వాసుకి (2018 సినిమా)
అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, వాసుకి (అయోమయ నివృత్తి) చూడండి.
వాసుకి | |
---|---|
దర్శకత్వం | ఎ.కె.సజన్ |
రచన | ఎ.కె.సజన్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | రోబి వర్గీస్ రాజ్ |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | శ్రీరామ్ సినిమా |
విడుదల తేదీ | 28 జూలై 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వాసుకి 2018లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో 2016లో విడుదలైన ‘పుతియ నియమం’ను శ్రీరామ్ సినిమా బ్యానర్‌పై ఎస్ఆర్ మోహన్ తెలుగులో ‘వాసుకి’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.నయనతార, మమ్ముట్టి, షీలు అబ్రహమ్, రచనా నయనకుట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎ.కె.సజన్ దర్శకత్వం వహించగా జూలై 28న విడుదల చేశారు.[1]
కథ
మార్చువాసుకీ (నయనతార) తన భర్త (మమ్ముట్టి) , కూతురితో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. సాఫీగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో అనుకోకుండా ఒకరోజు తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోని ముగ్గురు యువకులు వాసుకీని మానభంగం చేస్తారు. లైంగిక దాడికి గురైన తరువాత వాసుకీ కి మహిళ పోలీసు అధికారి పరిచయం కాగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని తనతో చెప్పగా, ఆ పోలీస్ అధికారి నిందితులను కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తుంది. కానీ వాసుకి మాత్రం తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురిని తానే చంపుతాను అని అధికారికి చెబుతుంది. వాసుకీ తన పగను తీర్చుకుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- నయనతార[2]
- మమ్ముట్టి
- షీలు అబ్రహం
- రచనా నయనకుట్టి
- ఎస్. ఎన్. స్వామి
- బేబీ అనన్య
- రోషన్ మాథ్యూ
- అనిల్ కే. రేజి
- సెంద్రయాణ్
- అజు వర్గీస్
- శ్రీలత నంబూతిరి
- సాదిక్
- పొన్నమ్మ బాబు
- సోహాన్ సీనులాల్
- జెన్నిఫర్ ఆంటోనీ
- ప్రదీప్ కొట్టాయం
- అనియప్పన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీరామ్ సినిమా
- నిర్మాత: ఎస్ఆర్ మోహన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కె.సజన్
- సంగీతం: గోపీ సుందర్
- సినిమాటోగ్రఫీ: రోబి వర్గీస్ రాజ్
- ఎడిటర్: వివేక్ హర్షన్
- పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర
- మాటలు: వెంకట్ మల్లూరి
మూలాలు
మార్చు- ↑ The Times of India (2017). "Vasuki Movie: Showtimes". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Suryaa (2017). "Gorgeous Actress Nayantara as vasuki" (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.