వాల్గొండ త్రికూటాలయం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రాలు చాల అరుదుగా వుంటాయి. అలాంటి వాటిలో ఒకటి జగిత్యాలలోని త్రికూటాలాయం. ఇక్కడ శివునితో బాటు బ్రహ్మ కూడ లింగాకారంలో పూజింప బడుతుండడము ఇక్కడి విశేషము.
స్థల పురాణం
మార్చుశ్రీరాముల వారు వనవాసం చేస్తున్న సందర్బంలో వాల్గొండ ప్రాంతంలో కొంత కాలం నివసించారని భక్తుల విశ్వాసము. ఆ కాలంలో సీతారాములు ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజాతి క్రతువులు నిర్వహించారట. తర్వాతి కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఇసుక లింగం స్థానంలో రాతి శివలింగాన్ని ఏర్పరిచారని స్థలపురాణం తెలియజేస్తున్నది. ఇది శ్రీ రాముడు నడయాడిన స్థలం గనుక శ్రీ రాముని విగ్రహంతో బాటు బ్రహ్మను లింగ రూపంలో పతిష్టించి నిత్య పూజలు, అభిషేకాలు చేయించాడని ప్రతీతి.
ప్రత్యేకత
మార్చుఇక్కడి ప్రత్యేకత ఏమంటే ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజున సూర్య కిరణాలు ఇక్కడి శివలింగం మీద పడతాయి. ఈ విశేషాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. శివ రాత్రి పర్వదినాన, శివ పూజలు, శ్రీరామనవమి నాడు భద్రాద్రి తరహాలో సీతారాముల కళ్యాణము జరిపిస్తారు.
ఎలా వెళ్లాలి
మార్చుఈ త్రికూటాలయాన్ని దర్శించటానికి రైలు, రోడ్డు మార్గాలు వున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండయినా జగిత్యాల చేరుకునేందుకు బస్సు సౌకర్యం వుంది. కాచిగూడ నుండి మెట్ పల్లికి పాసింజరు రైలు వుంది. అక్కడి నుండి రోడ్డు మార్గంలో వాల్గొండ చేరుకోవచ్చు.
మూలాలు
మార్చుఈనాడు ఆదివారం. 25 నవంబరు 2018.