వాసుపల్లి గణేష్ కుమార్

(వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)

వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2] అతను తెలుగుదేశం పార్టీని విడిచి తన కుమారులైన సాకేత్, సూర్యలతో పాటు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు.[3]

వాసుపల్లి గణేష్‌ కుమార్‌
వాసుపల్లి గణేష్ కుమార్


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - 2024 ఫిబ్రవరి 26
నియోజకవర్గం దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
విశాఖపట్నం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రమణ
జీవిత భాగస్వామి ఉష రాణి
సంతానం సూర్య, గోవింద్‌ సాకేత్‌
నివాసం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

ఉద్యోగ జీవితం

మార్చు

వాసుపల్లి గణేష్‌ కుమార్‌ 1988 సెప్టెంబర్‌ 19న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పైలట్‌ ఆఫీసర్‌గా చేరి 1994 సెప్టెంబర్‌ 19న ఎయిర్‌ఫోర్స్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు. ఆయన 1994 అక్టోబర్‌ 19న వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీని ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

మార్చు

వాసుపల్లి గణేష్‌ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస రావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కోలా గురువులు పై, 2019లో వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస రావు పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వాసుపల్లి గణేష్‌ టీడిపిని విడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Sakshi (20 September 2020). "వైఎస్సార్‌ సీపీలో వాసుపల్లి జోష్‌". Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.
  2. "Andhra Pradesh Visakhapatnam South Elections Result 2019: Visakhapatnam South Voting Result Update, Seats Tally". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-14.
  3. Bhattacharjee, Sumit (2020-09-19). "Vasupalli quits TDP, to extend support to YSRCP". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-14.
  4. NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  5. Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.