వికీపీడియా చర్చ:వర్గీకరణ

తాజా వ్యాఖ్య: వర్గాలు: వికీడేటా సైటు లింకులు. టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Saiphani02

Suggestion about uncategorizedpages

మార్చు

Hi Chaduvari, can you mention about Special:Uncategorizedpages Special:Uncategorizedcategories in this article --వైఙాసత్య 13:15, 15 సెప్టెంబర్ 2005 (UTC)

Done.--చదువరి 13:47, 15 సెప్టెంబర్ 2005 (UTC)

ఫైళ్ల నకలుహక్కుల వర్గాలు ఆంగ్లపేర్లతో వుంచుట

మార్చు

ఇటీవల ఫైళ్ల నకలుహక్కుల వర్గాలు ( Category:Wikipedia copyright లో వర్గవృక్షం) తనిఖీ చేస్తుంటే తెలుగు అక్షరాలుగల పేర్లతో కనిపించాయి (ఉదా:వర్గం:అన్నిరకాల ఉచితం కాని దస్త్రాలు). ఫైళ్ల నకలుహక్కులు క్లిష్టవిషయం. ఆంగ్లవికీలో చర్చల ద్వారా మార్పులకు గురి అవుతాయి. వేరుపేర్లతో వుంటే ఆ మార్పులను దిగుమతి ద్వారా సులభంగా పొందలేము. తెవికీలో ఫైళ్ల ను నిర్వహించటానికి అదనపు సమస్య ఏర్పడుతుంది. కావున ఫైళ్లనకలుహక్కుల వర్గాలు ఆంగ్లవికీపేర్లతోనే కొనసాగించడం మంచిది. ఏమైనా స్పందనలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 02:24, 27 డిసెంబరు 2021 (UTC)Reply

తెలుగులోకి మార్చి, సంబంధిత ఆంగ్ల వివరం నకలు చేయకపోతే ఇబ్బందికి సాధారణ వర్గంపేరు అయినా ఈ చర్చ చూడండి.--అర్జున (చర్చ) 05:49, 27 డిసెంబరు 2021 (UTC)Reply
స్పందన లేమి లేనందున {{సహాయం కావాలి}} రద్దుచేశాను.--అర్జున (చర్చ) 00:41, 4 జనవరి 2022 (UTC)Reply

దత్తత గ్రామాల వర్గీకరణ

మార్చు

నమస్కారం..! ముందుగా గ్రామాల వ్యాసాలు పట్టువిడవకుండా అభివృద్ధి చేస్తున్న యర్రా రామారావు గారి లాంటి వారికి అభినందనలు. ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం చూస్తున్నాం. గ్రామ వ్యాసాలలో దత్తత స్వీకరించిన వ్యక్తి, సంవత్సరం, అభివృద్ధి... వగైరా వివరాలు కూడా చేరిస్తే బాగుంటుంది. అలాగే ఈ గ్రామాలకు దత్తత గ్రామాలు వర్గం కేటాయించవచ్చు. --Muralikrishna m (చర్చ) 04:44, 27 నవంబరు 2022 (UTC)Reply

ఉదాహరణకు ..

  • డోకిపర్రు పారిశ్రామికవేత్త మెగా ఇంజినీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ పి.పి. రెడ్డి దత్తత గ్రామం
మురళీకృష్ణ గారూ గ్రామ వ్యాసాల అభివృద్దిపై గుర్తించిన గుర్తింపుకు ధన్యవాదాలు.మీరు దత్తత తీసుకున్న గ్రామాలపై వర్దీకరణపై మంచి సూచన చేసారు. అలాగే వర్గీకరిద్దాం. యర్రా రామారావు (చర్చ) 03:41, 16 డిసెంబరు 2022 (UTC)Reply
ధన్యవాదాలు గురువుగారు.. Muralikrishna m (చర్చ) 03:44, 16 డిసెంబరు 2022 (UTC)Reply
బాగుందండి. ఇలా ఎన్ని సముచితమైన విధాలుగా వర్గీకరిస్తే పాఠకులు అన్ని ఎక్కువ రకాలుగా పేజీలను శోధించే (బ్రౌజు చేసే) అవకాశం ఉంటుంది. సాగునీటి వసతి ఉన్న/లేని గ్రామాలు, తాగునీటి వసతి లేని గ్రామాలు, ఫ్లోరైడు బాధిత గ్రామాలు, జాతీయ/రాష్ట్ర రహదారిపై ఉన్న గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు, పరిశ్రమలు ఉన్న గ్రామాలు,.. ఇలా పలు విధాలుగా వర్గీకరించవచ్చు. ఎన్ని ఎక్కువ వర్గాలుంటే పేజీలు అంత ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఔచిత్యాన్ని మరువకుండా వర్గీకరిస్తే చాలు. __చదువరి (చర్చరచనలు) 05:50, 17 డిసెంబరు 2022 (UTC)Reply
కేవలం వర్గీకరణ చేయటం కాకుండా, ఆ పేజీలో ఆ వర్గానికి చెందిన కొంత సమాచారం అయినా ఉండాలని నాఅభిప్రాయం.ఉదా:బుర్రిపాలెం గ్రామం మహేశ్ బాబు దత్తత తీసుకున్నాడు.కానీ ఆ సమాచారం ఆ పేజీలో ఉంటే పర్వాలేదు. లేని సందర్బంలో తగిన మూలంతో క్లుప్తంగా కూర్పుచేసి వర్గం చేర్చాలి. అది రాయకుండా కేవలం దత్తత గ్రామాలు అని వర్గం చేర్చినా ఎవరు దత్తత తీసుకున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది.దానికి తావులేకుండా ఆ పేజీలో బుర్రిపాలెం#దత్తత గ్రామం రాసినట్లుగా రాయాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 06:30, 17 డిసెంబరు 2022 (UTC)Reply
ఓ పేజీని వర్గంలో చేర్చడానికి, లేదా సమాచారపెట్టెలో ఓ డేటాను చేర్చడానికీ - పేజీలో సంబంధిత సమాచారం ఉండడం తప్పనిసరి.__ చదువరి (చర్చరచనలు) 07:40, 17 డిసెంబరు 2022 (UTC)Reply
యర్రా రామారావుగారు.. మీతో ఏకీభవిస్తున్నాను. కచ్చితంగా గ్రామవ్యాసాల్లో మూలాలతో పాటు గ్రామం దత్తత ఎవరు, ఎప్పుడు తీసుకున్నారు. సంధర్శించిన సమాచారం, అభివృద్ధి తదితర వివరాలు చేర్చిన మీదటనే వర్గం పేర్కొనాలి. Muralikrishna m (చర్చ) 09:18, 17 డిసెంబరు 2022 (UTC)Reply
గురువు చదువరి గారికి ధన్యవాదాలు. ఇది చాలా మంచి ఆలోచన. Muralikrishna m (చర్చ) 09:19, 17 డిసెంబరు 2022 (UTC)Reply

వర్గాలు: వికీడేటా సైటు లింకులు.

మార్చు

తెవికీలో చాలా పేజీలకూ, వర్గాలకు వికీడాటా అంశాలు ఉన్నాయి. కాని వాటికి సరైన సైటు లింకులు లేవు. దీనివలన తెవికీ, ఇతర భాషా వికీ ప్రాజెక్టులకు చేరువగా కాకుండా దూరంగా వెళ్తుంది. కొన్ని వేల పేజీలకు, వర్గాలకు, వాటి సరైన వికీడాటా అంశాలను, వికీడాటా స్టేట్మెంటులను చేర్చి లేదా దారి మార్చాల్సిన అవసరం ఉంది. అనువాద పరికరం కొత్త వ్యసాలు స్రుష్టించినప్పుడు వర్గాలకు తెవికీ లింకులు లేకపోతే ఆ వర్గాలను జోడించదు. ఇలా చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. లక్ష వ్యాసాలను కూడా చేరుకుంటున్నాం కనుక ఇది మరింత ముఖ్యం అని భావిస్తున్నాను.


మొత్తం వర్గాలు: 16,718 (పెట్ స్కాన్)

ఒక సైటు లింకు మాత్రమే (తెవికీ ఒక్కటే) ఉన్న వర్గాలు: 7,501 (పెట్ స్కాన్)

కనీసం రెండు సైటు లింకులు ఉన్న వర్గాలు: 4683 (పెట్ స్కాన్)


Saiphani02 (చర్చ) 11:14, 24 సెప్టెంబరు 2024 (UTC)Reply

@Saiphani02 గారూ, మంచి పాయింటు. దీన్ని బట్టి
  • తెవికీ సైటు లింకు ఒక్కటే ఉన్న 7501 వర్గాల్లో
    • ఇతర భాషల్లో అసలు ఆ వర్గాలు ఉండి ఉండకనే పోవచ్చు (మండలాలు, గ్రామాలు అనే వర్గాలు ఈ కోవ లోకి వస్తాయి)
    • ఇతర భాషల వర్గాలకు వికీడేటా అంశం ఉన్నప్పటికీ, మన వర్గాలను ఆ అంశాల్లో కలపకుండా విడిగా మరో అంశాన్ని సృష్టించి ఉండవచ్చు ఉదాహరణకు: వర్గం:భారత జాతీయ పురస్కారాలు. దీనికి ఇంగ్లీషులో Category:Orders, decorations, and medals of India అనే వర్గం ఉంది. దానికి వికీడేటాలో వేరే అంశమూ ఉంది. (వీటిలో బాట్లు సృష్టించినవి ఎక్కువగానే ఉండవచ్చు) ఇలాంటి అంశాలను విలీనం చెయ్యాలి.
  • పై గణాంకాలను బట్టి వికీడేటాలో అసలు అంశమే లేని వర్గాలు 4534 ఉన్నాయన్న మాట (ప్రత్యేక పేజీ ప్రకారం ఇవి 4734 ఉన్నాయి).
    • వీటికి ఇతర భాషల్లో (ప్రధానంగా ఇంగ్లీషులో) వర్గాలుంటే సంబంధిత అంశాల సైటు లింకుల్లో వీటిని చేర్చాలి.
    • లేకుంటే కొత్త అంశాలను సృష్టించాలి
వర్గీకరణకు సంబంధించి మన తదుపరి లక్ష్యాల్లో ఈ అంశాన్ని చేర్చుకుందాం.__ చదువరి (చర్చరచనలు) 14:27, 27 సెప్టెంబరు 2024 (UTC)Reply
ఈరోజు ఎందుకో, "ఒక్క స్టేట్మెంటు కూడా లేని తెలుగు వికీ లింకు ఉన్న వికీడేటా అంశాలు" ఎన్ని ఉన్నాయో చూసాను. సుమారు 8,600. Saiphani02 (చర్చ) 08:24, 28 నవంబరు 2024 (UTC)Reply
Return to the project page "వర్గీకరణ".