వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అట్టెం దత్తయ్య
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు) ప్రకారం నిర్ధారించదగ్గ తటస్థ మూలాలతో విషయ ప్రాముఖ్యత ఎస్టాబ్లిష్ చేసిలేదు.16:48, 24 December 2023 Pavan santhosh.s talk contribs block
ఈ వ్యాసంలో తగిన మూలలను చేర్చానని భావిస్తున్నాను. ఒకవేళ సరైన మూలాలు లేనట్లయితే దయచేసి ఎటువంటి మూలాలు చేర్చాలో తెలుపగలరు.-అభిలాష్ మ్యాడం (చర్చ) 04:47, 4 ఫిబ్రవరి 2024 (UTC)
- అభిలాష్ మ్యాడం గారూ, పైన తొలగింపు అభ్యర్థనలో Pavan santhosh.s సూచించినట్లు రచయిత విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:59, 12 అక్టోబరు 2024 (UTC)
- @MYADAM ABHILASH గారూ, వెంకటరమణ గారు చెప్పిన విషయాన్నే కొద్ది వివరంగా చెప్తాను చూడండి. విషయ ప్రాముఖ్యత (రచయితలు) లంకెలో ఉన్న సమాచారం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దయచేసి పరిశీలించండి:
- అవార్డ్ గ్రహీతలు, ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు
- రచనల ఆధారంగా సినిమాలు తయారైతే ఆ రచయితల వ్యాసాలు ఉండవచ్చు.
- రచయితలు ప్రాచుర్యం చెందిన వారైతే వారి గురించి, వారి రచనల సమీక్షలు పత్రికల్లో, అంతర్జాలంలో లభ్యమవుతుంటాయి. వాటిని మూలాలుగా తీసుకుని వ్యాసాలు రాయాలి.
- దీర్ఘకాలం పత్రికలలో ప్రత్యేక శీర్షికలు నిర్వహించిన వారు
- పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలా రచయితలు
- బహుమతి పొందిన కధలను వ్రాసిన రచయితలు
- వారి రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయినవారు.
- వారి స్వంత ప్రచురణ అయితే ఆ పుస్తకం కనీసం 3 పునర్ముద్రణలైనా ఉండాలి.
- ఈ అంశాల్లో ఏ అంశం ఆయనకు వర్తిస్తుందో చూసి, దానికి తగ్గ మూలాలు మీరు ఇచ్చినట్టైతే అప్పుడు విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చినట్టు అవుతుంది. ఈ వివరణ స్పష్టంగా లేకుంటే చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 15:38, 29 అక్టోబరు 2024 (UTC)