వారణాసి రామ్ మోహన్ రావు (1939-2005) రామ్ మోహన్ అని పిలుస్తారు, ప్రధానంగా తెలుగు సినిమా కొన్ని తమిళ సినిమాలలో రామ్మోహన్ నటించాడు . [1] [2] రామ్మోహన్ 25 కంటే ఎక్కువ సినిమాలలో విభిన్న పాత్రలలో నటించాడు తేనే మనసులు (1965), కన్నె మనసులు (1966), ప్రైవేట్ మాస్టర్ (1967) లాంటి సినిమాలలో రామ్మోహన్ పోషించిన పాత్రలు పేరు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్‌ పోలికలు రామ్మోహన్ కు ఉండటంతో రామ్మోహన్ ను ఆంధ్ర దేవ్ ఆనంద్‌గా పిలిచారు. [3] రామ్మోహన్ బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి. మధుసూధనరావు, కె. విశ్వనాథ్, టి. కృష్ణ వంటి ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించాడు. [4] [1]

వ్యక్తిగత జీవితం

మార్చు

రామ్మోహన్, , 1939 ఫిబ్రవరి 4న, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, గిద్దలూరులో వారణాసి రామారావు దంపతులకు జన్మించాడు. [1] ఎనిమిది మంది పిల్లల్లో రామ్మోహన్ రెండో సంతానం. [1] రామ్ మోహన్ కర్నూలులో బీఈ డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు రామ్మోహన్ బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్ మేనేజర్‌గా పనిచేశాడు. [5] రామ్మోహన్ అనారోగ్య కారణాలతో 2005లో చనిపోయాడు. [6] [2]

నటించిన సినిమాలు

మార్చు
నటుడిగా

ములాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Rajadhyaksha, Ashish; Willemen, Paul (1998) [1994]. Encyclopaedia of Indian Cinema (PDF). British Film Institute and Oxford University Press. ISBN 0-19-563579-5. Retrieved 4 September 2022.
  2. 2.0 2.1 Narasimham, M. L. (January 11, 2018). "Tenemanasulu (1965)". The Hindu. Retrieved 4 September 2022.
  3. India, The Hans (April 2, 2015). "The launch of a Superstar". thehansindia.com. Retrieved 4 September 2022.
  4. "Hero Ram Mohan Cinema Career Real Facts | రామ్ మోహన్ ఈ ఆంధ్ర దేవానంద్ మహా నటుడి జీవితంలో ఇలా ఎందుకు". Retrieved 4 September 2022 – via YouTube.
  5. iDreamMedia. "iDream Media Website". idreammedia.com. Archived from the original on 27 ఆగస్టు 2018. Retrieved 4 September 2022.
  6. "Kanne Manasulu. Kanne Manasulu Movie Cast & Crew". bharat-movies.com. Archived from the original on 15 డిసెంబర్ 2019. Retrieved 4 September 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)