వాల్మీకి జాతీయ ఉద్యానవనం

వాల్మీకి జాతీయ ఉద్యానవనం, బీహార్ రాష్ట్రంలోని పడమర చంపారన్ జిల్లా లోని గండక్ నది ఒడ్డున ఉంది. ఈ ఉద్యానవనం పులుల సంరక్షణ వన్యప్రాణుల కేంద్రంగా ఉంది.[1] 2018 లెక్కల ప్రకారం ఈ కేంద్రంలో 40 పులులు ఉన్నాయి.[2]

వాల్మీకి జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
ప్రదేశంచంపారన్, బీహార్, భారతదేశం

మరిన్ని విశేషాలు మార్చు

1950కి ముందు ఈ అడవి ప్రాంతం బెట్టియా రాజ్, రాంనగర్ రాజ్ ఆధీనంలో ఉండేది. ఈ ఉద్యానవనం ఒక అడవి ప్రాంతంగా ఉంటుంది. ఈ అడవి ప్రాంతం మొత్తం 900 చ.కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా అందులో వాల్మీకి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం 880 చ.కిలోమీటర్లు, జాతీయ ఉద్యానవనం 335 చ.కిలోమీటర్లుగా విస్తీర్ణంలలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం ఉత్తరాన నేపాల్ దేశంలో ఉన్న చిట్వాన్ జాతీయ ఉద్యానవన సరిహద్దులను తాకుతూ, దక్షిణాన ఉత్తర ప్రదేశ్ హద్దులను తాకుతుంది.

మూలాలు మార్చు

  1. "How this Bihar sanctuary tripled tiger numbers in 10 yrs".
  2. "Plan for eco city near tiger reserve".

వెలుపలు లంకెలు మార్చు