సేవా పురస్కారాలు అనేది రెండు నిర్దుష్ట ప్రమాణాల ఆధారంగా సంపాదకుల కృషి స్థాయిని గుర్తించే సులభమైన మార్గం. ఈ ప్రమాణాలు: 1. వికీపీడియాలో సంపాదకుడు చేసిన దిద్దుబాట్ల సంఖ్య, 2. వికీపీడియాలో వాడుకరిగా నమోదైన సమయం. వికీపీడియా సేవా పురస్కారాలు, స్వీయ పురస్కారానికి ఒక మార్గంగా ఒక విద్యావేత్త అభివర్ణించారు. [1] వాటిని స్వయంచాలకంగా సాధించిన మైలురాళ్లుగా కూడా భావించవచ్చు.
ఈ పురస్కారాలు ఒక సంపాదకుడు మరొకరికి ప్రశంసాపూర్వకంగా ఇచ్చే ఇతర పురస్కారాల వంటివి కాదు; ఇది తమకు తామే ఇచ్చుకునేందుకు ఉద్దేశించబడినది. వాడుకరిగా నమోదు చేసుకున్న సమయం, చేసిన దిద్దుబాట్ల సంఖ్యల ఖచ్చితమైన యాంత్రిక గణన ద్వారా ఇది తెలుస్తుంది. ఈ పురస్కారాలను అందించేందుకు ఎటువంటి ప్రక్రియ అవసరం లేదు; వాడుకరి తన అర్హతను బట్టి తానే గ్రేడ్‌ని నిర్ణయించుకుని, ఆపై దానిని తన వాడుకరి పేజీలో ప్రదర్శించుకోవడమే. ఏ పురస్కార స్థాయికైనా అర్హత పొందాలంటే చేరిన సమయం, చేసిన దిద్దుబాట్లు రెండూ సరిపోవాలి.
ఒక ముఖ్యమైన గమనిక: ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు, ఎన్ని దిద్దుబాట్లు చేసారు అనేది సంపాదకులు చేసిన దిద్దుబాట్ల నాణ్యతకు గాని, దౌత్య సామర్థ్యానికి గానీ సూచిక కాదు. అందువల్ల, సేవా అవార్డులు ఏ స్థాయి గొప్పదనాన్నీ సూచించవు; ఈ పురస్కారం ద్వారా "కొత్త" సంపాదకుల కంటే "మాస్టర్" సంపాదకులకు ఎక్కువ అధికారాలేమీ రావు.
మీ దిద్దుబాట్ల గణన, మీ మొదటి దిద్దుబాటు చేసిన తేదీని తెలుసుకోవడానికి, గ్లోబల్ ఖాతా సమాచారాన్ని వీక్షించండి కింద ఈ సమాచారం కనిపించే ప్రాధాన్యతలను క్లిక్ చేయండి. మరింత వివరణాత్మకమైన దిద్దుబాట్ల సంఖ్య అనేది వినియోగదారు విశ్లేషణ సాధనం వంటి ఇతర దిద్దుబాటు సంఖ్యల లెక్కింపు, విశ్లేషణ సాధనాలు కూడా ఉన్నాయి. ఈ సాధనాలన్నీ ఒకే రకమైన సంఖ్యలను చూపవు, వాటిలో కొద్ది భేదాలుంటాయి. ఎందుకంటే అవి వివిధ గణన పద్ధతులపై ఆధారపడతాయి.
కింది పట్టిక ప్రతి పురస్కార స్థాయికి సంబంధించిన అవసరాలను జాబితా చేస్తుంది. ప్రతి పురస్కార స్థాయికీ సేవ చేస్తున్న కాలం, మొత్తం సవరణల సంఖ్య రెండూ తప్పనిసరిగా ఉండాలి.
మీ దిద్దుబాట్లను ఎలా లెక్కించాలనేది మీ ఇష్టం. బాట్‌ల ద్వారా, ఎడబ్ల్యూబి ద్వారా చేసిన దిద్దుబాట్లు, తొలగించబడినవాటితో సహా అన్ని దిద్దుబాట్లనూ లెక్కించడం సరైనదే. ఇతర వికీమీడియా ప్రాజెక్టులలో చేసిన సవరణలను కూడా కలుపుకోవచ్చు. మీరు అనామక IP ఎడిటర్‌గా చేసిన మొదటి IP దిద్దుబాటు సమయం నుండి లెక్కించాలనుకుంటే, అలా కూడా చెయ్యవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను వాడుతున్నట్లయితే లేదా వాడి ఉన్నట్లయితే, ఆ ఇతర వాడుకరి ఖాతాల ద్వారా చేసిన దిద్దుబాట్ల సంఖ్యను కూడా కలుపుకోవచ్చు. మీరు నిర్వాహకులైతే, నిర్వాహక చర్యలను కూడా లెక్క లోకి తీసుకోవచ్చు. మీకు పాత ఖాతా ఏదైనా ఉంటే లేదా మీ IP చిరునామా నుండి దిద్దుబాట్లు చేసి ఉంటే అలా మొదలుపెట్టిన సమయం నుండి లెక్కించడం ప్రారంభించవచ్చు. ఇదంతా గౌరవ వ్యవస్థపై ఆధారపడినట్టిది; మీకు అత్యంత ఖచ్చితంగా సరిపోయే పురస్కార స్థాయి ఏదని భావిస్తారో దాన్ని ఎంచుకోండి.
ఒక్కటి మాత్రం స్పష్టం- దిద్దుబాట్ల సంఖ్య, దిద్దుబాట్లు చేసిన సమయం రెండూ సరిపోయిన స్థాయినే ఎంచుకోవాలి.
మీరు మీ సేవా సమయానికి, దిద్దుబాట్ల సంఖ్యకూ తగిన చిత్రాన్ని గాని, వినియోగదారు పెట్టెను గాని, టాప్ ఐకన్ను గానీ మీ వాడుకరి పేజీలో చూపేందుకు {{Service awards}} అనే మూసను ఉంచవచ్చు. మీరు వికీపీడియాలో నమోదు చేసుకున్న సమయాన్ని లెక్కించడానికి గాను, మీ నమోదు తేదీని పేర్కొనే |year=, |month=, |day= అనే పారామితులను తప్పనిసరిగా ఇవ్వాలి. |edits= పరామితిలో మీ దిద్దుబాట్ల సంఖ్యను తప్పనిసరిగా ఇవ్వాలి. మీ దిద్దుబాట్ల సంఖ్య సేవా పురస్కారాల స్థాయిని దాటిన ప్రతిసారీ దీన్ని నవీకరించాలి. ప్రదర్శన ఆకృతిని పేర్కొనడానికి |format= పరామితిని ఉపయోగించవచ్చు. వివరాల కోసం మూస డాక్యుమెంటేషను చూడండి.
క్రింది పట్టిక నుండి మీకు సరిపోయే పురస్కార మూసను ఎంచుకుని మీ వాడుకరి పేజిలో పెట్టుకోవచ్చు కూడా:
ఈ సంపాదకులు ఒక Tutnum of the Encyclopedia. ఈ Book of Knowledge with Coffee Cup Stain, Cigarette Burn, and Chewed Broken Pencil ను ప్రదర్శించుకునే అర్హత వీరికి ఉంది.
ఈ సంపాదకులు ఒక Labutnum. ఈ Book of Knowledge with Coffee Cup Stain, Cigarette Burn, Chewed Broken Pencil, and Sticky Note ను ప్రదర్శించుకునే అర్హత వీరికి ఉంది.
ఈ సంపాదకులు ఒక Most Pluperfect Labutnum. ఈ Book of Knowledge with Coffee Cup Stain, Cigarette Burn, Chewed Broken Pencil, Sticky Note, and Bookmark ను ప్రదర్శించుకునే అర్హత వీరికి ఉంది.
ఈ సంపాదకులు ఒక Labutnum of the Encyclopedia. ఈ Book of Knowledge with Coffee Cup Stain, Cigarette Burn, Chewed Broken Pencil, Sticky Note, Bookmark, and Note from Jimbo ను ప్రదర్శించుకునే అర్హత వీరికి ఉంది.
ఈ సంపాదకులు ఒక Most Plusquamperfect Looshpah Laureate. ఈ Book of All Knowledge with Secret Appendix and Free Errata Sheet ను ప్రదర్శించుకునే అర్హత వీరికి ఉంది.
ఈ సంపాదకులు ఒక Looshpah Laureate of the Encyclopedia. ఈ Book of All Knowledge with Secret Appendix, Free Errata Sheet, and Author's Signature ను ప్రదర్శించుకునే అర్హత వీరికి ఉంది.
This editor is Cardinal Gom, the August Togneme of the Encyclopedia and is entitled to keep the floor plan of The Great Library of Alecyclopedias, signed by Jimbo with a silver marker, and including its cardboard carrying tube.