వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 42వ వారం
1950 సెప్టెంబర్ 17న జన్మించి నరేంద్ర మోడి ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2007 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా మూడవ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువైనారు. 1990లలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఆర్గనైజర్‌గా ఉంటూ రాష్త్రంలో పార్టీ అభివృద్ధికై విశేష కృషి సల్పినారు. దాని పలితమే 1995లో గుజరాత్‌లో భాజపా అనూహ్యమైన విజయం సాధించింది. పార్టీ అధికారంలోకి రావడాన్కి కృషి చేసిననూ వెంటనే అధికార పీఠం దక్కలేదు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భాజపా ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేకుండా పోయింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీసులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది.(ఇంకా…)