వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఓపెన్ బుక్ పరీక్షా విధానం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసం ప్రధానంగా పలు వార్తాకథనాల నుంచి కాపీ చేసి తెచ్చి అతికించిన భాగాలతోనూ, అతికొద్దిగా కృత్రిమ అనువాద పాఠ్యంతోనూ నిండివున్నది. తొలగింపు ప్రతిపాదన వచ్చాక వ్యాసకర్త కాస్త ప్రయత్నించినా కూడా వ్యాసం ప్రధానంగా కాపీహక్కుల ఉల్లంఘన చేసిన భాగాలతోనే మిగిలిపోయింది. కాబట్టి, కాపీహక్కుల ఉల్లంఘన కారణంగా తొలగింపుకు గురైంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:50, 13 నవంబర్ 2020 (UTC)
వ్యాసంలో సింహ భాగం రెండు మూడు లింకుల నుంచి తెచ్చి పేస్టు చేసినది. ఉదాహరణకు "పలు యూనివర్సిటీలు ఓపెన్ బుక్ టెస్ట్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, కొన్ని ఆన్లైన్ ద్వారా ఓపెన్ బుక్ పరీక్షలను అనుమతిస్తుండంగా మరికొన్ని మాత్రం పరీక్షా కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈ విధానం అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో అమలుచేస్తున్నారు.ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలకు పూనుకున్న ఏఐసీటీఈ ఎన్నో చర్యలు తీసుకున్నా, అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోవడంతో తాజాగా ఓపెన్ బుక్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ఆమోదం తెలిపింది" అన్న భాగం పూర్తిగా http://www.andhrabhoomi.net/content/state-13229 నుంచి తెచ్చి రాసింది. అక్షరం మార్పు లేదు. ఇది కాక మిగిలిన కొద్ది భాగం ఆంగ్ల పాఠ్యం యాంత్రికంగా అనువదించగా తయారై, ఏ మార్పూ లేకుండా ప్రచురించింది. ఉదాహరణకు "ఓపెన్ బుక్ పరీక్షా విధానం అనగా విద్యార్థులు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు తరగతి నోట్స్ మరియు సారాంశాలు లేదా "మెమరీ ఎయిడ్", పాఠ్యపుస్తకాలు లేదా ఇతర ఆమోదిత మెటీరియల్ ను రిఫర్ చేయడానికి అనుమతించబడుతుంది. ఉన్న వ్యాసంలో కాపీ పేస్ట్ కంటెంటూ, యాంత్రికానువాద కంటెంటూ తొలగించేస్తే మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:53, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని అనువాదాలను సరిదిద్దాను, ఇంకా కొన్ని మార్పులు చేసాను, ఈ వ్యాసం అందరూ వికీ నియమాలు అనుగుణంగా సరిదిద్ద వచ్చు , ఆయితే వ్యాసం అంతా యాంత్రిక అనువాదం కాదు అన్న విషయం గ్రహించండి Kasyap (చర్చ) 12:04, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం అంతా యాంత్రిక అనువాదం కాదు అన్న విషయం గ్రహించండి అన్నారు. - "మిగిలిన కొద్ది భాగం ఆంగ్ల పాఠ్యం యాంత్రికంగా అనువదించగా తయారై, ఏ మార్పూ లేకుండా ప్రచురించినది." అనే కదా అన్నాను. "మిగిలిన కొద్ది భాగం" అని అంటే "వ్యాసం అంతా" అన్నట్టు భావించవద్దు. ప్రధానమైన కంప్లైంటు "వ్యాసంలో సింహ భాగం రెండు మూడు లింకుల నుంచి తెచ్చి పేస్టు చేసినది." అన్నదే! గ్రహించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 12:58, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.