వికీపీడియా:నిర్వాహకుల మార్గదర్శిని

ఈ పేజీ - మీ నిర్వాహక అధికారాలను ఎలా వినియోగించాలో తెలియచేసే మార్గదర్శిని . నిర్వాహకుని పనులను ఎలా చెయ్యాలో తెలియచేస్తుంది, కాని దాని కొరకు మీరు అవలంబించ వలసిన విధానాల ను ఇక్కడ వివరించదు. నిర్వాహకులు చదవవలసిన జాబితా లో లింకులున్న పేజీ లను చదివి, ఆయా విధానాలను తెలుసుకున్న తరువాతే, ఈ పేజీలో వివరించిన పనులను చెయ్యండి.

పేజీని తొలగించడం

మార్చు

తొలగించదలచుకున్న పేజీ లోని తుడిచివేయి (తొలగించు) లింకును నొక్కండి. మీరు మోనోబ్లాక్‌ తొడుగు వాడుతుంటే, alt+d షార్ట్‌ కట్‌ ను వాడవచ్చు. అపుడు మీకో పేజీ, దానిలో తొలగింపు కారణం రాయడానికి ఒక పెట్టె, ఒక confirm మీట ఉంటాయి. ఒక్కోసారి ఆ పెట్టెలో పేజీ లోని మొదటి 150 అక్షరాలు ఉండవచ్చు. చక చకా పని కానిద్దామనుకుంటే, దానినే కారణంగా ఉంచేయ వచ్చు. లేకపోతే, తొలగింపుకు కారణమేంటో తప్పక రాయాలి. మచ్చుకు ఒక కారణం - "VfD లో 5 రోజులు పెట్టాము, 18 వోట్లు తొలగించడానికీ, 1 ఉంచడానికీ పడ్డాయి".


పేజీ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ కూర్పులు ఉంటే, నిర్ధారణ పేజీ ఒక హెచ్చరిక చేస్తుంది. అది త్వరగా తొలగించవలసిన పేజీ అయితే, పైగా పేజీ చరితం ఉంటే, తొలగించే ముందు, దాని చరిత్ర చూడండి. మీరు చూస్తున్న కూర్పు అసలు వ్యాసాన్ని చెడగొట్టిన కూర్పు కావచ్చు. తొలగించిన తరువాత, దానికి చర్చా పేజీ ఉందేమో చూసి, ఉంటే దాన్ని కూడా తొలగించండి. పేజీ ఉండ కూడనిది కనుక తొలగిస్తూంటే, దానికి వేరే ఎక్కడి నుండీ లింకులు లేవని నిర్ధారించుకోండి - లేక పోతే, అది మళ్ళీ తయారయ్యే అవకాశం ఉంది. పేజీ VfD లో చేరి ఉంటే వికీపీడియా:తొలగింపు విధానం లోని మార్గదర్శకాలను అనుసరించండి. ఎందుకంటే, తొలగింపుకు సంబంధించిన చర్చ ను దాచి పెట్టవలసిన అవసరం ఉండవచ్చు. వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు మరియు వికీపీడియా:తొలగింపు విధానం చూడండి.

బొమ్మను తొలగించడం

మార్చు

కొత్త నిర్వాహకులు సాధారణంగా చేసే ఒక పొరపాటు ఏమిటంటే బొమ్మకు బదులు బొమ్మ వివరణ పేజీ ని తొలగించడం. బొమ్మ వివరణ పేజీ లో కూడా మిగతా పేజీ ల లాగానే, తొలగించు లింకు ఉంటుంది. దీన్ని వాడవద్దు!

బొమ్మ యొక్క పాత కూర్పు ను తొలగించాలనుకుంటే, బొమ్మ పక్కనే ఉండే del లింకును నొక్కాలి.


బొమ్మకు ఒకటి కంటే ఎక్కువ కూర్పులు ఉండీ, "ఈ బొమ్మ యొక్క అన్ని కూర్పులనూ తొలగించు" అనే లింకు నొక్కారనుకోండి - ఖచ్చితంగా అదే జరుగుతుంది. అన్నిటి కంటే కొత్త కూర్పును తొలగించాలంటే - మొత్తం పాత కూర్పులన్నింటినీ తొలగించాలి, బొమ్మ వివరణ పేజీ ని కూడా తొలగించాలి.

"ఈ బొమ్మ యొక్క అన్ని కూర్పులనూ తొలగించు" ను నొక్కిన తరువాత ఒక నిర్ధారణ తెర వస్తుంది. తొలగింపు లాగ్‌ అవుతుంది. ఒక పాత కూర్పును మాత్రమే తొలగించేటపుడు ఈ నిర్ధారణ జరగదు కానీ లాగింగు మాత్రం జరుగుతుంది.

బొమ్మ తొలగింపు తిరిగి స్థాపించలేనిది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

తొలగింపును తిరిగి స్థాపించడం (పునస్థాపన)

మార్చు

తొలగించిన పేజీ లు సంగ్రహం (arcive) లో ఉన్నంత వరకు వాటిని తిరిగి స్థాపించవచ్చు. ఈ సంగ్రహాన్ని ఒక్కోసారి శుధ్ధి చెయ్యవచ్చు, లేదా డాటాబేసు క్రాష్‌ అయినపుడు పోవచ్చు. సంఘ్రహాన్ని ఎప్పుడు శుధ్ధి చేసారనే సందేశం పునస్థాపనకై వోట్లు పేజీ లో పైన ఉంటుంది.


పేజీ ని తొలగించిన తరువాత తిరిగి సృష్టించక పోతే, దానికి ఎన్ని తొలగింపు కూర్పులున్నాయో ఒక సందేశం వస్తుంది. దాన్ని నొక్కి నపుడు, తొలగించిన కూర్పుల పేజీ కి తీసుకు పోతుంది. ప్రతి కూర్పును విడిగా చూడవచ్చు. నిర్ధారణ పేజీ లో వచ్చే restore మీట ను నొక్కి పేజీ ని తిరిగి స్థాపించవచ్చు; ఇది డిఫాల్టు గా అన్ని కూర్పులనూ పునస్థాపితం చేస్తుంది. కావాలనుకుంటే, కొన్ని నిర్దిష్ట కూర్పులను మాత్రమే ఎంచుకుని (చెక్‌ బాక్సుల లో తిక్కు పెట్టి) వాటిని మాత్రమే పునస్థాపితం చెయ్యవచ్చు. పునస్థాపితం వెంటనే జ్రిగిపోతుంది; నిర్ధారణ వంటివేమీ ఉండవు. తొలగింపుల వలెనే పునస్థాపితాలు కూడా లాగ్‌ అవుతాయి; అన్ని కూర్పులనూ పునస్థాపితం చెయ్యకపోతే ఎన్నిటిని చేసారో ఈ లాగ్‌ చూపిస్తుంది.


పేజీ ఇప్పటికే ఉండి, దాని పాత కూర్పులను పునస్థాపితం చెయ్యదలచుకుంటే, ఆ పేజీ చరితం కు వెళ్ళండి. పైన చెప్పిన విధంగా పునస్థాపితం కు లింకు కనపడుతుంది. మొతం URL ను టైపు చేసి పున్స్థాపితం చెయ్యవచ్చు. ఉదాహరణకు http://en.Wikipedia.org/wiki/Special:Undelete/Foo. Special:పునస్థాపన పేజీ చాలా నిదానం గా వస్తుంది, కనుక అది అంత అనుకూలం కాదు.


నిర్వాహకులు తొలగించిన పేజీలు చూడటం మరియు పునస్థాపన మరియు వికీపీడియా:పునస్థాపన విధానం చూడండి.

పేజీ చరిత్రల సంకలనం (merging)

మార్చు

ఇదివరలో జరిగిన కట్టు, పేస్టు లను సరిదిద్దే పనే పేజీ చరిత్రల సంకలనం. ముందు పేజీ ని తొలగించడం, ఇంకో పేజీ ని దాని స్థానం లోకి తరలించడం, ముందు తొలగించిన పేజీ ని దీని పైకి పునస్థాపితం చెయ్యడం - ఇదీ సంకలనం అంటే. సంకలనం ఒకసారి చేస్తే అంతే మళ్ళీ వెనక్కు తీసుకోలేము. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇది చేసే పద్ధతి వికీపీడియా:how to fix cut and paste moves పేజీ లో వివరంగా ఉంది, ముందు అది చదివి అర్ధం చేసుకోండి.

పేజీని రక్షించడం, విడుదల చెయ్యడం

మార్చు

పేజీ ని రక్షించడానికి దాని కాపాడు లింకును నొక్కండి. మోనోబుక్‌ తొడుగు లో alt+= అనే షార్ట్‌ కట్‌ ను వాడవచ్చు. అప్పుడు ఒక నిర్ధారణ పేజీ వస్తుంది. రక్షించడానికి కారణం ఏంటో పెట్టె లో రాసి, నిర్ధారణ పెట్టె ను టిక్కు చేసి, చొంఫిర్మ్‌ మీటను నొక్కండి. ఇది లాగ్‌ అవుతుంది, కాని మీరు దాన్ని వికీపీడియా:రక్షిత పేజీ లో రాయాలి. దిద్దుబాటు యుధ్ధాల సందర్భాలలో మీరు రక్షిస్తున్న పేజీ పైన {{రక్షించబడినది}} అనే టాగ్‌ ను పెట్టాలి. విడుదల చేసే పద్ధతి కూడా ఇంతే.

రక్షించిన పేజీ లో దిద్దుబాట్లు చెయ్యడం

మార్చు

మామూలు గానే మార్చు లింకును నొక్కండి. తేడా అల్లా పైనున్న రక్షించబడినది అనే హెచరికే. ఇది చేసే ముందు రక్షణ విధానం చదవండి.

బొమ్మను రక్షించడం విడుదల చెయ్యడం

మార్చు

పేజీ ని రక్షించడం ఎలాగో బొమ్మను రక్షించడమూ అంతే. బొమ్మ వివరణ పేజీ లోని "కాపాడు" లింకును నొక్కినపుడు, ఆ పేజీ, బొమ్మా రెండూ రక్షింప బడతాయి. అప్పుడు నిర్వాహకులు కాని వారు బొమ్మను పాత కూర్పుకు తీసుకువెళ్ళడం కానీ, కొత్త కూర్పును అప్‌లోడు చెయ్యడం కాని చెయ్యలేరు.

(Interface) రూపు ను సరిదిద్దడం

మార్చు

పేజీ రూపు లోని భాగాలను సరిదిద్దడానికి ఏకాభిప్రాయం సాధించాక మీడియావికీ నేంస్పేసు లో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. రూపు యొక్క దిజైనును మీడియావికీ:Monobook.css వద్ద మార్చ వచ్చు. ఈ పేజీ లను మామూలు గానే సరి దిద్దవచ్చు, కానీ కొన్నిటికి HTML అవసరం పడవచ్చు.

ఒక సభ్యుని లేదా IP ని నిరోధించడం

మార్చు

IP ల కొరకు ఇటీవలి మార్పుల లోని IP అడ్రసు పక్కనే గల నిరోధించు లింకును నొక్కవచ్చు. లాగిన్‌ అయిన సభ్యుల కొరకు Special:blockip కి వెళ్ళాలి. మొదటి ఫీల్డు లో పేరు లేదా IP ని రాసి, ఎన్నాళ్ళు నిరోధించాలో రెండో దానిలో రాయాలి. సాధారణంగా ఇది "24 గంటలు" ఉంటుంది. కాని ఇది ఫలానా ఇన్ని రోజులని గాని, ఫలానా తేదీ వరకు అని గానీ కూడా ఇవ్వవచ్చు. the tar manual చూడండి. మూడో ఫీల్డు లో కారణం రాయండి. ఈ కారణం సభ్యునికి అర్ధమయ్యేలా వివరంగా ఉండాలి. అనుకోకుండా వేరే వాళ్ళు కూడా నిరోధం పరిధి లోనికి రావచ్చు - ఈ సందేశం వాళ్ళూ చూస్తారు, అందుచేత, కారణం స్పష్టంగా ఉండాలి, దురుసుగా ఉండరాదు. తరువాత block this userమీట ను నొక్కండి. ఇది లాగ్‌ అవుతుంది, ఆ సభ్యుని పేరు list of blocked IP addresses and usernames లో చేరుతుంది. వికీపీడియా:నిరోధించు విధానం చూడండి.

IP ల వరుసను నిరోధించడం

మార్చు

Special:blockip కి వెళ్ళీ మొదటి ఫీల్డు లో (CIDR పద్ధతి లో [aka slash notation]) IP వరుసను రాయండి. తరువాత పైన చూపిన సూచనలను అనుసరించండి. ఈ పద్ధతి పూర్తిగా అర్ధం కాకుండా IP ల వరుసను నిరోఢించవద్దు. సూచనల కొరకు m:vandalbot చూడండి.

IP లేదా వరుస ల నిరోధం తొలగించడం

మార్చు

Special:IPblocklist కు వెళ్ళి, సభ్యుని గుర్తించి, unblock లింకును నొక్కండి. నిర్ధారణ పేజీ లో కారణం రాయాలి. ఇది లాగ్‌ అయి, నిరోధం వెంటనే తొలగి పోతుంది. IP వరుస విషయంలో పూర్తి వరుసకు నిరోధం తొలగించవలసి ఉంటుంది, వరుస లోని కొన్ని IP ల నిరోధం మాత్రమే తొలగించడం కుదరదు.

ప్రత్యేక పునస్థాపన

మార్చు

ఏ సభ్యుడైనా పేజీ ని పునస్థాపించ వచ్చు. నిర్వాహకుడు మరింత సులభంగా చెయ్యడానికి rollback అనే లింకు ఉంది. పేజీ ని పూర్వపు కూర్పుకు స్థాపించడానికి పేజీ చరితం లోని, లేదా సభ్యుని మార్పులు చేర్పుల పేజీ లోని లేదా తేడాలు పేజీ లోని rollback లింకును నొక్కండి. ఇది చిన్న మార్పు గా గుర్తించ బడి, దిద్దుబాటు సారాంశంలో Reverted edits by X to last version by Y అనే వాక్యం వచ్చి చేరుతుంది. విపరీతమైన దుశ్చర్యలతో పోటెత్తి పోయిన పేజీ కి సంబంధించి "bot rollback" వాడవచ్చు. సభ్యుని మార్పులు చేర్పులు పేజీ URL చివర &bot=1 అని రాయాలి. ఉదాహరణకు, http://en.wikipedia.org/w/wiki.phtml?title=Special:Contributions&target=Vandal&bot=1. ఈ rollback లింకును నొక్కి నపుడు, ఆ పేజీ, వెనక్కి వెళ్తున్న పేజీ రెండూ కూడా ఇటీవలి మార్పులు జాబితా లో కనపడవు. Wikipedia:Revert చూడండి.

డాటాబేసును ప్రశ్నించడం

మార్చు

You can run read-only SQL queries on some of the tables in the database using the interface at Special:Asksql. See వికీపీడియా:Database queries for some example queries. To run the query, just enter the correct SQL in the box shown at Special:Asksql and then click the "submit query" button. Queries that take longer than 30 seconds are not allowed and should time out by themselves. Successful queries will load a new page showing the results. There is a log of all queries. If you are not confident about using SQL, you can ask someone else do this at వికీపీడియా:SQL query requests.

Note that Special:Asksql has been disabled for now. Instead, go to m:Requests for queries. Remember to mention there that you want the query run on the English Wikipedia database.

సంబంధిత పేజీ లు

మార్చు