని నా అభిప్రాయం. కృతజ్ఞతలు. Newafrican (చర్చ) 04:28, 15 మే 2022 (UTC)
- Newafrican గారు, ఈ వ్యాసానికి సరైన మూలాలు ఇంకా చేర్చేలేదు. 2022 మే 20వ తేదిలోపు మూలాలను చేర్చగలరు. లేదంటే, 21వ తేదీన ఈ వ్యాసం తొలగించబడుతుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:39, 11 మే 2022 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, ఈ వ్యాసంలో కొన్ని సవరణలు, కొంత విషయ ప్రాధాన్యత ఉంటే 1,2 మూలాలు ఉంటే సరిపోతుంది.
ఈ వ్యాసాన్ని తొలగించు మూస వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకు కారణాలు వివరిస్తున్న 1. కొత్త వాడుకరులను భయపెట్టకూడదు. 2. 1, 2 మూలాలు కూడా ఉన్నాయి. 3. జీవించి లేని వ్యక్తి గురించి వ్యాసం కాబట్టి కొంత సడలింపు ఇవ్వాలనుకుంటున్నాను. 4. న్యూ ఆఫ్రికన్ రచయిత ఈ వ్యాసాన్ని పదిహేను రోజుల తర్వాత కూడా కొన్ని సవరణలు చేయకపోతే నేను చేయాలనుకుంటున్నా అప్పటివరకు సమయం ఇవ్వవలసిందిగా అడ్మిన్ గారిని సమయం అడుగుతున్నా. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 11:39, 15 మే 2022 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారూ,
- 'ఈ వ్యాసంలో కొన్ని సవరణలు, కొంత విషయ ప్రాధాన్యత ఉంటే 1,2 మూలాలు ఉంటే సరిపోతుంది' అన్నారు. కానీ అక్కడ ఎలాంటి సవరణలు కనిపించలేదు, ఒకటే మూలాన్ని రెండుచోట్ల చేర్చారు. కానీ వ్యాసంలోని 19వేల బైట్ల సమాచారానికి సంబంధించిన మూలం కాదది.
- 'కొత్త వాడుకరులను భయపెట్టకూడదు' అన్నారు. Newafrican కొత్త వాడుకరి కాదు. 2018 అక్టోబరులోనే తెవికీలో చేరారు. దాదాపు 7 కొత్త వ్యాసాలు కూడా రాశారు. కొత్త వాడుకరులను భయపెట్టకూడదు అనేది సరైనదే కాని, కొత్త వాడుకరులు అంటే ఎవరు, ఎంతకాలం వరకు వాళ్ళని కొత్త వాడుకరులుగా పరిగణించాలి? ఈ మధ్యకాలంలో కొందరు కొత్త వాడుకరులు యాంత్రికానువాదం నుండి యాదాతదాంగా కాపీ చేస్తూ రోజుకు 2 లేదా 3 వ్యాసాలను రాస్తున్నారు. వారిని అడిగినపుడు ఇప్పుడిపుడే వ్యాసాలు రాయడం నేర్చుకుంటున్నాను అంటున్నారు. మరి అందరిని కొత్త వాడుకరులు అని పరిగణిస్తూ యాంత్రికానువాద వ్యాసాలు, మూలాలు లేని వ్యాసాలు, కాపీ పేస్టు వ్యాసాలతో వికీని అలానే వదిలేద్దామా?
- '1, 2 మూలాలు కూడా ఉన్నాయి' అన్నారు. మూలాల గురించి పైన ప్రసావించాను.
- 'జీవించి లేని వ్యక్తి గురించి వ్యాసం కాబట్టి కొంత సడలింపు ఇవ్వాలనుకుంటున్నాను' అన్నారు. సడలింపు అంటే ఏమిటి? విషయ ప్రాముఖ్యత, మూలాలు లేకుండా రాసిన వ్యాసాలను వదిలేయమంటున్నారా? అలా అయితే, విషయ ప్రాముఖ్యత, మూలాల వంటివి పట్టించుకోకుండా జీవించి లేని వ్యక్తుల అందరి గురించి వికీలో రాస్తే అయిపోతుంది కదా..!--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:03, 15 మే 2022 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారికి, ప్రణయ్‌రాజ్ వంగరి గారికి నమస్తే. కొన్ని ప్రచురితమైన గ్రంధాల వివరాలు వనరులు చేర్చాను. పరిశీలించగలరు. వీటిని ప్రామాణికంగానే పరిగణినించవచ్చేమో. కోదండరామయ్య గారి కుటుంబ సభ్యులు కొన్ని గ్రంధాలను ISBN నెంబరుతో పునర్ముద్రిస్తున్నారని తెలిసింది. కరోనా కారణంగా అది వాయిదా పడింది. పూర్తిస్థాయిలో పుస్తకం రావటానికి సమయం పడుతుంది కానీ, ఎంత కాలం పడుతుందో తెలియదు.
- ఈ వ్యాసంతో సంబంధం లేని విషయం అయినా నాకు కలిగిన అభిప్రాయం ఏమిటంటే :
- యాంత్రిక అనువాదం అయినా చేసే వారు తెలుగు భాషకు సేవ చేస్తూ మేలు చేస్తున్నట్లే కదా. తమిళ భాషలో వ్యాసాల సంఖ్యా ఒక లక్ష దాటి చాల కాలం అయింది. తెలుగు వాళ్ళం మనం బాగా వెనకబడినట్టు అనిపిస్తోంది. అలా అని నేను విషయ శుద్ధి లేని వ్యాసాలను అయినా అంగీకరించమని నా ఉద్దేశ్యం కాదు. కొంత మినహాయింపు ఉండవచ్చునని నా భావన. Newafrican (చర్చ) 08:58, 17 మే 2022 (UTC)
- Newafrican గారూ... నిజానికి ఈ వ్యాసాన్ని మొదట్లోనే తొలగించాలనుకున్నాను, కానీ మీరు ఎంతో శ్రమతో చాలా సమాచారాన్ని సేకరించి వ్యాసాన్ని రాశారు. ఒకవేళ నేను వ్యాసాన్ని తొలగిస్తే మీరు రాసిన సమాచారం వృధాగా పోతుందని అలోచించి వ్యాసాన్ని అభివృద్ధి చేయమని చర్చాపేజీలో రాశాను. 'కోదండరామయ్య గారి కుటుంబ సభ్యులు కొన్ని గ్రంధాలను ISBN నెంబరుతో పునర్ముద్రిస్తున్నారని తెలిసింది. కరోనా కారణంగా అది వాయిదా పడింది. పూర్తిస్థాయిలో పుస్తకం రావటానికి సమయం పడుతుంది కానీ, ఎంత కాలం పడుతుందో తెలియదు' అని అంటున్నారు కాబట్టి, ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని మీ వాడుకరి పేజీకి తరలిస్తున్నాను. సరైన మూలాలతో వ్యాసాన్ని అభివృద్ధి చేసిన తరువాత మరల ప్రధాన పేరుబరిలోకి తీసుకోనిరావచ్చు.
- 'యాంత్రిక అనువాదం అయినా చేసే వారు తెలుగు భాషకు సేవ చేస్తూ మేలు చేస్తున్నట్లే కదా' అన్నారు. వారు తెలుగు భాషకు సేవ చేస్తూ మేలు చేస్తున్నట్లేమో గాని తెవికీకి కాదండి, ఎందుకంటే గతంలో తెవిలో యాంత్రిక అనువాదం ద్వారా చేసిన వ్యాసాలలో 2500 పైగా వ్యాసాలు తొలగించబడ్డాయి. తెవికీలోని వ్యాసాలు పాఠకులు చదివేవిధంగా ఉండాలిగానీ, యాంత్రికానువాదం నుండి కాపీపేస్టు చేయడం కాదు. కాపీపేస్టు చేసిన వ్యాసాలు చదవడానికైతే పాఠకుడు తెవికీ దాకా రానక్కర్లేదు, గూగూల్ లో పేజీ ట్రాన్సులేట్ ద్వారా చదువుకుంటే సరిపోతుంది. యాంత్రిక అనువాదం చేసినాకూడా దాన్ని వికీ శైలీలోకి మార్చి రాయాలి. అప్పుడే మీరంటున్న తెలుగు భాషకు సేవ చేస్తూ మేలు చేస్తున్నట్లు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:43, 17 మే 2022 (UTC)
- Newafrican గారూ... నిజానికి ఈ వ్యాసాన్ని మొదట్లోనే తొలగించాలనుకున్నాను, కానీ మీరు ఎంతో శ్రమతో చాలా సమాచారాన్ని సేకరించి వ్యాసాన్ని రాశారు. ఒకవేళ నేను వ్యాసాన్ని తొలగిస్తే మీరు రాసిన సమాచారం వృధాగా పోతుందని అలోచించి వ్యాసాన్ని అభివృద్ధి చేయమని చర్చాపేజీలో రాశాను. 'కోదండరామయ్య గారి కుటుంబ సభ్యులు కొన్ని గ్రంధాలను ISBN నెంబరుతో పునర్ముద్రిస్తున్నారని తెలిసింది. కరోనా కారణంగా అది వాయిదా పడింది. పూర్తిస్థాయిలో పుస్తకం రావటానికి సమయం పడుతుంది కానీ, ఎంత కాలం పడుతుందో తెలియదు' అని అంటున్నారు కాబట్టి, ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని మీ వాడుకరి పేజీకి తరలిస్తున్నాను. సరైన మూలాలతో వ్యాసాన్ని అభివృద్ధి చేసిన తరువాత మరల ప్రధాన పేరుబరిలోకి తీసుకోనిరావచ్చు.