వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బహుమతి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 12:43, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదొక మొలక వ్యాసం. ఖాళీ విభాగాలను చేర్చడంతో దాని సైజు పెరిగింది. వాటిని తీసేస్తే ఇందులో సమాచారం పెద్దగా ఏమీ లేదు. పైగా, ఆ ఉన్న సమాచారం కూడా ఏదో ఉబుసుపోక కబుర్లు చెబుతున్నట్టుంది. సరైన నిర్వచనాలు లేవు. పోటీల్లో ఇచ్చేవే బహుమతులైతే, పుట్టినరోజుల్లో, పెళ్ళిళ్లలో ఇచ్చేవాటిని ఏమనాలి? ఇదేమి సమాచారం? ఇదొక విజ్ఞాన సర్వస్వ పేజీయా? ఒక పాఠకుడిగా నాకిది ఒక జోకు లాగా తోస్తోంది. ఉన్న సమాచారపు విశ్వసనీయతను నిరూపించాలంటే మూలాలుండాలి. మరింత సమాచారాన్ని చేర్చి వ్యాసానికి ఒక కనీస స్థాయిని (నాణ్యత పరంగాను, పరిమాణం పరంగానూ) కల్పించాలి. 2021 ఫిబ్రవరి 5 లోగా ఇది జరక్కపోతే ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:41, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వివరించిన ప్రకారం మరింత సమాచారాన్ని చేర్చి వ్యాసానికి ఒక కనీస స్థాయిని (నాణ్యత పరంగాను, పరిమాణం పరంగానూ) కల్పించాలి. 2021 ఫిబ్రవరి 5 లోగా ఇది జరక్కపోతే ఈ పేజీని తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 06:20, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రతిపాదకునితో ఏకీభవిస్తున్నాను. ఈ వ్యాసాన్ని తొలగించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 09:00, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.