వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అమర రాజా గ్రూప్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : వ్యాసం విస్తరించాను. తొలగించవలసిన అవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 16:21, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక, మూలాలు లేవు. అనాథ పేజీ. దీనిని వ్యాసంగా పరిగణించలేము. కె.వెంకటరమణ (చర్చ) 06:05, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక్కసారిగా ఏది అవ్వవు. నిదానంగా అవుతాయి. కొంచెం ఓపిక కలిగి ఉండండి. హిందీ ఇతర భాషల్లో ఇంతకన్నా చిన్న వ్యాసాలు చూసా. తొలగించుకుంటూ పోతే తెలుగులో ఏమి మిగలవు. వ్యాసాలు పెంచడానికి మన ప్రయత్నం చేయాలి. తొలగించడానికి కాదు. వ్యాసం విస్తరించడానికి హెచ్చరిక పెట్టండి. తొలగించడానికి ఏమి తొందర ? దేవుడు (చర్చ) 12:13, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతిదానికి తొలగింపు జాబితాలో ఎందుకు చేరుస్తున్నారు ? మీకు వీలైతే మెరుగు పరచండి. ఊరక ఊరక తొలగింపు జాబితాలలో చేర్చకండి. దేవుడు (చర్చ) 12:25, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలా తొలగించేందుకు వంకలు వేతకాలంటే నేను చాలా చూపగలను. ఒకరి శ్రమను తేలిగ్గా తీసిపారేయకండి. దేవుడు (చర్చ) 12:27, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారు, మీరు మే 5న వ్యాసాన్ని (1720 బైట్లతో) సృష్టించారు. 6వ తేదీన విశ్వనాథ్ గారు విస్తరణ మూస పెట్టారు. ఆ తరువాత మీరు ఈ వ్యాసంలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఒక్కో భాష వికీపీడియాలో ఒక్కో నియమం ఉంటుంది. మరోసారి తెలుగు వికీపీడియా నియమాలు చూడండి. తొలగించుకుంటూ పోతే తెలుగులో ఏమి మిగలవు అన్నారు బాగానే ఉంది. మొలక వ్యాసాలు, మూలాలు లేని వ్యాసాలు రాస్తే వికీపీడియా నాణ్యత దెబ్బతింటుందన్న విషయం కూడా గ్రహించండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:38, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ, నేను చేసింది ఇదొక్కటే కాదు ఇంకా చాలా చేశాను. కొన్ని తెలుగు లోకి అనువదించాను. కొన్ని వీలైనంతలో తెలుగులో పుట ఉండాలి అనుకున్నవి వీలైనంత అనువదించి ప్రారంభించాను. అన్నీ ఒక్కరే అన్నిటికీ చేయాలంటే వీలుపడదు. సమాయనుగుణంగా అన్నీ అవుతాయి. తెలుగులో వ్యాసాలు వీలైనంత నాణ్యతతో ఎక్కువ వ్యాసాలు రాయడం, అనువదించడం నా ప్రయత్నం అని చెప్పగలను. నేను యాంత్రిక అనువాదం చేయడం లేదు. తెవికీ కి నావంతు కృషి చేస్తున్నాను. నేను తయారు చేసిన వ్యాసాలు జాబితా తయారు చేసి ఇస్తాను. అన్నీ కావాలన్న తొలగించగలరు. నేను కొత్త వాడిగా ఇప్పటికీ నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయి. వ్యాసాలు నా సంపాదన కోసం రాయడం లేదు. అమరరాజా వారు నా బంధువులు కాదు. దేవుడు (చర్చ) 12:44, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- మీరన్నది కూడా నిజమే దేవుడు గారు, అన్నీ ఒక్కరే చేయాలంటే వీలుపడదు. ప్రస్తుతం తెవికీలో 5మంది సభ్యులే చురుగ్గా ఉన్నారు. అందులో 4గురు వికీపీడియా నిర్వహణ నిమిత్తం ఇప్పటికే ఉన్న వ్యాసాలమీద పనిచేస్తున్నారు. మళ్ళీ మొలక, మూలాలు లేని వ్యాసాలు సృష్టించడం అంటే వాళ్ళకి ఇంకా పని పెంచుతున్నట్టే. మనం రాస్తున్న వ్యాసం పేరు దానికి సంబంధించిన పేజీలో ఉండి, దానికి లింక్ ఇచ్చినట్టయితే అది అనాథ పేజీ అవ్వదు. (ఉదా: అమర రాజా గ్రూప్ అనేది తిరుపతిలో ఉన్న సంస్థ. వికీపీడియాలోని తిరుపతి పేజీలో కంపెనీల విభాగంలో "అమర రాజా గ్రూప్" పేరు రాసి, దానికి లింక్ ఇవ్వాలన్నమాట.) ఇలా కనీసం రెండు వ్యాసాలలో మనం రాసేదానికి లింకు ఉండేలా చూసుకోవాలి. వికీపీడియా రచనలో సంపాదన, బంధుత్వం అనేది ఎవ్వరికీ ఉండదు అండి. వికీ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అన్నది మాత్రమే చూస్తారు. మొదట్లో అందరికి కొత్తగానే ఉంటుంది. పోను పోను వికీని అర్థం చేసుకొని, నేర్చుకొని వికీలో రాస్తాము. కొత్తవారికి కావలసిన సహకారం అందిస్తూ, వారిని పూర్తిస్థాయి వికీపీడియన్ చేయడానికి సహ సభ్యుల సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:08, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు, నాణ్యత లేని వ్యాసాలు రాయాలని ఓ తెలుగు భాషాభిమానిగా నేను కోరుకొను. కానీ ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి విస్తరించాలి. నేను కేవలం టైటిల్ పెట్టి వదలలేదు. ఓ మూడు వాఖ్యలు ముఖ్యం అనుకున్నవి ఆంగ్లం నుండి అనువదించాను. ఆంగ్ల పుట లో ఉండే ప్రతిదీ అనువదించాల్సిన పనిలేదు. వ్యాసం విస్తరణకు మూలాల కోసం హెచ్చరిక పెట్టి ఉంటే నాకు అభ్యంతరం లేదు. మనం ఏమి వికీపీడియా మీద పని చేసి సంపాదన చేయడం లేదు. మనకు జీవనం కోసం వేరే పనులు ఉంటాయి, తీరిక ఉండి లాగిన్ అయినప్పుడు చూసుకుంటాము. కానీ ఈలోగా తొలగింపు హెచ్చరిక సరికాదని నా అభిలాష. దేవుడు (చర్చ) 14:03, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారు ఇకపై మీరు కొత్తగా రాస్తున్న వ్యాసాన్ని మొలకస్థాయి దాటించి, ఒకటి లేదా రెండు మూలాలు చేర్చండి. ఆ తరువాత మీకు వీలున్నప్పుడు దాన్ని విస్తరించవచ్చు. అలా చేస్తే మొలక వ్యాసం అవ్వదు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:15, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ, ధన్యవాదాలు. నిజానికి నేను ఆ వ్యాసాన్ని నేను ఎక్కడో మూలాలు అనుసరించి చేయలేదు. కేవలం అనువదించాను. ఈ అనువాదం చేసేప్పుడు మూలాలను నేను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు, శ్రద్ద అనువాదం మీదే ఉండింది. | దేవుడు (చర్చ) (చర్చ) 14:22, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ (చర్చ) గారూ, ప్రస్తుతానికి మూలాలు చేర్చబడ్డాయి. తొలగింపు హెచ్చరిక ఇప్పుడైనా తొలగిస్తారా ? దేవుడు (చర్చ) 14:03, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ, వ్యాసాన్ని విస్తరించగలరు. కె.వెంకటరమణ (చర్చ) 14:51, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ (చర్చ) గారూ, ప్రస్తుతానికి కుదరదు. దేవుడు (చర్చ) 15:01, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ, ఇప్పటికిప్పుడు చేయమని చెప్పలేదు. వీలు చూసుకొని చేయండి. కె.వెంకటరమణ (చర్చ) 15:02, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ (చర్చ) గారూ, సరేనండి దేవుడు (చర్చ) 15:03, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ మీకు సమయం లేదని చెప్పారు. నేను విస్తరించాను. కె.వెంకటరమణ (చర్చ) 16:21, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.