వికీపీడియా:పురస్కారాలు

వికీపీడియన్ల కృషికి, శ్రద్ధకూ గుర్తింపుగా వివిధ పురస్కారాలు ఇచ్చే సంప్రదాయం వికీపీడియాలో ఉంది. ఈ పురస్కార వ్యవస్థలో వివిధ రకాల పురస్కారాలున్నాయి. వాటి గురించిన వివరాలు ఈ పేజీలో ఉంటాయి.

వివిధ పురస్కారాలు

మార్చు
  • వికీపీడియా:బార్న్‌స్టార్స్: వికీపీడియాలో వాడుకరులు దీర్ఘకాలంలో చేసిన ఉత్కృష్టమైన, గొప్ప కృషికి గుర్తింపుగా ఇతర వికీపీడియన్లు ఇస్తారు.
  • వికీపీడీయా:వ్యక్తిగత వాడుకరి పురస్కారాలు: వికీపీడియాలో వాడుకరులు చేసిన ఏదైనా స్వల్పకాలిక ప్రత్యేక కృషికి లేదా ఏదైనా ఘటనలో చేసిన ఉత్తమ కృషికీ గుర్తింపుగా సాటి వికీపీడియన్లు ఇస్తారు.
  • వికీపీడియా:సేవా పురస్కారాలు: వికీపీడియాలో తాము చేసిన దిద్దుబాట్ల సంఖ్యకు, ఇక్కడ పనిచేసిన కాలానికీ కలిపి తమకు తామే ఇచ్చుకునే గుర్తింపు ఈ పురస్కారం. దీని ఎంపికకు ప్రత్యేకంగా పద్ధతి అంటూ అవసరం లేదు. దిద్దుబాట్ల సంఖ్య, పనిచేసిన కాలం - ఈ రెండింటి ప్రకారం వాడుకరి తనకు సరిపోయిన పురస్కారాన్ని తన వాడుకరి పేజీలో పెట్టేసుకోవచ్చు.
  • వికీపీడియా:నిర్వాహక సేవా పురస్కారాలు: సేవా పురస్కారాలు వికీపీడియాలో సంపాదకులు చేసిన దిద్దుబాట్ల సంఖ్యకు, ఇక్కడ పనిచేసిన కాలానికీ కలిపి తమకు తామే ఇచ్చుకునే గుర్తింపు కాగా, ఇది నిర్వాహకులకు ప్రత్యేకించిన సేవా పురస్కారం. దీని ఎంపికకు కూడా ప్రత్యేకంగా పద్ధతి అంటూ అవసరం లేదు. నిర్వాహక పనుల సంఖ్య, నిర్వాహకులుగా పనిచేసిన కాలం - ఈ రెండింటి ప్రకారం నిర్వాహకులు తనకు సరిపోయిన పురస్కారాన్ని తన వాడుకరి పేజీలో పెట్టేసుకోవచ్చు.
  • మెటా వికీ బహుమతులు: వికీపీడియన్లు వికీపీడియాకు దీర్ఘకాలంగా చేసిన ఉత్తమోత్తమ కృషికి, వికీ అభివృద్ధికి చేసిన బహుముఖ సేవలకు గుర్తింపుగా వికీమీడియా ఫౌండేషను ద్వారా అందజేసే బహుమానాలు. ఈ అర్హత ఉన్న వాడుకరులను, ఏ వికీమీడియా ప్రాజెక్టుకు చెందినవారినైనా, సాటి వాడుకరులెవరైనా ఈ మెటా పేజీలో ప్రతిపాదించవచ్చు. ప్రతిపాదనను వోటింగుకు పెట్టి మెటా ఎంపిక చేస్తుంది.

పురస్కారాన్ని సగౌరవంగా తిరస్కరించడం

మార్చు

పురస్కారాన్ని ఇచ్చినవారు సదుద్దేశంతో ఇస్తారు. కానీ స్వీకర్త, తాను ఆ పురస్కారానికి తగనని భావించినపుడు దాన్ని సగౌరవంగా కాదనవచ్చు. ఆ పురస్కారాన్ని ఇచ్చినవారిని నొప్పించకుండా ఈ పని చెయ్యవలసి ఉంటుందని గమనించాలి.