వికీపీడియా:తెవికీ వార్త/201 1-05-29/మే-2011-తెవికీవార్తలు

తెవికీ వార్త
తెవికీ వార్త
మే-2011-తెవికీవార్తలు

మే-2011-తెవికీవార్తలు

అర్జున, మే 29, 2011

ప్రచారం

వికీ దశాబ్ది వుత్సవాలు హైద్రాబాదు
  • డిసెంబరు 16 నుండి 26 వరకు జరిగిన 25 వ హైద్రాబాదు పుస్తక ప్రదర్శనలో e- తెలుగు సంస్థ తరపున వికీపీడియా ప్రచారం చేపట్టటం జరిగింది.
  • నవంబరు 1,2 తేదీలలో గుంటూరులో రెండు వికీ అకాడమీలు నిర్వహించడం జరిగింది.
  • బెంగుళూర్లో వికీపిడియా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలుగు వికీపీడియా సమావేశం ఐఐఎస్సి దగ్గర గల నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ లో జరిగింది.
  • వికీపీడియా దశాబ్ది వుత్సవాలు ఘనంగా జనవరి 23, 2011 న హైద్రాబాదులో జరిగాయి.
  • మే 15 న హైద్రాబాదు నెలవారీ వికీ సమావేశాలు శ్రీకాంత్ లక్ష్మణ్ చొరవతో ప్రారంభమయ్యాయి.
  • విక్షనరీకి పదాల సహాయం కొరకు తెలుగు అకాడమీతో, అలాగే వికీపీడియా లో విజ్ఞానసర్వస్వ పుస్తకాలను వాడుకోటానికి తెలుగు విశ్వవిద్యాలయంలోని విజ్ఞానసర్వస్వ విభాగాన్ని సంప్రదించడం జరిగింది. ఇవి కార్యరూపం దాల్చటానికి హైద్రాబాదులో ని వికీమీడియన్లు కృషినికొనసాగించాలి.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వికీపీడియా

2010 లో అత్యధిక మార్పులు చేసిన పది వికీపీడియన్లకి ఇచ్చిన గుర్తింపు పతకం

2010 గణాంకాల ఆధారంగా, వ్యాసాలలో అత్యధిక మార్పులు చేసిన పదిమందిని వారి వాడుకరిపేజీలలో ప్రత్యేక బార్న్ స్టార్ గుర్తింపు పతకం ప్రవేశపెట్టడంద్వారా గుర్తించడం జరిగింది. వారి పేర్లు వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:T.sujatha, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:C.Chandra_Kanth_Rao, వాడుకరి:Nrahamthulla, వాడుకరి:వైజాసత్య, వాడుకరి:Mukteshvari, వాడుకరి:కాసుబాబుమరియు వాడుకరి:Veera.sj. వీరిలో అత్యధికంగా 4776 అత్యల్పంగా 309 మార్పులు చేసినట్లు నమౌదైంది.

విక్షనరీ

దిగుమతి చేసిన బ్రౌన్ పదకోశంలోని దోషాలను సవరించడమైనది. దీనికి విశేషంగా కృషి చేసిన వారు జెవిఆర్ కె ప్రసాదు.

వికీబుక్స్

ఉబుంటు వాడుకరి మార్గదర్శని

వికీబుక్స్ లో తెలుగు ఉబుంటు వాడుకరి మార్గదర్శని తయారుచేసి ఎలెక్ట్రానిక్ పుస్తకం పుస్తక రూపంలో విడుదలచేయబడింది. దీనిని అడోబ్ అక్రోబాట్ తో బుక్ లెట్ ప్రింటింగ్ తో ముద్రించుకుని చక్కని చిన్న పుస్తకం రూపంలో వాడుకోవచ్చుకూడా.

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
వ్యాఖ్యలు లేవు. మీరే మొదటి వ్యాఖ్య చేయవచ్చు.!