వారసుడొచ్చాడు
వారసుడొచ్చాడు 1988 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రంలో వెంకటేష్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను అలంపురం గ్రామాన్ని, గ్రామంలో ప్రముఖ కుటుంబమైన దూపాటి వారిని కథా నేపథ్యంగా తీసుకొని చిత్రీకరణ సాగించారు.
వారసుడొచ్చాడు (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.మోహనగాంధీ |
---|---|
నిర్మాణం | కె.శారదా దేవి |
రచన | తనికెళ్ళ్ భరణి |
తారాగణం | వెంకటేష్, మోహన్ బాబు, సుహాసిని, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, నిర్మల |
సంగీతం | ఇళయరాజా |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | స్రవంతీ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
కథాగమనం
మార్చు- ప్రారంభ కథ
అలంపురం గ్రామపెద్ద అయిన దూపాటి వియ్యన్నగారికి ఇద్దరు కూతుళ్ళు రమాప్రభ, లక్ష్మి, ఒక కొడుకు ఉంటారు. ఆయన మరణానంతరం ఆయన భార్య నిర్మల ఆస్తిపస్తుల వ్యవహారలను చూసుకొంటుంది. ఆమె కొడుకు ఊరిలో శ్రీను ఒక కుర్రవాడిని చెరువులో తోసి ఊరు విడిచి పారిపోతాడు. ఆమె కూతుళ్ళకు పెళ్ళి అయిన తరువాత ఆమె అళ్ళుళ్ళయిన అమ్మిరాజు గొల్లపూడి మారుతీరావు, ఆస్తిని ఇష్టం వచ్చినట్టూగా తగలేస్తూ ఉంటారు.
బోస్ ఒక నిరుద్యోగి అతడు ఒక ఇంటర్యూకు వెళ్ళి అక్కడి ఆఫీసరును తిట్టి వచ్చేస్తాడు. ఆఫీసు బయట టీ త్రాగుతున్న అతనికి ఎదుట ప్లాటులో మంటలు చూసి అందులో నుంచి ఒక పాపను రక్షించి దెబ్బలతో ఆసుపత్రిలో చేరుతాడు. అక్కడ అపాటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న రఘుతో పరిచయం ఏర్పడుతుంది. జైలు నుండి పారిపోయి అదే ఆసుపత్రిలో దొంగ జబ్బుతో చేరతాడు కొలంబస్. ఒక పేపరులో "రఘు తిరిగిరా.. శ్ర్రీను చనిపోలేదు" అనే ప్రకటన చూసి అది తన కోసమేనని తనకు అందరూ ఉన్నారని తను శ్రీను చనిపోయాడనుకొని పారిపోయానని చెప్తాడు రఘు బోసుతో. చనిపోయేందుకు సిద్దంగా ఉన్న తను వెళ్ళినా ఉపయోగం లేదు కనుక తనబదులు తనలా వెళ్ళి ఆఖరు రోజులలో తన తల్లికి అండగా నిలబడమని బోసును ఒప్పించి తన ఊరు పంపిస్తాడు రఘు.
అదే ఊరిలో వడ్డీలకు అప్పులిస్తుంటాడు అంబాజీరావు. ఊరు వెళ్ళిన బోసును బావలు రకరకాలుగా పరీక్షించి గాని ఒప్పుకోరు. ఊళ్ళోని తండ్రిపేరున ఉన్న పాఠశాల దేవాలయాలవంటి ఇతర సౌకర్యాలను బాగుచేయిస్తాడు. గుడిలో తనను చూసి కోపంగా పూజారితో రఘు నాశనం అయిపోవాలని అర్చన చేయమన్న అన్నపూర్ణను చూస్తాడు. ఆమె గురించి తల్లిని అడిగితే ఆమె శ్రీను చెల్లెలని శ్రీ చనిపోయాడని అబద్దపు ప్రకటన పేపరుకు ఇచ్చానని నిర్మల చెపుతుంది. అన్నపూర్ణ తల్లిని ఎద్దు పొడవబోతే కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు రఘు. ఆసుపత్రికి వచ్చిన అన్నపూర్ణ బోసును తన అన్నను చంపిన హంతకుడిగా తిడుతుంది. అప్పటికి అన్నపూర్ణ గురంచి తెలిసిన బోస్ తనెవరో రఘుగా ఎందుకొచ్చాడొ చెప్తాడు. మార్పు కలిగిన అన్నపూర్ణ బోస్ను ప్రేమిస్తుంది. అసలైన రఘు తన తల్లిని ఆఖరు సారిగా చూడాలని వచ్చి దారిలో పడి ఉంటే రక్షిస్తుంది అన్నపూర్ణ. అతడే అసలు రఘు అని చెప్తాడు బోస్ ఆమెతో. బోస్ బావలు ఆస్తికోసం బోసుకు తమ తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అతను అప్పటికే అన్నపూర్ణను ప్రేమిస్తున్నాడని గండయ్య అమ్మిరాజులతో చెపుతాడు అంభాజీరావు. దానితో పగ పట్టిన బావలు బోస్ లేని సమయంలో అన్నపూర్ణను వ్యభిచారిగా అందరిముందు నిరూపించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకొని చితక తన్నుతారు బోస్, అంభాజీరావులు. అసలు కొడుకెవరో తెలిసిన నిర్నల రఘును తీసుకొని అక్కడికొస్తుంది. మీ బామరిదితో మీ కూతుళ్ళకు తాళి కట్టించాలనే కదా ఇంత చేసారు. కట్టించండీ చనిపోయే రఘుతో అంటాడు బోస్. తను చనిపోయాక కూడా బోస్ తన తల్లికి కొడుకుగా ఈఊరిలోనే ఉండిపోవాలని మాట తీసుకొని చనిపోతాడు రఘు. అన్నపూర్ణను పెళ్ళి చేసుకొని నిర్మలతోనే అక్కడే ఉండిపోతాడు.
తారాగణం
మార్చు- బోసుగా వెంకటేష్
- అన్నపూర్ణగా సుహాసిని
- అంబాజీరావు గా మోహన్ బాబు
- గండయ్యగా కోట శ్రీనివాసరావు
- నిర్మలమ్మ
- కొలంబస్ గా తనికెళ్ళ భరణి
- మాలాశ్రీ
- సంధ్య
- మల్లికార్జున రావు
చిత్రవిశేషాలు
మార్చు- ఈ చిత్రం అధిక భాగం పశ్చిమగోదావరి జిల్లా, అలంపురం గ్రామములో, సమీప గ్రామాలలోనూ చిత్రీకరణ జరుపబడింది.
- కథానుసారం నిజంగానే అలంపురం గ్రామంలో కల దూపాటి వియ్యన్న గారి కుటుంభాన్ని నేపథ్యంగా వాడడం జరిగింది.
- తక్కువ బడ్జెటుతో రూపొందించిన ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని పొందినది.
- ఈ సినిమాలో నిర్మల అళ్ళుళ్ళుగా నటించిన కోటశ్రీనివాసరావు సంభాషణ తెలంగాణా మాండలికంలోనూ, గొల్లపూడి సంభాషణ శ్రీకాకుళం మాండ్లికంలోనూ రాసారు.
- మహేష్ బాబుహీరోగా వచ్చిన 'అతడు' చిత్రానికి ఈ చిత్రానికి కథాపరంగా చాలాపోలికలు కనపడతాయి.
పాటలు
మార్చు- యేలాద్రి ఎంకన్నా, ఏడదాగినావు , రచన: జాలాది రాజారావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నీ అందం , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- పచ్చిపాల , రచన: వెన్నెలకంటి రాజేశ్వర రావు, గానం ఎస్ పి శైలజ, కె ఎస్ చిత్ర
- గుజ్జనగుడి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,
- చెంపదెబ్బ , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- జంజంకుఝనకు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల