వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 6
- 1804: ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్లీ మరణం.
- 1911: అమెరికా దేశ 40వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం.
- 1923: వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు జే.రామేశ్వర్ రావు జననం.
- 1925: భారతీయ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897). (చిత్రంలో)
- 1931: భారతీయ స్వాతంత్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మరణం.
- 1932: భరాగో గా సుప్రసిద్ధులైన రచయిత భమిడిపాటి రామగోపాలం జననం.
- 1956: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి జననం.
- 1976: బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత రిత్విక్ ఘటక్ మరణం.
- 2006: తెలుగు సినీ హాస్యనటి కల్పనా రాయ్ మరణం. (జ. 1950)