వాల్టర్ డి లా మెర్

వాల్టర్ డి లా మెర్ (ఏప్రిల్ 25, 1873జూన్ 22, 1956) బ్రిటిషు కవి, రచయిత, బాల సాహితీవేత్త, హారర్ కథా రచయిత. 35వ ఏట నుండి తన పూర్తి కాలమంతా రచనలతోనే గడిపాడు.[1] ఈయన రాసిన మెమోరీస్ ఆఫ్ ఎ మిడ్గేట్ అనే నవల 1921లో ఫిక్షన్ విభాగంలో జేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ అవార్డును అందుకుంది.[2]

వాల్టర్ డి లా మెర్
వాల్టర్ డి లా మెర్ (1924)
(ఛాయాచిత్రం: లేడీ ఓట్టోలిన్లిన్ మోరెల్)
పుట్టిన తేదీ, స్థలంవాల్టర్ జాన్ డి లా మెర్
(1873-04-25)1873 ఏప్రిల్ 25
చార్ల్టన్ (లండన్), కెంట్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
మరణం1956 జూన్ 22(1956-06-22) (వయసు 83)
ట్వికెన్హమ్, మిడిల్సెక్స్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
వృత్తిరచయిత
రచనా రంగంకవిత్వం, ఫిక్షన్, బాల సాహిత్యం
పురస్కారాలుజేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ అవార్డు (1921), కార్నెగీ మెడల్ (1947)

జననం మార్చు

వాల్టర్ 1873, ఏప్రిల్ 25న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రిన్సిపాల్ జేమ్స్ ఎడ్వర్డ డి లా మెర్, అతని రెండవ భార్య లూసీ సోఫియా బ్రౌనింగ్ లకు లండన్‌లోని కెంట్ జిల్లాలో జన్మించాడు.[3]

విద్యాభ్యాసం - ఉద్యోగం మార్చు

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాల్టర్, 1880లో ఓ ఆయిల్ కంపెనీలో చేరి అక్కడ 18 సంవత్సరాలపాటు పనిచేశాడు.

సాహిత్య రంగం మార్చు

బుక్ కీపర్‌గా ఉన్నకాలంలో అనేక పుస్తకాలు చదివాడు. దాంతో తనుకూడా రచయిత కావాలన్న ఉద్దేశ్యంతో రచనలు మొదలెట్టి, బాల సాహిత్యాన్ని, కవిత్వాన్ని రాశాడు.

నవలలు మార్చు

  1. హెన్రీ బ్రాకెన్ (1904)
  2. త్రి రాయల్ మంకీస్ (పిల్లల నవల, 1910)
  3. ది రిటర్న్ (1910)
  4. మెమోరీర్స్ ఆఫ్ ఎ మిడ్గేట్ (1921)
  5. మిస్టర్ బుంప్స్ అండ్ హిస్ మంకీ (1942)

కథలు మార్చు

  1. ది రిడిల్ అండ్ అదర్ స్టోరీస్ (1923)
  2. డింగ్ డాంగ్ బెల్ (1924)
  3. బ్రూమ్ స్టిక్స్ అండ్ అదర్ టేల్స్ (1925) (పిల్లల కథలు)
  4. ది కోనియోసర్స్ అండ్ అదర్ స్టోరీస్ (1926)
  5. ఆన్ ది ఎడ్జ్ (1930)
  6. ది డచ్ చీజ్ (1931)
  7. ది లార్డ్ ఫిష్ (1933)
  8. ది వాల్టర్ డి లా మెర్ ఆమ్నిబస్ (1933)
  9. ది విండ్ బ్లోస్ వోవర్ (1936)
  10. ది న్యాప్ అండ్ అదర్ స్టోరీస్ (1936)
  11. స్టోరీస్, ఎస్సేస్ అండ్ పోయెమ్స్ (1938)
  12. ది బెస్ట్ స్టోరీస్ ఆఫ్ వాల్టర్ డి లా మెర్ (1942)
  13. కలెక్టెడ్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ (1947
  14. ఎ బిగినింగ్ అండ్ అదర్ స్టోరీస్ (1955)
  15. యైట్ టేల్స్ (1971)
  16. వాల్టర్ డి లా మెర్, షార్ట్ స్టోరీస్ 1895–1926 (1996)
  17. వాల్టర్ డి లా మెర్, షార్ట్ స్టోరీస్ 1927–1956 (2000)
  18. వాల్టర్ డి లా మెర్, షార్ట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్స్ (2006)

కవిత్వం మార్చు

  1. సాంగ్స్ ఆఫ్ చైల్డ్ హుడ్ (1902)
  2. పోయెమ్స్ (1906)
  3. ది లిజనర్స్ (1912)
  4. పీకాక్ పై (1913)
  5. ది సన్కెన్ గార్డెన్ అండ్ అదర్ పోయమ్స్ (1917)
  6. మోట్లే అండ్ అదర్ పోయమ్స్ (1918)
  7. ది వీల్ అండ్ అదర్ పోయమ్స్ (1921)
  8. డౌన్-అడోన్-డెర్రీ: ఎ బుక్ ఆఫ్ ఫెయిరీ పోయమ్స్ (1922)
  9. సెలెక్టెడ్ పోయమ్స్ బై వాల్టర్ డి లా మెర్ (1927, 1931)
  10. స్టఫ్, నాన్సెన్స్ అండ్ సో ఆన్ (1927)
  11. బెల్స్ అండ్ గ్రాస్ (1941)
  12. టైం పాసెస్ అండ్ అదర్ పోయమ్స్ (1942)
  13. ఇన్వర్డ్ కంపేయియన్ (1950)
  14. ఓ లవ్లీ ఇంగ్లాండ్ (1952)
  15. వాల్టర్ డి లా మెర్: ది కంప్లీట్ పోయెమ్స్ (1969)
  16. ఎలోన్ (1927)
  17. సెల్ఫ్ టు సెల్ఫ్ (1928)
  18. ది స్నోడ్రోప్ (1929) [18]
  19. న్యూస్ (1930)
  20. టు లూసీ (1931)

మరణం మార్చు

1947 నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వాల్టర్ 1956, జూన్ 22న ఇంగ్లాండులోని ట్వికెన్హమ్ లో మరణించాడు.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (13 May 2019). "వాల్టర్ డి లా మెర్". మామిడి హరికృష్ణ. Archived from the original on 13 May 2019. Retrieved 13 May 2019.
  2. "Fiction winners". James Tait Black Prizes: Previous Winners. The University of Edinburgh. Retrieved 13 May 2019.
  3. Theresa Whistler, "Mare, Walter John de la (1873–1956)", Oxford Dictionary of National Biography, Oxford University Press, 2004; online edn, Oct. 2006. Retrieved 13 May 2019.

ఇతర లంకెలు మార్చు