వాల్తేర్ అప్ లాండ్
వాల్తేర్ అప్ లాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర మధ్య భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం నగరంలోని అత్యంత ఖరీదైన నివాస, వాణిజ్య ప్రాంతాలలో ఒకటి.[2]
వాల్తేర్ అప్ లాండ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′15″N 83°18′46″E / 17.720972°N 83.312907°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530003 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
మార్చుఇది 17°43′15″N 83°18′46″E / 17.720972°N 83.312907°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
వాణిజ్యం
మార్చురామ్నగర్, సిరిపురంల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో నగరంలోని పేరొందిన థర్డ్ వేవ్ కాఫీ, బరిస్టా లవజ్జా, యల్లోప్ గౌర్మెట్ లవజ్జా, కెఫె కాఫీ డే ఉన్నాయి. ఇది నగర యువత సమావేశమయ్యే ప్రాంతంగా మారింది.[3] ఇక్కడ అనేక షాపింగ్ అవుట్‌లెట్లు ఉన్నాయి.[4]
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వాల్తేర్ అప్ లాండ్ మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
ప్రార్థనా మందిరాలు
మార్చు- దుర్గమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- వినాయక దేవాలయం
- మసీదు-ఇ-రజా
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
మార్చు- ↑ "Waltair Uplands, Siripuram Locality". www.onefivenine.com. Retrieved 2021-05-13.
- ↑ "location". get pincode. 22 July 2017. Retrieved 13 May 2021.
- ↑ "about". times of india. 4 April 2017. Retrieved 13 May 2021.
- ↑ "shopping". the hindu. 25 March 2017. Retrieved 13 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 13 May 2021.