కాచిగూడ
కాచిగూడ హైదరాబాదు నగరంలోని ప్రాంతము. ఇది మూసీ నదికి ఉత్తర ఒడ్డున ఉంది.
Kachiguda
కాచిగూడ | |
---|---|
దేశం | India |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు |
Government | |
• Body | జి.హెచ్.ఎం.సి |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడు | 500 027 |
లోక్ సభ నియోజకవర్గం | సికింద్రాబాదు |
విధానసభ నియోజకవర్గం | అంబర్పేట |
ప్రణాళికా ఏజెన్సీ | జి.హెచ్.ఎం.సి |
విశేషాలు
మార్చునిజాం కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను కాచిగూడ రైల్వేస్టేషను (Kachiguda Railway Station) ఇక్కడ ఉంది. సమీపంలోని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ రక్షకభట నిలయము (Police Station) ఉంది.
వాణిజ్య ప్రాంతం
మార్చుఇది హైదరాబాదు లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. సుల్తాన్ బజార్లో వస్త్రాలు లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి. టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడింది.
రవాణా సౌకర్యాలు
మార్చుకాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. (APSRTC) బస్సు సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా ఉంది. ఇక్కడ MMTS రైల్వేస్టేషను కూడా ఉంది.
ఇచట హోటల్ టూరిస్టు ప్లాజా హోటల్. దీనిని నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో వైష్ణవీ హోటల్, పంచరత్న హోటల్, నంద్ ఇంటర్నేషనల్ లు ఉన్నాయి. ఇక్కడ శాకాహార హోటల్స్ అయిన హోటల్ స్వీకార్, ఇన్విటేషన్ రెస్టారెంట్, స్వాద్ రెస్టారెండు కూడా ఉన్నాయి[1]
విద్యాలయాలు
మార్చుఇక్కడ ప్రాచీనమైన అమృత్ కపాడియా డిగ్రీ కళాశాల (Amruth Kapadia Degree College) ఉంది. ఇక్కడ వైశ్యా వసతిగృహం (Vysya Hostel) ఉంది.
వైద్యశాలలు
మార్చు- శ్రీవెంకటేశ్ బర్గోంకర్ నర్సింగ్ హోమ్
- శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్
దేవాలయాలు
మార్చు- శ్రీ శ్యామ్ మందిర్, వీరన్న గుట్ట అనే చిన్న కొండ మీద నిర్మించిన శ్రీకృష్ణుని దేవాలయం. దీనితోపాటు శివాలయం, గణపతి, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రుని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇదొక శృంగేరి మఠం ద్వారా నడపబడుతుంది. ఇది కాచిగూడ రైల్వే స్టేషనుకు ఎదురుగా ఉంది.
మూలాలు
మార్చు- ↑ "12 Hotels around Kachiguda Railway Station Hyderabad ranked by travellers". Holidayiq.com. Archived from the original on 14 ఏప్రిల్ 2014. Retrieved 24 April 2014.