వికీపీడియా:నిర్వాహకులు గమనిస్తూ ఉండవలసిన పేజీలు
వికీపీడియాలో చేరుతున్న సమాచారం సక్రమమైన రీతిలో చేరడానికీ, పెడధోరణులను అరికట్టడానికీ, వాడుకరులకు ఎదురయ్యే ఇబ్బందులను సవరించడానికీ, వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడానికీ నిర్వాహక పనులు దోహదపడుతాయి. నిర్వహణ సక్రమంగా జరగాలంటే నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. నిర్వహణ కోసం ఏయే పేజీలు వేచి చూస్తున్నాయో తెలియడానికి అనేక పేజీలను చూడాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు క్రమం తప్పకుండా ఇటీవలి మార్పులు చూస్తూ ఉండాలి. అలాగే అనేక ఇతర వికీపీడియా పేరుబరి లోని పేజీలు, వర్గాలూ ఉన్నాయి. నిర్వహణ పనులు ఎక్కడెక్కడున్నాయో ఈ పేజీలు చూస్తే తెలుస్తుంది.
వికీలో ఏయే పనులు నిర్వహణ కోసం వేచి ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక మార్గసూచీ ఇది. ఒక చెక్‌లిస్టు లాంటిది.
ముఖ్యమైన పేజీలు
మార్చుఈ పేజీలను నిర్వాహకులు సదా చూస్తూ ఉండాలి. వీటిని అనుభవజ్ఞులైన వాడుకరులు, నిర్వాహకత్వం పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా చూసి, ఆయాపనులు చెయ్యవచ్చు.
- ప్రత్యేక:ఇటీవలిమార్పులు పేజీలో అజ్ఞాతలు, కొత్తవారు చేసే దిద్దుబాట్లు, తనిఖీ చెయ్యవలసిన పేజీలు - వీటికి వేరువేరు రంగులను పెట్టుకుంటే చూడగానే గబుక్కున కనుక్కోవచ్చు.
- వికీపీడియా:రచ్చబండ దాని ఉప పేజీలు
- వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) లోని తాజా చర్చలలో పాల్గొని అభిప్రాయాలు చెప్పేందుకు, నిర్ణయాలు ప్రకటించేందుకు
- వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు - తొలగింపు ప్రతిపాదన చేసిన పేజీల చర్చల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పేందుకు, నిర్ణయం ప్రకటించేందుకు
- వర్గం:అభిప్రాయాలను కోరుతున్న చర్చలు - చర్చ పేజీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం, నిర్ణయాలు ప్రకటించడం చేసేందుకు
- వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు - చర్చ పేజీల్లో అవసరమైన చోట్ల తగు సహాయం చేసేందుకు
- వర్గం:వ్యాసాల నిర్వహణ - వ్యాసాల్లో చెయ్యవలసిన పనులన్నీ ఇక్కడి ఉపవర్గాల్లో ఉంటాయి.