వికీపీడియా:లక్షపై సమీక్ష

తెవికీని లక్ష వ్యాసాల మైలురాయిని దాటించి రెండో లక్ష దిశగా సాగుతున్న సందర్భంగా అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా ఒక సమీక్ష, ఒక మునుజూపు చెయ్యడం ఈ పేజీ ఉద్దేశం.

కొన్ని గణాంకాలు

  • మొత్తం వ్యాసాలు: 1,02,171
  • మొత్తం వ్యాసాల్లో ఎవరెవరు ఎన్నెన్ని వ్యాసాలు రాసారో ఇక్కడ చూడండి.

ఏమేం పనులున్నాయ్?

మార్చు

ప్రస్తుతం మన వ్యాసాల స్థితి ఎలా ఉంది అనేది చూస్తే మనం ఏం చెయ్యాలి అనేది కొంతవరకు తెలుస్తుంది. ప్రస్తుత స్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రత్యేకపేజీల్లో కొన్ని బాగా పనికొస్తాయ్. పెట్‌స్కాన్‌లో బోలెడు సంగతులు తెలుసుకోవచ్చు. క్వారీలో క్వెరీల్రాసి మరి కొన్ని తెలుసుకోవచ్చు.

  • భాష. వ్యాసాల్లో భాషను సరిచెయ్యాలి.
  • మొత్తం వ్యాసాల్లో అనాథల జాబితా ఇది. సెప్టెంబరు 29 నాటికి అనాథల సంఖ్య 6000 కు పైనే. (లక్ష వ్యాసాలున్న తెవికీలో 6000 అనాథలు కాగా, 70 లక్షల వ్యాసాలున్న ఎన్వికీలో అనాథల సంఖ్య కేవలం 35!)
  • అనాథ వ్యాసాల సంఖ్యలో ఎవరెవరి వాటా ఎంతెంతో ఇక్కడ చూడొచ్చు.
  • నియోజకవర్గాల వ్యాసాల్లో సమాచారపెట్టెలకు సంబంధించి కొన్ని సరిచెయ్యాల్సిన అంశాలున్నాయి. దీనిపై సమాచారం రచ్చబండలో చూడొచ్చు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నియోజకవర్గాల పేజీల్లో ఇంకా చాలావాటిల్లో అనువదించని ఆంగ్ల పాఠ్యం ఉంది. అన్ని నియోజకవర్గాల పేజీల్లో సమాచారం ఒకే స్థాయిలో లేదు. ఉదాహరణకి కొన్ని పేజీల్లో గెలిచిన అభ్యర్ధుల జాబితా మాత్రమే ఇస్తే, మరికొన్ని పేజీల్లో ఓట్లు, ప్రత్యర్ధులు తదితర వివరాలున్నాయి. వీటిని ఒక క్రమపద్ధతిలోకి తేవాలి
  • మొలక వర్గాల్లో చేరిన మొలక వ్యాసాలు (మొలక =2048 బైట్ల లోపు) 2555 ఉన్నై (వీటిలో దాదాపు 539 వ్యాసాలు మొలక స్థాయిని దాటాయి గానీ మొలక మూసను తీసెయ్యనందున ఈ వర్గంలోనే ఉండిపోయాయి. వాటిని తీసెయ్యాలి. AWB తో చేసేద్దాం).
  • మొలక వర్గాల్లో చేర్చని మొలక వ్యాసాలు - 316 ఉన్నై. వీటిని సంబంధిత మొలక వర్గాల్లో చేరుద్దాం
  • వర్గీకరణ చెయ్యాల్సినవి, సరిచెయ్యాల్సినవీ చాలానే పేజీలూ, వర్గాలూ ఉన్నై. ఈ పనుల కోసం ఈసరికే వికీప్రాజెక్టులున్నై.
  • పేజీలను వర్గాల్లోకి చేర్చాం గానీ ఆ వర్గాలకు పేజీలను సృష్టించలేదు. ఎర్రవర్గాలన్నమాట. అలాంటి వర్గాలు కనీసం 5 వేలున్నై. వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు,
  • చాలా పేజీలకూ, వర్గాలకూ వికీడాటా అంశాలు లేవు. కొన్నిటికి ఉన్నా, అవి డూప్లికేట్లు - అంటే, ఎన్వికీ పేజీలకు చెందిన అంశాలకు జోడించి లేవు. ఈ డూప్లికేటు అంశాలను ఎన్వికీ-సంబంధ అంశాలతో విలీనం చెయ్యాలి. దీనిపై మరింత వివరణ కోసం ఈ చర్చ చూడండి.
  • కొన్ని పనులను ఆటోమేటు చెయ్యాలి. బాటు సహాయానికై అభ్యర్థనలు పేజీలో రాసినవాటిని పరిగణన లోకి తీసుకోవాలి.
  • ఒకే పేరుతో ఉండే పలు పేజీలను జాబితా చేస్తూ అయోమయ నివృత్తి పేజీలను సృష్టించాం. కానీ ఈ జాబితాలో ఆ పేజీలన్నిటినీ చేర్చలేదు, కొన్నిటిని ఇంక అచేర్చాల్సి ఉంది. వాటిని పరిశీలించి ఆ జాబితాలను సరిచెయ్యాలి, విస్తరించాలి.
  • వ్యాసాల్లో కాలదోషం పట్టిన సమాచారాన్ని సవరించాలి.
  • క్లుప్తవివరణ రాయాలి

అభిప్రాయాలు

మార్చు

పైన చూపిన పనులు కాకుండా ఇంకా అనేక పనులు ఉండి ఉండవచ్చు. వాటిని ఇక్కడ రాయండి. అలాగే ఆయా పనులను ఎలా చెయ్యాలో మీ అభిప్రాయాలు చెప్పండి. వీటిలో సముదాయం మెచ్చిన వాటిని పైన ఎలా చేద్దాం విభాగంలో చేరుద్దాం.

వికీపీడియా:మొలకల జాబితాను తాజాపరిచాను. ప్రస్తుతానికి ఆ జాబితాలో 9446 వ్యాసాలున్నాయి. ఇంకా ఎక్కువే ఉంటాయేమోనని అనుకున్నాను. అయితే ఈ జాబితా తయారీలో సినిమా పేజీలను, గ్రామాల పేజీలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మొలకలను తగ్గించడంలో దృష్టి పెట్టాలి. పదేళ్ళ క్రితం దాదాపు ఆరువేల మొలకలు ఉండేవి. వ్యాసాలు పదింతలైనా, మొలకలశాతం 10% కంటే తక్కువుండటం గమనార్హం. --వైజాసత్య (చర్చ) 02:20, 1 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]