వింజమూరి వెంకటరత్నమ్మ

వింజమూరి వెంకటరత్నమ్మ ప్రముఖ రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.[1]

వింజమూరి వెంకటరత్నమ్మ
వింజమూరి వెంకటరత్నమ్మ
వింజమూరి వెంకటరత్నమ్మ
వ్యక్తిగత సమాచారం
జననం 1888
సంగీత రీతి రచయిత్రి, సంపాదకురాలు

జీవిత విశేషాలు

మార్చు

ఆమె 1888 లో జన్మించారు. ఆమె "నవ్య సాహితీ సమితి"లో ఏకైన మహిళా సభ్యురాలు.[2] ఆమె తెలుగులో స్త్రీల కోసం అనసూయ అనే పత్రిక 1917 జూలై 1 న కాకినాడ లోని రామారావు పేట నుండి ప్రారంభించింది.[3] ఆమె ఆ పత్రికకు సంపాదకత్వం వహించారు. . ఒకరకంగా చెప్పాలంటే ఆరోజులలో స్త్రీని మేల్కొలిపిన పత్రిక అని చెప్పవచ్చు.[4] "స్త్రీలెచ్చట నుచ్ఛస్థితిలో నుందురో యాదేశ మభివృద్ధిలోనున్న మాటయే. అట్లుండుటకు వారి యజ్ఞానాంధకారము పారద్రోలబడవలయును. వారు పురుషులతో సర్వవిధముల సమానలని యెన్నుకొనబడు నవస్థ రావలయును." [5] అనే భావాన్ని వ్యక్తం చేయడం నిజంగా అప్పట్లో సంచలమే. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో సర్ నారాయణచంద్ర వార్కర్ రచించిన ఒక వ్యాసాన్ని వెంకటరత్నమ్మ 'ఇరువురు మాలకన్నియలు' పేరుతో అనువదించి 1919 జూలై-ఆగస్టు సంచికలో ప్రచురించారు. ఆ కాలంలో స్త్రీల స్వేచ్ఛ గూర్చి భావాల్ని పత్రికలో వ్యక్తం చేయడం అంటే సామాన్యం కాదు. పూర్వకాలంలో మనదేశంలో ఉన్న ఘోషాపద్ధతి మూలంగా పురుషుల మాదిరిగా స్త్రీలు బయటకి వచ్చి చదువుకోడానికి వీల్లేకుండా ఉండేది. అయితే అవకాశమిస్తే మేధాపరంగా వారు పురుషులకేమాత్రం తీసిపోరు అన్న అంశంతో వెంకటరత్నమ్మ ఒక వ్యాసంలో బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయినిలుగా స్త్రీలను మాత్రమే నియమించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు తయారవుతారని ఆమె భావన. విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నింటినో వెంకటరత్నమ్మ తన పత్రికలో ప్రచురించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యమధ్యలో పత్రిక రావడం ఆలస్యమైనా భరించి రెండు నెలలకు కలిపి ఒక సంచికను తీసుకువచ్చేవారామె.[6]

కుటుంబం

మార్చు

ఆమె భర్త వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు భారతీయ రంగస్థల నటుడు, తెలుగు-సంస్కృత పండితుడు, రచయిత.[7] ఆయన 1967 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. వారి కుమార్తెకు కూడా ఆ పత్రిక నామం అనసూయ గానే నామకరణం చేసారు. వెంకటరత్నమ్మ ఆ పత్రికను అనసూయాదేవి పుట్టక ముందు అంటే 1914 నుంచి 1920 వరకు అంటే ఆమె పుట్టేంతవరకూ నడపడం విశేషం.[8] వెంకటరత్నమ్మకు ఇద్దరు కుతుళ్ళు. వారు వింజమూరి అనసూయ, వింజమూరి సీతాదేవి. వీరిద్దరినీ కలసి "వింజమూరి సిస్టర్స్"గా పిలుస్తారు. వీరిద్దరూ దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క మేనకోడళ్ళు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు