వాల్ మార్ట్ స్టోర్స్ లేదా వాల్ మార్ట్ ఐ.ఎన్.సి (NYSE: WMT), ప్రపంచంలోనే అతిపెద్ద చిల్లర సరుకుల వ్యాపార సంస్థ. ఈ కంపెనీ 1969 అక్టోబరు 31 న ఆరంభించబడినది, 1962 లో సామ్ వాల్టన్ స్థాపించిన ఈ కంపెనీ 1972 లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్తకం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం బెన్టన్ విల్, ఆర్కాన్సాలో ఉంది. వాల్ మార్ట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పెద్ద చిల్లర సరుకుల వ్యాపార సంస్థగా ఉంది. 2009 లో, కిరాణా వ్యాపారం నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో $ 258 బిలియన్ల అమ్మకాలు జరిపింది. ఇది మొత్తం అమ్మకాల్లో 51%. అంతేకాక ఇది ఉత్తర అమెరికాలో సామ్స్ క్లబ్ టోకు గిడ్డంగులను (హోల్ సేల్ వేర్ హౌస్) నిర్వహిస్తోంది.

వాల్-మార్ట్ స్టోర్స్ ఐ.ఎన్.సి
Typeపబ్లిక్
NYSEWMT
Dow Jones Industrial Average Component
S&P 500 Component
ISINUS9311421039 Edit this on Wikidata
పరిశ్రమరీటైల్
స్థాపన1962 (1962)
Foundersసామ్ వాల్టన్
ప్రధాన కార్యాలయంబెన్టన్ విల్,ఆర్కాన్సా
36°21′51″N 094°12′59″W / 36.36417°N 94.21639°W / 36.36417; -94.21639
Number of locations
8,970 (2011)
Areas served
ప్రపంచవ్యాప్తంగా
Key people
మైక్ డ్యూక్ (ప్రెసిడెంట్ & సిఈఓ)
రాబ్సన్ వాల్టన్ (Chairman)
RevenueIncrease US$ 421.849 billion (2011)
Increase US$ 25.542 billion (2011)
Increase US$ 15.355 billion (2011)
Total assetsIncrease US$ 180.663 billion (2011)
Total equityDecrease US$ 68.542 billion (2011)
Ownerవాల్టన్ కుటుంబం
Number of employees
సుమారు . 2.1 million (2011)
DivisionsWalmart Canada
SubsidiariesAsda, Sam's Club, Seiyu Group, Walmex
Websitehttp://www.walmartstores.com

వాల్ మార్టుకు 55 వివిధ పేర్లతొ, 15 దేశాలలో 8.500 దుకాణాలు ఉన్నాయి. ఈ కంపెనీ 50 సంయుక్త రాష్ట్రాలు, ప్యూర్టో రికో సహా, యునైటెడ్ స్టేట్స్ లో తన సొంత పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది భారతదేశంలో బెస్ట్ ప్రైస్ గా (ఇది సామ్స్ క్లబ్ వంటిది), జపాన్ లో సేయుగా, యునైటెడ్ కింగ్డమ్ లో ఆస్డాగా, మెక్సికోలో వాల్-మెక్స్ గా పనిచేస్తుంది . ఆర్జెంటినా, బ్రెజిల్, కెనడాలో కార్యకలాపాలకు ఇది పూర్తిగా యజమాని. ఉత్తర అమెరికా వెలుపల వాల్ మార్ట్ యొక్క పెట్టుబడులు మిశ్రమ ఫలితాలను కలిగివున్నాయి: యునైటెడ్ కింగ్డమ్, దక్షిణ అమెరికా, చైనా, దాని కార్యకలాపాలు అత్యంత విజయవంతమైయ్యాయి, అయితే జర్మనీ, దక్షిణ కొరియాలో సంస్థలు విజయవంతం కాలేదు.

చరిత్ర మార్చు

అర్కాన్సాస్ కు చెందిన వ్యాపారవేత్త సామ్ వాల్టన్, 1940 జూన్ 3న ఐయోవా లోని దేస్ మొయిన్స్ నగరంలోని ఒక జెసి పెన్ని దుకాణం వద్ద పని ఆరంభించి, తన రిటైల్ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యొగము 18 నెలల పాటు కొనసాగింది. 1945 లో, అతను బెన్ ఫ్రాంక్లిన్ అను దుకాణాల యాజమాని బట్లర్ బ్రదర్స్ ను కలుసుకున్నారు. వారి సహకారంతొ అర్కాన్సా లోని న్యూపోర్ట్ నగరంలో ఒక దుకాణం ప్రారంభించాడు.[1] .వాల్టన్, న్యూపోర్ట్ లో దుకాణాన్ని అంచనాలకు మించి అత్యంత విజయవంతంగా నడిపించారు.[2] అయితే, దుకాణం ఉన్న స్థలం కౌలు పునరుద్ధరణ కోసం వచ్చినప్పుడు, వాల్టన్ పునరుద్ధరణ ఒప్పందానికి రాలేక పోయారు.అందుకోసం న్యూపోర్ట్ లో ఒక కొత్త స్థానాన్ని కనుగొలు చేయటానికి విఫల యత్నం చేసారు. బదులుగా, అతను బెంటన్విల్, అర్కాన్సాస్ లో ఒక కొత్త బెన్ ఫ్రాంక్లిన్ ఫ్రాంచైజ్ తెరిచారు. కానీ దీనిని "వాల్టన్స్ ఐదు అండ్ డైమ్" అని నామకరణం చేశారు. అక్కడ, అతను పోటీదారుల కంటే కొద్దిగా తక్కువ ధరలతొ అధిక అమ్మకాలు సాధించారు.[3]

1962 జూలై 2న, ఆర్కాన్సాలోని రోజర్స్ నగరంలోని 719 వాల్నట్ ఏవన్యూ వద్ద మొదటి వాల్ మార్ట్- డిస్కౌంట్ సిటీని తెరిచారు. ఆ భవనంలో ఇప్పుడు ఒక హార్డ్వేర్ దుకాణం, ఒక పురాతన వస్తువుల దుకాణం ఉన్నాయి. తదుపరి ఐదు సంవత్సరాలలో, ఈ సంస్థ ఆర్కాన్సా అంతటా 24 దుకాణాలతొ విస్తరించబడింది, అమ్మకాలలో $12.6 మిలియన్ చేరుకుంది.[4].1968 ఆరొభంలో, అర్కాన్సాస్ వెలుపల సైక్ స్టోన్, మిస్సోరి, క్లేర్మోర్,ఓక్లహోమా నగరాలలో తొలి దుకాణాలను తెరిచింది.[5]

ఉదహరింపు మార్చు

  1. Walton, Sam; Huey, John. Sam Walton: Made in America: My Story. New York: Bantam, 1993. ISBN 978-0-553-56283-5.
  2. Sam Walton: Great From the Start — HBS Working Knowledge
  3. Frank, T.A. "A Brief History of Wal-Mart Archived 2006-07-21 at the Wayback Machine." The Washington Monthly. April 1, 2006. Retrieved July 24, 2006.
  4. "The Rise of Wal-Mart". Frontline: Is Wal-Mart Good for America?. 2004-11-16. Retrieved 2007-09-19.
  5. "The Wal-Mart Timeline." Wal-Mart (published on walmartfacts.com Archived 2008-05-16 at the Wayback Machine). Retrieved July 24, 2006.

బయటి లింకులు మార్చు