వికీపీడియా:తెవికీ వార్త/గురించి

తెవికీ ఔత్సాహికులు, వారి పని గురించి తెలియచేసేదే ఈ పత్రిక.

లక్ష్యం
  • తెవికీ సభ్యులని దగ్గరకి చేర్చి, సమిష్ఠి కృషికి తోడ్పాటు నందించి తెవికీ అభివృద్ధికి పాటుబడటం.
సాధారణంగా దీనిలో కనబడే కథనాలు
  • తెవికీ అభివృద్ధి గణాంకాలు అంటే కొత్త వాడుకరుల సంఖ్య, కొత్త వ్యాసాల సంఖ్య మొదలైనవి వాటి విశ్లేషణ
  • వికీ ప్రచారం (వికీ అకాడమీ , అవగాహనా శిబిరాలు)
  • వికీ వాడుకరులతో ఈమెయిల్ పూర్వక సందర్శనాలు
పత్రిక సంపాదకత్వం, విధానాలు
  • పత్రిక సంపాదకత్వం వెబ్ 2.0 విధానాలకి దగ్గరగా వుంటుంది.
  • పత్రిక సజీవ పత్రిక, అంటే రచయితల అనుకూలాన్ని బట్టి వారు తమ రచనలని చేర్చవచ్చు. విషయాంశం, వికీపీడియా తెర వెనుక సంగతులు, ప్రజలకి చేరువచేర్చేది అయి వుండాలి. విషయం, వ్యాసం, కవిత, బొమ్మ, చిన్ని సినిమా తరహాలో వుండాలి. మీ వ్యక్తిగత అభిప్రాయాలకి దీనిలో చోటుంటుంది. మీ కృతి సొంతంగాని, ఇతరుల కాపీ హక్కులున్నదైతే, మీరు అనుమతి పొంది ఆ తరవాత చేర్చాలి. మీరు వికీపీడియా గురించి, మీ స్వంత బ్లాగులో రాస్తున్నట్లయితే ఆటువంటివి, దీనిలో రాయవచ్చు. ఇతర ఫార్మాటులు, కావలసిన చోటు పరిమితుల గురించి మీరు భయపడనవసరంలేదు. మీ రచనలని ఇక్కడ వుంచటం వలన, తెవికీ ని మరింత బలపరిచిన వారవుతారు.
  • ఐతే,కొత్తగా రచన చేసే వారు, సోదర సభ్యుల విమర్శని వాడి, వ్యాసాన్ని మెరుగు పరిచి పంపితే మంచిది. అవసరమైతే, సమన్వయకర్త సలహాలు తీసుకోవచ్చు.
  • మీ రచన ని, మీ వాడుకరి విభాగంలో,తెవికీ వార్త అన్న ఉప సంచయంలో రాసి, వికీపీడియాలో తెవికీ వార్త పేజీలో లింకు చేయాలి. వీటిగురించి మరిన్ని సూచనలు కాలక్రమేణా ఇవ్వబడతాయి.
  • పత్రికకి ఆర్ఎస్ఎస్ ద్వారా చందా దారుడవ్వాలి. ప్రారంభంలో, ఈ మెయిల్ ద్వారా తెవికీ గూగుల్ గుంపుకి పంపబడుతాయి.
మాటామంతీ శీర్షిక

వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా చూడండి. విమర్శలు తెలపండి.ఈ శీర్షికకి స్వతహాగా ముందుకి రావడానికి సభ్యులు ఇష్టపడక పోవచ్చు కాబట్టి సంపాదకుల ప్రతిపాదనలు, ఆహ్వానాలు మీ వాడుకరి పేజీలు, లేక వ్యక్తిగత మెయిల్ ల ద్వారా వుంటాయి. మీ తోడ్పాటు అందించండి.

సంపాదకులు మార్చు

2011 మార్చు

2010 మార్చు