వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గీకరణ
వికీపీడియాలో వర్గాలను వర్గీకరణనూ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఈ వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గీకరణ. వికీపీడియా విధానాలకు అనుగుణంగా వ్యాసాలను, వర్గాలనూ వర్గీకరించడంలో అవసరమైన సహాయం చెయ్యడం ఈ గొడుగు ప్రాజెక్టు లక్ష్యం.
వర్గీకరణలో ప్రధానాంశాలు
మార్చువ్యాసాలను వర్గీకరించేటపుడు కింది అంశాలను పరిగణన లోకి తీసుకోవాలి.
- వర్గాలను హాట్‌హ్యేట్‌తో చేర్చవచ్చు/మార్చవచ్చు/తీసెయ్యవచ్చు. లేదా మామూలుగా విజువల్ ఎడిటరు ద్వారా, వికీటెక్స్టు ఎడిటరు ద్వారా కూడా చేయవచ్చు. హాట్‌క్యేట్ అనేది చకచకా చెయ్యగలిగే సాధనం.
- వ్యాసాలలో ఉన్న సమాచారానికి సంబంధించిన వర్గాలనే చేర్చాలి. సంబంధం లేని అంశాలను చేర్చరాదు. ఉదాహరణకు ఉమాశ్రీ పేజీలో వర్గం:దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కార గ్రహీతలు అనే వర్గాన్ని చేర్చారు. కానీ ఆమెకు ఆ పురస్కారం వచ్చినట్లు పేజీలో ఎక్కడా లేదు. ఆ వర్గాన్ని పట్టుకుని ఈ పేజీకి వచ్చిన పాఠకులు పేజీలో ఈ సమాచారం లేకపోవడం చూసి, ఆమెకు ఆ పురస్కారం అసలు వచ్చిందా లేదా అని సందేహ పడతారు. దానికి కొన్ని కారణాలు -
- ఆయా పురస్కార గ్రహీతల జాబితా లోనో, లేదా మరొక పేజీ లోనో ఆమెకు ఈ పురస్కారం వచ్చిందని గమనించి, ఆ సమాచారం ఈ పేజీలో కూడా ఉందో లేదో చూసుకోకుండా ఈ వర్గాన్ని చేర్చవచ్చు.
- అనువాద పరికరం ద్వారా అనువాదం చేసి ప్రచురించేటపుడు ఇలా జరిగే అవకాశం ఉంది. పేజీలో సంబంధిత భాగాన్ని అనువదించకుండా వదిలేసి మిగతా భాగాన్ని ప్రచురించినపుడు (ఈ వర్గం సంబంధిత ఎన్వికీ వర్గానికి లింకై ఉంటే) ఆ పేజీలో ఈ వర్గం చేరే అవకాశం ఉంటుంది.
- పేజీలో ఏయే వర్గాలను చేర్చాలి అనే ప్రశ్నకు సమాధానంగా, అలాంటి ఇతర పేజీల్లో ఏయే వర్గాలున్నాయో చూడవచ్చు. ఉదాహరణకు రాహుల్ ద్రావిడ్ పేజీలో వర్గాన్ని చేర్చేందుకు అతని సమకాలికులైన ఇతర క్రికెటర్ల పేజీలు చూడవచ్చు. తెలుగు సినిమా నటుడు ప్రభాకరరెడ్డి పేజీ కోసం, రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ పేజీలు చూదవచ్చు.
- * మీరు చేర్చదలచిన వర్గం ఉనికిలో లేనపుడు (ఎర్రలింకు వచ్చినపుడు) వేరేపేరుతో అలాంటి వర్గమే ఉందేమో చూదండి. లేనట్లైతే సముచితమైన పేరుతో కొత్త వర్గాన్ని సృష్టించండి. అయితే అది ఎర్రరంగులో కనిపిస్తుంది.
- ఎర్రవర్గం పేరుపై నొక్కి, ఆ పేజీలో కొంత వివరణ రాసి, దాన్ని ఒక మాతృవర్గంలో చేర్చాలి. వర్గం పేరు లోనే అది ఏమిటో విస్పష్టంగా తెలిసిపోతోంది, దానికి మళ్ళీ వివరణ అక్కర్లేదు అని మీరు భావిస్తే వివరణ రాయనక్కరలేదు. మాతృవర్గాన్ని చేర్చడం మాత్రం తప్పనిసరి.
- వర్గం పేరు వర్గాల నామకరణ విధానాలకు అనుగుణంగా ఉండేలా చూడండి. సందేహం అనిపిస్తే ఈ ప్రాజెక్టు చర్చ పేజీలో గానీ, వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/చర్చించాల్సిన వర్గాల జాబితా పేజీలో గానీ రాయండి.
వర్గాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇతర ప్రాజెక్టులను రూపొందించాం. కింది ప్రాజెక్టులను పరిశీలించండి.
సమస్యాత్మక వర్గాలను సంస్కరించేందుకు
మార్చుఈసరికే ఉన్న వర్గాల్లో కింది సమస్యలున్నాయి
- పెద్ద సంఖ్యలో వర్గీకరించని వర్గాలున్నాయి. వీటికి వర్గ వివరణ ఉంది, కానీ వర్గీకరణ జరగలేదు. (ప్రత్యేక:వర్గీకరించనివర్గములు). వీటిలో అవసరం లేణివాటిని ఖాళీ చేసి తొలగించాలి. మిగిలిన వాటిని వత్ర్గీకరించాలి
- పెద్ద సంఖ్యలో ఎర్రవర్గాలు ఉన్నాయి. అంటే వీటికి మాతృవర్గాలు లేవు, వర్గ వివరణ కూడా లేదు. కానీ ఈ వర్గాల్లోకి పేజీలను చేర్చారు (ప్రత్యేక:కోరినవర్గాలు). వీటిలో అవసరం లేని వర్గాలను ఖాళీచేసి, తొలగించాలి. అవసరమైన వాటికి వర్గ వివరణ చేర్చి, వర్గీకరించాలి.
- ఒకే రకమైన పేజీలను వర్గీకరించేందుకు ఒకటి కంటే ఎక్కువ వర్గాలున్నాయి. ఉదా: వర్గం:భారతీయ మహిళా రచయితలు, వర్గం:భారతీయ రచయిత్రులు ఈ వర్గాల్లోని పేజీలను ఒకే వర్గం లోకి చేర్చి, రెండవ వర్గాన్ని తొలగించాలి.
పై పనులను చేసేందుకు, ఆ పనులను నిర్వహించేందుకూ వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల సంస్కరణ అనే ప్రాజెక్టును చేపట్టాం.
గత వర్గీకరణలను మెరుగుపరచేందుకు
మార్చు- వర్గాల పేర్లను ప్రామాణికీకరించాలి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ (మధ్యలో స్పేసు ఉండడం ఉండకపోవడం) కర్నాటక, కర్ణాటక, నృత్య కళాకారులు/నృత్యకళాకారులు/నాట్య కళాకారులు వగైరా పేర్లతో వచ్చే వర్గాలను చూడండి. ఈ పేర్ల కోసం ఒక ప్రామాణికమైన పద్ధతి ఎంచుకోవాలి.
- వర్గాలకు ఎన్వికీ లింకులివ్వాలి. తద్వారా ఆయా వర్గాల్లోని వ్యాసాలను అనువదించేటపుడు సంబంధిత వర్గాలు ఆటోమాటిగ్గా వచ్చి చేరతాయి.
ఈ పనులు చేసేందుకూ, నిర్వహించేందుకూ వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ అనే ప్రాజెక్టును సృష్టించాం.
వర్గీకరణలో సహాయం కోసం
మార్చు- వర్గీకరించడంలో సమాహయం అవసరమైతే, ఈ ప్రాజెక్టు చర్చపేజీలో రాయవచ్చు.
- ఏదైనా వర్గం గురించి లేదా కొన్ని వర్గాల గురించి చర్చించాలని భావిస్తే చర్చ కొరకు వర్గాలు పేజీకి చెందిన ఉపపేజీల్లో రాయవచ్చు. ఆ ఉపపేజీలో ఏదీ మీ సమస్యకు సరిపోయినట్లు అనిపించకపోతే, మీరే ఒక సముచితమైన ఉపపేజీని సృష్టించి మీ సమస్య రాయండి. ఆ ఉపపేజీ లింకును "వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు" పేజీలో గత చర్చలకు సంబంధించిన ఉపపేజీలు విభాగంలో చేర్చడం మరువకండి.