వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని మండలాల పాత మ్యాపుల పేర్ల మార్పు
ఈ వికీప్రాజెక్టు కాలం విజయవంతంగా ముగిసింది. |
ఇది ఒక నిర్దుష్ట సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ప్రాజెక్టు. 2022 మే లో మొదలై జూన్‌లో ముగిసింది.
సమస్య వివరణ
మార్చుతెలుగు వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మండలాలన్నిటికీ పేజీలు ఉన్నాయి. ఈ పేజీల్లో ఆ మండలం మ్యాపు బొమ్మను కూడా చేర్చారు. ఈ మ్యాపు బొమ్మలను చాలావరకు ఇద్దరు వాడుకరులు ఎక్కించారు - వాడుకరి:Mpradeep, వాడుకరి:వైజాసత్య. ఈ బొమ్మలకు పేర్లు పెట్టేటపుడు వీటికి ఆయా మండలం పేరు కాకుండా సంఖ్యలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఉదా: Gunturu mandals1.jpg, Gunturu mandals7.jpg, Gunturu mandals22.jpg - ఇలా. అంటే దస్త్రం పేరును బట్టి అది ఏ జిల్లాకు సంబంధించినదో చెప్పగలం తప్ప, అది ఏ మండలానిదో చెప్పలేమన్నమాట. ఆయా మ్యాపు ఏ మండలానిదో తెలుసుకోవాలంటే, దాన్ని ఏ పేజీలో పెట్టారో చూస్తే తప్ప తెలియదు. (దాన్ని ఆ పేజీలో పెట్టినవారు సరిగ్గా పెట్టారని అనుకోవాలిక్కడ).
ఇదిలా ఉండగా, 2016 లో తెలంగాణ లోను, 2022 లో ఆంధ్రప్రదేశ్ లోనూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త మండలాలు ఏర్పడ్డాయి, మొత్తం జిల్లాల రూపురేఖలే మారిపోయాయి. దాంతో
- మొత్తం అన్ని మండలాలకీ, అన్ని జిల్లాలకీ కొత్త మ్యాపులు తయారు చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది.
- జిల్లాల మండలాల పేజీల్లో ఉన్న పాత మ్యాపులను చరిత్ర విభాగం లోకి తరలించి, వాటి స్థానంలో కొత్త మ్యాపులను చేర్చాల్సిన అవసరం ఏర్పడింది.
మరో వైపు, వాడుకరి:MGA73 (అన్ని భాషల వికీపీడియాల్లోనూ బొమ్మలను, వాటి లైసెన్సులనూ పరిశీలించి తగు చర్య్తలు తీసుకునే కృషి చేస్తున్న వాడుకరి) తన కృషిలో భాగంగా తెవికీ లోని బొమ్మలను పరిశిలించి వాటికి తగు లైసెన్సులను చేర్చడం, వివరణ రాయడం, సముచితమైన వాటిని కామన్సుకు తరలించడం, తప్పనిసరైతే తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. వారు పై మ్యాపు బొమ్మలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు: "ఈ బొమ్మలన్నీ ఆ వాడుకరుల స్వంత కృతులే కాబట్టి వీటిని కామన్సుకు తరలించాలి." దీనిపై రచ్చబండలో జరిగిన చర్చను చూడవచ్చు. ఈ చర్చలో కింది విషయాలు వెలుగులోకి వచ్చాయి: ఈ మండలాల మ్యాపు దస్త్రాలను కామన్సుకు తరలించే లోపే వాటిని సరైన పేర్లకు తరలించాలి.
తీసుకున్న చర్యలు
మార్చు- పై చర్చకు తగ్గట్టుగా, వాడుకరి:MGA73/File renaming అనే పేజీని సృష్టించి, పేర్లు మార్చాలసిన దస్త్రాలన్నిటినీ అక్కడ ఒక జాబితాగా చేర్చారు. ఇది 2022 మే 21 న జరిగింది.
- మే 24 నాటికి తెలంగాణ రాష్ట్రం లోని మండలాల మ్యాపులన్నిటికీ కొత్త పేరును సూచిస్తూ సంబంధిత పట్టికలో చేర్చారు. ఆ దస్త్రాలను కొత్త పేర్లతో కామన్సుకు తరలించదం పూర్తైంది.
- జూన్ 12 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మండలాల మ్యాపులన్నిటికీ కొత్త పేరును సూచిస్తూ సంబంధిత పట్టికలో చేర్చారు. ఆ దస్త్రాలను కొత్త పేర్లతో కామన్సుకు తరలించడం జరుగుతోంది.
ప్రాజెక్టు పరిమాణం
మార్చుఈ ప్రాజెక్టులో పేర్లు సవరించాల్సిన దస్త్రాలు 1003 ఉన్నాయి. వాటిలో 109 దస్త్రాలను తొలగించగా, మిగతా దస్త్రాలకు కొత్త పేర్లు పెట్టారు. ఆపై కామన్సుకు తరలించారు.
పాల్గొన్నవారు
మార్చుప్రాజెక్టు ఫలితం
మార్చు- రెండు రాష్ట్రాల్లోని మండలాల మ్యాపులు (దాదాపు 900) ఇప్పుడు ఎవరైనా వాడవచ్చు.
- పేరును బట్టి అది ఏ మండలానికి చెందినదో తెలుస్తుంది కాబట్టి, దాన్ని ఏ పేజీలోని చారిత్రిక విభాగంలో పెట్టాలో ఎవరికైనా తెలిసిపోతుంది.
- కొన్ని మ్యాపులు తప్పు పేజీల్లో పెట్టి ఉండడం గమనించారు. వాటిని సరిచెయ్యవచ్చు.
- కొన్ని మ్యాపులను తప్పుగా తయారుచేసారు - ఉదా: కాకినాడ పట్టణ, గ్రామీణ మండలాలు కలిసే ఉన్నాయి. అలాగే రాజమండ్రి పట్టణ, గ్రామీణ మండలాలు కూడా కలిసే ఉన్నాయి. ఈ దోషాల గురించిన వివరాలను ఈ చర్చ పేజీలో చూడవచ్చు.
- కొత్తపేర్లతో దస్త్రాలన్నిటినీ కామన్సుకు తరలించడం పూర్తైంది.
- స్థానికంగా ఉన్న దస్త్రాలను తొలగించేసాం.
దీంతో ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి.