కోలా గురువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగే ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1]

కోలా గురువులు

వ్యక్తిగత వివరాలు

జననం 1966
విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

కోలా గురువులు 2008లో ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ చేతిలో 341 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ చేతిలో 18,316 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

కోలా గురువులు 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఆశించగా పార్టీ అధిష్ఠానం ద్రోణంరాజు శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించింది. ఆయనను డిసెంబర్ 2020లో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది.[2] కోలా గురువులు వైఎస్సార్సీపీ చేసిన సేవలకు గాను 2023లో ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ఆయన పేరును ఖరారు చేసింది.[3][4][5] ఆయన మార్చి 24న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఓడిపోయాడు.[6]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Andhra Jyothy (18 July 2021). "'నామినేటెడ్‌' మాయ!". Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  3. Andhrajyothy (21 February 2023). "గురువులుకు ఎమ్మెల్సీ చాన్స్‌". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
  4. Eenadu (21 February 2023). "విధేయులకు ఎమ్మెల్సీ పదవులు". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
  5. Sakshi (21 February 2023). "విశ్వసనీయత.. విధేయత". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
  6. "ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా గురువులు ఓటమి". ఆంధ్రజ్యోతి. 2023-03-24. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.