వాడుకరి చర్చ:YVSREDDY/వెలుపల ప్రసారాలు

తాజా వ్యాఖ్య: వెలుపలి ప్రసారాలు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri

శీర్షిక వ్యాసకర్త పేరున వున్నందున,వ్యాసంలో సమాచారం తక్కువగా వున్నందున,వ్యాస తొలగింపు ప్రతిపాదన సరైనదేపాలగిరి (చర్చ) 01:46, 28 ఫిబ్రవరి 2013 (UTC)Reply

పాలగిరి గారు, ఇది సభ్యపేజీకి అనుబంధ పేజీనే కాని వ్యాసం పేజీగా పరిగణించబడదు కాబట్టి తొలిగింపు ప్రతిపాదన చేసే అవసరం లేదండి. ఈ పేజీ సమాచారం వృద్ధిచేసిన పిమ్మట వ్యాసానికి మళ్ళించడానికి ఇదివరకు అర్జునరావు గారు చేసిన సూచన మేరకు (చూడండి) రెడ్డిగారు ఇలాచేశారని భావిస్తున్నాను. వ్యాసకర్త పేరు, చిన్న వ్యాసం అని కాకుండా ఇతర వికీ నియమాలు ఉల్లంఘిస్తే మాత్రం తొలిగింపు ప్రతిపాదన చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:31, 28 ఫిబ్రవరి 2013 (UTC)Reply

రావు గారు, మీ వివరణ సరియైనదిగా భావిస్తున్నాను,నాప్రతిపాదనను ఉపసంహరిస్తున్నాను.పాలగిరి (చర్చ) 22:35, 28 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఇలా ఉప సభ్య పేజీలో వ్యాసం రాస్తే దానిని ఇతర సభ్యులు ఎలా మార్పులు చేయగలుగుతారు. వ్యాస విస్తరణ కోసం సభ్య పేజీకి ఉప పేజి సృష్టించటం సరైన విధానమేనా?106.208.46.45 04:57, 1 మార్చి 2013 (UTC)Reply
ఇతరులు జోక్యం చేసుకోరాదనే ఉద్దేశ్యంతోనే అలా సభ్యపేజీకి ఉపపేజీలలో వ్రాసుకొనే అవకాశం ఉంది. దీనికై ఖచ్చితమైన నియమాలేవీ లేవు కాని ఇలాంటి అవకాశాన్ని కూడా దుర్వినియోగపరిస్తే మాత్రం తప్పకుండా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చర్చ తీస్తే అందరి అభిప్రాయాలూ తెలుసుకొనవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:36, 1 మార్చి 2013 (UTC)Reply

వెలుపలి ప్రసారాలు

మార్చు

బయట చిత్రికరించిన ప్రత్యక్ష ప్రసారాలు తప్పకుండ ముఖ్యస్టూడియోలోని మానిటరింగు మరియు సెన్సారు విభాగానికి వెళ్ళి,అక్కడసభ్యులు చూచినతరువాత ప్రసారం చేస్తారు.బయట చిత్రికరించిన దృశ్యాలలో ప్రజలమనోభావాలను నొప్పించే,ఒకవర్గం ప్రజలను ఉద్రేకపరచే దృశ్యాలు,మాటలువున్నచో,అసభ్యపదాలున్నచో వాటిని తొలగించినతరువాతనే ప్రసారం చేస్తారు.అందుచేతనే ప్రత్యక్షప్రసారంలో దృశ్యచిత్రికరణకు, ప్రసారానికి 5-7 నిమిషాల తేడా వుంటుంది.చిత్రికరణను బయటనుంచే,నేరుగా ప్రసారంచేసిన అవాంచితదృశ్యాలను,మాటలను సెన్సారు చేయుటకు వీలుండదు.అలాంటి దృశ్యాలను,మాటలను ప్రసారంచేసిన మిడియావారు క్రిమినల్ కేసులు ఎదుర్కొవలసివుండును.పాలగిరి (చర్చ) 15:25, 3 మార్చి 2013 (UTC)Reply

Return to the user page of "YVSREDDY/వెలుపల ప్రసారాలు".