వికీపీడియా:తెవికీ అకాడమీ

అకాడమీ అంటే మీకేమనిపిస్తోంది? ఎదో ఒక రంగము అభివృద్ధికి కృషి చేసే సమూహాలు గర్తుకి వస్తున్నాయా లేదా? తెలుగు అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటివి. అలాగే వికీపీడియా అకాడమీ, వికీ పీడియా అభివృద్ధికి కృషి చేస్తుంది. వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు వున్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.

పనిచేసే విధానం

మార్చు

వికీపీడియా అకాడమీ అంటే పెద్ద భవనాలున్న సంస్థ అనుకోకండి. కనీసం ఒక కంప్యూటరు, నెట్వర్క్ అనుసంధానసదుపాయం వున్న చోట, వికీపీడియా గురించి తెలియని వారికి, తెలియచెప్పటమే ఈ అకాడమీ పని. తెలుగు ఎలా టైపు చేయాలో, వికీపీడియాలో మార్పులు ఎలా చేయాలో చెప్పటము, వారితో చేయించటం. కొత్త వ్యాసాలు మొదలెట్టటము, లేక పాత వ్యాసాల నాణ్యత పెంచడము , ఎవైనా సందేహాలుంటే తీర్చడము లాంటి పనులు చేస్తే సరిపోతుంది. వీటికి కావలసిన సమాచారం అంతా తెలుగు వికీపీడియా నివాస పేజీలోని స్వాగతం విభాగంలో వుంది మరి. కాకపోతే దీనిని, ప్రజంటేషను శైలి ఫైళ్లుకూడా వున్నాయి.

ఈ పని ఎవరు వుండే చోటనే వుండి అందరు ఎలెక్ట్రానిక్ పరికరాల సాయంతో కలిస్తే, దానిని ఈ- అకాడమీ అని పిలుస్తారు. ఇంకెందుకు ఆలస్యం. వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.

తెవికీ అకాడమీ చరిత్ర

మార్చు

ఎలెక్ట్రానిక్ అకాడమీ (ఈ-అకాడమీ) 19 సెప్టెంబరు 2009న [1], మరియు భౌతిక అకాడమీ[2] 6 అక్టోబరు 2009 న ప్రారంభం అయ్యాయి. భౌతిక అకాడమీ చీరాల లో ప్రారంభమై ఆ తరువాత ఒంగోలు, నరసరావుపేట, గుంటూరు, కుప్పం, చెన్నై, హైదరాబాదు లలో నిర్వహించబడ్డాయి.

కరపత్రాలు మరియు ప్రదర్శన పత్రాలు

ఈ క్రిందచూపిన కరపత్రాలు మరియు ప్రదర్శనపత్రాల మూలాలు వాటి వివరణ పేజీలో ఇవ్వబడిన లింకు ద్వారా పొంది మెరుగు పరచి వాడుకొనవచ్చు.    

ఇవీ చూడండి

మార్చు

వనరులు

మార్చు