వింత సంసారం
వింత సంసారం 1971లో విడుదలైన తెలుగు సినిమా. సావిత్రి కంబైన్స్ పతాకంపై సావిత్రీ గణేశన్, దిద్ది శ్రీహరిరావు నిర్మించిన ఈ సినిమాకు సావిత్రి దర్శకత్వం వహించింది. సావిత్రి, రమాప్రభ, కొంగర జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]
వింత సంసారం (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సావిత్రి |
నిర్మాణం | సావిత్రి, శ్రీహరిరావు |
తారాగణం | జగ్గయ్య, సావిత్రి, నాగయ్య, రాంమోహన్, రాజబాబు, రమాప్రభ |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | సావిత్రి కంబైన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 14, 1971 |
భాష | తెలుగు |
కథ
మార్చుప్రిస్టేజీ పద్మనాభం (జగ్గయ్య) లంచమన్నా, లంచాలు తీసుకొనే మనుషులన్నా పరమ అసహ్యం. ఆతన భార్య సావిత్రి (సావిత్రి). పెద్ద కొడుకు ఆనంద్ (రామమోహన్) అకౌంటెంటు. కోడలు ప్రభ (రమాప్రభ) భర్తకు లంచాలను మరిగింపజేసిన సాధ్వి. చిన్న కొడుకు మురళీ (రాజబాబు) పి.యు.సి లో పల్టీలు కొడుతూ కాలం గడిపే జల్సా రాయుడు. ఇక ఈ కుటుంబానికి ఆశాజ్యోతి అనుకున్న ఒకే ఒక కూతురు కూడా పోన్ లపై ప్రేమ లేఖలు అందిస్తుంది. ఇది కుటుంబ పరిస్థితి.
ఇంగ్లీషు కంఫెనీలో మేనేజరుగా ఉండి నీతి నిజాయితీలతో మెలిగి, కంపెనీని ఎంతో అభివృద్ధి చేసిన్;అ పద్మనాభానికి 55 ఏళ్ళు నిండగానే డైరక్టరు బోర్డు ఆఫీసు నుండి పంపి వేస్తుంది. రిటైరైన పద్మనాభం ఇంటిలో చులకనైపోతాడు. లంచాలు గుంజే మోజులో పడ్డ ఆనంద్ కు తండ్రి నీతి వాక్యాలు చెవికెక్కవు. చివరికి అవినీతి నేఋఅంపై అరెస్టు చేయబడతాడు.
పద్మనాభానికి ఈ విషయం కృంగదీస్తుంది. గుండె ఆపరేషన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అతని నిజాయితీని గుర్తించిన కంపెనీ పెద్ద ఉద్యోగానికి ఆహ్వానిస్తుంది. అతని ఆశలు చిగురించాయి. కానీ కుటుంబం ఆశలు అడియాశలైనాయి.
సత్ప్రవర్తన గల ఒక తండ్రి తన బిడ్డల దురలవాట్లు చెందే మనోవేదనను జగ్గయ్య, పరస్పర విరుద్ధ వైఖరులు గల భర్త, బిడ్డలతో సంసారం సాఫీగా నడపోడానికి తల్లి పడే పాట్లను సావిత్రి, ఇంకా వృద్ధ దంపతుల అచ్చట్లు, ముచ్చట్లను తమ నటనల్లో ఎంతో అనుభవంతో నటించారు.
తారాగణం
మార్చు- సావిత్రి గణేశన్
- రమాప్రభ
- కొంగర జగ్గయ్య
- రామ్మోహన్
- రాజబాబు
- చిత్తూరు నాగయ్య
- నారాయణరావు
- మాలతి
- లీలారాణి
- సీతారాం
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: సావిత్రి గణేశన్
- స్టూడియో: సావిత్రి కంబైన్స్
- నిర్మాత: సావిత్రి గణేషన్, ధిద్ది శ్రీహరి రావు;
- ఛాయాగ్రాహకుడు: శేఖర్ - సింగ్;
- కూర్పు: ఎ. దండపాణి;
- స్వరకర్త: ఎస్.పి.కోదండపాణి;
- గీత రచయిత: దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- విడుదల తేదీ: 1971 ఏప్రిల్ 16
- అసోసియేట్ డైరెక్టర్: దాసరి నారాయణరావు;
- సంభాషణ: మద్దిపట్ల సూరి
- గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, కౌసల్య
- ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణ
- నాకంటి పాపా నా ఇంటి దీపం ఆనాడు ఈనాడు ఏనాడు - ఘంటసాల , రచన: దాశరథి
మూలాలు
మార్చు- ↑ "Vintha Samsaram (1971)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)