వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 16వ వారం
మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక భాగమైన మిన్నసోటా రాష్ట్రానికి రాజధాని. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరాలను జంట నగరాలుగా వ్యవహరిస్తారు. 2006 జనాభా లెక్కలను అనుసరించి ఈ జంట నగరాల జనాభా 35,00,000 అంచనా. ఈ నగరాలు మిసిసిపీ, మిన్నసోటా మరియు సెయింట్ క్రాయ్ నదీతీరాలలో విస్తరించి ఉన్నాయి. జంటనగరాలుగా గుర్తించబడిన ఈ నగరాలు స్వరూపస్వభావాలు, రూపురేఖలలో మాత్రం పరస్పర విరుద్ధతలు కలిగి ఉంటాయి. మిసిసీపీ నదీతీరంలో ఇరువైపులా సహజసిద్ధంగా ఉన్న రాళ్ళు బండలు ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా చేశాయి. లాంబర్ట్‌స్ లాండింగ్ చుట్టూ సెయింట్ పాల్ విస్తరించింది. మిన్నియాపోలిస్ ప్రాంతం మిల్లుల నగరంగా పేరు పొందింది.
మధ్య ప్రాచ్య ప్రాంతానికి ఈ జంటనగరాలు కళా కేంద్రంగా పేరు పొందాయి. ప్రదర్శనలను ఆదరించడంలో ఇక్కడి ప్రజలు ప్రథమ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ఆధారిత అంచనా. ఈ నగరం సరస్సులకు ప్రసిద్ధి. ది గ్రేట్ రివర్ బైసైకిల్ ఫెస్టివల్, ది ట్విన్ సిటీస్ మారథాన్ మరియు యు.ఎస్ పాండ్ హాకీ ఛాంపియన్ షిప్ పోటీలు నగర ప్రజలకు వినోదం అందించే విషయాలలో కొన్ని. నగరంలో యూదులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ భారతీయులు కూడా చెప్పుకోతగినంత మంది ఉన్నట్లు అంచనా. 2006లో జంట నగరాల సరిహద్దు ప్రాంతమైన మేపుల్ గ్రోవ్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని తెరిచారు. ఇక్కడ మసీదులుకూడా చాలానే ఉన్నాయి.
మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరం అత్యధిక శీతల వాతావరణం కలిగిన నగరపాలిత ప్రాంతం. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరాలలో స్టార్ ట్రిబ్యూట్ మరియు సెంట్ పాల్ పయనీర్ ప్రెస్ అనేవి రెండూ ప్రధాన వార్తా పత్రికలు. ఇవి కాకుండా యూనివర్శిటీ ఆఫ్ మిన్నసోటా విద్యార్ధులచే నడపబడే మిన్నసోటా డైలీ జంటనగరాలకు సమీప ప్రజలకు ఉచిత సేవలందిస్తుంది. సెయింట్ పాల్ 90,000 నివాసాలకు వాసులకు ఉచిత సేవలందించే ఈస్ట్ సైడ్ రివ్యూ , కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితమైన సిటీ పేజస్ జంట నగరవాసులకు వార్తలనందిస్తున్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి