వాలెంటైన్స్ నైట్

వాలెంటైన్స్ నైట్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. స్వాన్‌ మూవీస్‌ సమర్పణలో ఫన్‌ సాగ బ్యానర్‌పై తృప్తి పాటిల్‌, సుధీర్‌ యాళంగి మహీంధర్‌ నారల నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ గోపిరెడ్డి దర్శకత్వం వహించాడు. సునీల్‌, చైతన్య రావు, లావణ్య, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 26న విడుదలైంది.[1]

వాలెంటైన్స్ నైట్
దర్శకత్వంఅనిల్‌ గోపిరెడ్డి
నిర్మాత
  • తృప్తి పాటిల్‌
  • సుధీర్‌ యాళంగి
  • మహీంధర్‌ నారల
తారాగణం
సంగీతంఅనిల్‌ గోపిరెడ్డి
నిర్మాణ
సంస్థ
ఫన్‌ సాగ
విడుదల తేదీ
2023 జనవరి 26 (2023-01-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అజయ్(చైతన్య రావు) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. అతడు ప్రియ (లావణ్య)తో ప్రేమలో ఉంటాడు. అయితే వీరిద్దరికీ అనుకోకుండా బ్రేకప్ అవుతుంది. అలాగే డ్రగ్ మాఫియా లీడర్ గా (శ్రీకాంత్ అయ్యంగార్) సిటీలో చెలామణి అవుతుంటారు. డ్ర‌గ్స్ వ్యాపారాన్ని అరిక‌ట్ట‌డానికి నియ‌మించ‌బ‌డిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ కృష్ణ‌మోహ‌న్‌కు(సునీల్‌) డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ అలీ (ముక్కు అవినాష్‌) దొర‌కుతాడు. అత‌డి ద్వారా డ్ర‌గ్స్ దందా గురించి కృష్ణ మోహ‌న్ ఏం తెలుసుకున్నాడు ? ప్రియ‌ను అజ‌య్‌ మ‌ళ్లీ క‌లుసుకున్నాడా? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • లైఫ్ ఓక ఆటరా , రచన: స్వాతి రాపేటి , గానం.& సాయిశరణ్
  • సెలవే అంటూ, రచన: అనిల్ గోపిరెడ్డి, గానం. అనిల్ గోపిరెడ్డి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఫన్‌ సాగ
  • నిర్మాతలు: తృప్తి పాటిల్‌, సుధీర్‌ యాళంగి మహీంధర్‌ నారల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ గోపిరెడ్డి
  • సంగీతం: అనిల్‌ గోపిరెడ్డి
  • సినిమాటోగ్రఫీ:

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (26 January 2023). "ప్రేమికుల రోజున". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
  2. Sakshi (27 January 2023). "'వాలెంటైన్స్ నైట్'మూవీ రివ్యూ". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.