వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తథాస్తు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:10, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. లింకులు లేవు. ఇది ఒక అర్థాన్ని మాత్రం తెలియజెసే పదం మాత్రమే అనిపిస్తుంది. దీనిని వ్యాసంగా పరిగణించలేము. వ్యాసం విషయం వదిలి పలు దీవెనల సమాచారం చేర్చారు. ఒక వారం రోజులలో సరైన సమాచారంతో మూలాల సహితంగా విస్తరించనిచో ఈ వ్యాసాన్ని తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 08:09, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తథాస్తు! __ చదువరి (చర్చ • రచనలు) 08:23, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- దీనిని వ్యాసంగా పరిగణించలేము.వైవిఎస్ రెడ్డి గారికి ఏ పదం గుర్తుకు వస్తే ఆపదానికి వ్యాసం సృష్టించినట్లుగా ఉంది. మే 14 లోపు తగిన మూలాలతో వ్యాసాన్ని విస్తరించినచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 08:33, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:37, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 14:16, 18 జూన్ 2012 YVSREDDY చర్చ రచనలు
ఈ వ్యాసంలో ఉన్న సమాచారం:
తధాస్తు లేక తధాస్థు అంటే అటులనే జరుగుగాక అని అర్ధం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేక కావాలనుకున్నప్పుడు లేక ఇతరులు దీవించినప్పుడు మనం అన్న మాటలు విన్నవారు అలాగే జరుగుగాక లేక ఇది తధ్యం అని అంటే కచ్చితంగా జరుగుతుందని భావించిన మన పెద్దలు తధాస్తు అని దీవెనలంధిస్తారు.
పలు దీవెనలు
మార్చుసుఖీభవ - సుఖంగా ఉండుగాక అని అర్ధం
శీఘ్ర మేవ కళ్యాణ ప్రాప్తిరస్తు (కళ్యాణమస్తు) - తొందరగా పెళ్ళి అవుగాక
దీర్ఘ సుమంగళి భవ - కలకాలం సుమంగళిగా ఉండుగాక అని అర్ధం
చిరంజీవ (ఆయుష్మాన్‌భవ) - చిరకాలం జీవించుగాక
మనోవాంఛ సిద్ధిరస్తు - మనసులో ఉన్నది జరుగుగాక
తధాస్తు దేవతలు
మార్చుమనుషులు దీవించడంతో పాటు పైన దేవతలు సంచరిస్తుంటారని వారు కూడా దీవెనలందిస్తారని పెద్దలు చెబుతుంటారు.
ములాలు
మార్చు
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.YVSREDDY (చర్చ) 15:10, 9 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.