వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023

మొదటి పేజి న్యాయ నిర్ణేతలు పాల్గొనేవారు ఫలితాలు వనరులు నియమాలు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఎలా పాల్గొనాలి?

మార్చు

ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది.

మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి లాగినవండి. ఈ పోటిలో పాల్గొనడానికి వికిలో ఖాతా తెరిచి కనీసం ఒక సంవత్సర కాలం అయి ఉండాలి.

ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.

గమనిక: పై వర్గాల్లో "చర్చ:" పేరుబరి లోని పేజీలుంటాయి. బొమ్మలను చేర్చవలసినది ఈ పేజీల్లో కాదు; వాటికి సంబంధించిన వ్యాసాల పేజీల్లో చేర్చాలి.

కామన్సులో సముచితమైన బొమ్మ ఒకదాన్ని ఎంచుకోండి. సరైన బొమ్మ పేరును గానీ, వర్గం పేరును గానీ వాడి బొమ్మ కోసం వెతకండి. వేతికేందుకు అనేక పద్ధతులున్నాయి. బొమ్మలను వాడడంలో సూచనల కోసం ఇది చూడండి. బొమ్మలను చేర్చడం లోని ఉద్దేశం, వ్యాసానికి సంబంధించిన వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు, భావనలకు సంబంధించిన బొమ్మలతో వ్యాస విషయం గురించి తెలుసుకోవడంలో పాఠకులకు మరింత సహాయపడడమే. బొమ్మకు వ్యాసానికి ఉన్న సంబంధ మేంటనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉండాలి. బొమ్మలు ప్రధానంగా అలంకారం కోసం కాకుండా వ్యాసంలో సందర్భోచితంగా ఉండాలి.

వ్యాసంలో బొమ్మను ఎలా చేర్చాలో తెలుసుకునేందుకు సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/3 పేజీ చూడండి. వ్యాసం పేజీలో ఏ విభాగంలో బొమ్మను చేర్చితే సముచితంగా ఉంటుందో, ఎక్కడ పెడితే పాఠకుడి అవగాహనకు దోహదపడుతుందో ఆ విభాగాన్ని ఎంచుకోండి. "సవరించు" నొక్కి బొమ్మను చొప్పించండి. బొమ్మ వ్యాసంలో దేన్ని వర్ణిస్తోందో చెబుతూ క్లుప్తంగా కొంత వివరణను చేర్చండి. అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యత గల బొమ్మలను వాడండి. సరైన నాణ్యత లేని బొమ్మలను —మసకగా, అస్పష్టంగా ఉన్నవి; బొమ్మలో వస్తువు బాగా చిన్నవిగా ఉన్నవి, అనేక వస్తువుల మధ్య దాగి ఉన్నవి,సందిగ్ధంగా ఉన్నవి; వగైరా— కచ్చితంగా తప్పనిసరైతే తప్ప వాడరాదు. వ్యాస విషయాన్ని ఏ బొమ్మలు అత్యుత్తమంగా వర్ణిస్తాయో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసే దిద్దుబాటు లన్నిటికీ తప్పనిసరిగా దిద్దుబాటు సారాంశాన్ని ఇవ్వాలి. "మునుజూపు" చూసుకుని ఏమైనా మార్పులవసరమైతే చెయ్యండి. ఇలా బొమ్మలను చేర్చి మెరుగుపరచిన దిద్దుబాట్ల సారాంశాల్లో #WPWPTE,#WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. అప్పుడు "మార్పులను ప్రచురించు" ను నొక్కండి. మరిన్ని వివరాలకు మెటా వికీమీడియా లో ఉన్న ఈ గైడు పేజీని చూడండి.

బొమ్మ సింటాక్సు ఎలా ఉండాలో చూసుకోండి! సమాచారపెట్టెల్లో బొమ్మలను చేరుస్తూంటే, దాని సింటాక్సు చాలా తేలిగ్గా ఉంటుంది — దస్త్రం పేరు ఇస్తే చాలు. అంటే [[File:Obamas at church on Inauguration Day 2013.jpg|thumb|వాషింగటన్ డిసి లోని ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థన చేస్తున్న ఒబామా కుటుంబం. 2013 జనవరి]] అని ఇచ్చే బదులు The Obamas at church on Inauguration Day 2013.jpg అని టైపు చేస్తే సరిపోతుంది.

నియమాలు

మార్చు

వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చడం 2023 జూలై 1 - ఆగస్టు 31.

  • ఒక్కొక్కరు ఎన్ని ఫైళ్ళను వాడొచ్చు అనే దానికి పరిమితి ఏమీ లేదు. అయితే, బహుమతుల్లో వివిధ వర్గాలున్నాయి. అనేకమైన ఫొటోలను, సంబంధం లేని ఫొటోలను పెట్టేసి వ్యాసాలను వికారంగా చెయ్యకండి. అసలు ఒక్క ఫొటో కూడా లేని వ్యాసాల్లో మాత్రమే ఫొటో చేర్చండి.

బొమ్మ స్వేచ్ఛగా వాడుకునే లైసెన్సుకు లోబడి గానీ పబ్లిక్ డొమెయిన్ లో గానీ విడుదలై ఉండాలి. వాడదగ్గ లైసెన్సులు CC-BY-SA 4.0, CC-BY 4.0, CC0 1.0.

ఈ పోటిలో పాల్గొనడానికి వికిలో ఖాతా తెరిచి కనీసం ఒక సంవత్సర కాలం అయి ఉండాలి. (ఇది అంతర్జాతీయ పోటీకి మాత్రమే, తెలుగు వికీ స్థానికంగా కొత్త వాడుకరులను కూడా పాల్గొనడానికి ప్రోత్సహిస్తుంది.)

తక్కువ నాణ్యత కలిగిన ఫొటోలు సాధారణంగా అనుమతింపబడవు

  1. బొమ్మ కనీసం 200 పిక్సెళ్ళ పరిమాణం కలిగి ఉండాలి. దీనికన్న తక్కువ పరిమాణం కల బొమ్మలు సాధారణంగా పోటీకి పరిగణింపబడవు.
  2. బొమ్మకు చేర్చే వ్యాఖ్య, వివరణ స్పష్టంగా ఉండాలి, వ్యాసానికి సరిపోయేలా ఉండాలి.
  3. చేర్చే ప్రతీ బొమ్మకూ, అది దేనికి సంబధించినదో వివరించే వ్యాఖ్య తప్పనిసరిగా ఉండాలి.
  4. మీకు భాష సరిగ్గా తెలియని వికీపీడియాలో బొమ్మలను చేర్చకండి. వ్యాఖ్యల్లేని బొమ్మలు, సంబంధం లేని బొమ్మలు వగైరాలను పదేపదే చేర్చే వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
  • బొమ్మలను చేర్చాక, మార్పులను ప్రచురించేటపుడు రాసే దిద్దుబాటు సారాంశంలో సవివరమైన సారాంశంతో పాటు #WPWPTE, #WPWP అనే హ్యాష్‌ట్యాగులను తప్పనిసరిగా చేర్చాలి. ఉదాహరణకు, "సమాచారపెట్టెలో బొమ్మను చేర్చి మెరుగుపరచాను" #WPWPTE, #WPWP. ఈ హ్యాష్‌ట్యాగులను చేర్చకపోతే, ఆ వ్యాసాలు పోటీ పరిగణన లోకి రావు. ఈ హ్యాష్‌ట్యాగులను (#WPWPTE), (#WPWP) వ్యాసం లోపల చేర్చకండి

ఆడియోలు/వీడియోలు చేర్చడానికి మార్గదర్శకాలు

  1. మీరు చేర్చే ఆడియో వికీ కామన్స్ లో పబ్లిక్ డొమైన్లో పొందుపరచబడి ఉండాలి.
  2. మీరు ఒకవేళ ఏదైనా విషయానికి సంబంధించిన ఫైలు కామన్స్ లో చేరిస్తే వాటిని కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉంచాలి.
  3. అయితే గూగుల్ నిఘంటువు మాదిరి పదాల ఉచ్ఛారణలు ఇక్కడ చేర్చడం నిషిద్ధం. (ప్రస్తుత ప్రాజెక్టులో ఇవి వద్దని అనుకుంటున్నాం).
  4. ఏదైనా సంస్కృతీ సంప్రదాయాలు, సంగీత వాద్యాలు, వికీ విషయ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల మాటలను అలాగే వికీ విషయ ప్రాముఖ్యత కలిగిన ఏదైనా వ్యాసంలో మీరు కొత్త ఫైళ్లను సృష్టించి చేర్చవచ్చు.

మీరు ఆడియోలు చేర్చే వ్యాసాల్లో అంతకు ముందు ఎటువంటి ఆడియోలు ఉండకూడదు, అప్పుడే దాన్ని కొత్త దిద్దుబాటుగా పరిగణిస్తాం. అలాగే విడియోలకి కూడా.

వ్యాసానికి సరిపోయే ఫొటోలు/ఆడియోలు/వీడియోలను పట్టుకోవడంలో కొన్ని చిట్కాలు

మార్చు

వ్యాసానికి సరిపోయే ఫొటోలను వెదకడంలో కింది చిట్కాలను పాటించవచ్చు

  1. వ్యాసపు అంతర్వికీ లింకులను చూడండి (పేజీకి ఎడమవైపున పట్టీలో ఉంటాయి). ఆయా భాషల పేజీలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ ఫొటోలను పెట్టారో చూడండి. వాటిలో బాగా సరిపోయే ఫొటోను మీరు ఇక్కడి వ్యాసంలో చేర్చండి. అలాగే అంతర్వికీ లింకుల్లో "Wikimedia commons" అనే లింకు ఉంటే, నేరుగా ఆ లింకుకు వెళ్ళి అక్కడున్న బొమ్మల్లో ఒకదాన్ని ఎంచుకుని ఈ పేజీలో చేర్చవచ్చు.
    1. అంతర్వికీ లింకులు లేకపోతే, ఇప్పుడు చేర్చండి. దానితో మీ పని నెరవేరడమే కాదు, ఆ మేరకు తెవికీ మెరుగు పడుతుంది కూడాను. అంతర్వికీ లింకులు ఇవ్వడం ఎలాగో తెలుసుకోండి.
    2. ఒకవేళ మీరు ఎంచుకున్న ఫొటో కామన్సులో లేకపోతే, ఏ వికీలోనైతే ఆ ఫొటోను చూసారో, ఆ వికీ నుండి ఫొటోను దించుకుని, తెవికీ లోకి ఎక్కించండి. దాన్ని పేజీలో చేర్చండి.
  2. అసలు ఇతర భాషల్లో ఈ పేజీ లేకపోయినా, పేజీ ఉన్నా వాటిలో కూడా బొమ్మ ఏమీ లేకపోయినా పై చిట్కా ఫలించదు. అలాంటపుడు, కామన్సులో బొమ్మ కోసం వెతకండి. ఇంగ్లీషు పేరుతో వెతకండి. వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు అయితే ఆ పేరుతోటే వెతకాలి. ఇతర పేజీల కోసం వెతికేటపుడు ఏ పేరుతో వెతకాలో సందేహం వస్తే, అంతర్వికీ లింకుల్లో ఇంగ్లీషు వ్యాసం పేరుతో వెతకండి.
  3. ప్రత్యేక:వాడనిఫైళ్లు అనే ప్రత్యేక పేజీలో అసలు ఏ పేజీలోనూ వాడని బొమ్మలను చూడవచ్చు. తెలుగు వికీపీడియాలో అసలు ఎక్కడా వాడని బొమ్మలు దాదాపు 1,800 ఉన్నాయి. ఆ బొమ్మలకు సంబంధించిన వ్యాసం పేజీలను చూసి, వాటిలో బొమ్మలేమీ లేకపోతే, ఈ బొమ్మలను ఆ పేజీల్లో చేర్చవచ్చు.

పైన సూచించిన విధంగా ఆడియోలు, వీడియోలను కూడా శోధించండి, ఏవైతే వ్యాసాల్లో ఆ ఫైళ్లు లేవో అక్కడ వాటిని చేర్చండి.

పని చేసే పద్ధతులు

మార్చు

ఈ పోటీలో పని చేసే పద్ధతులను వివరించే పేజీని చూడండి. కొత్తవారికి ఈ పేజీ ఉపయోగంగా ఉంటుంది.

లక్ష్యం

మార్చు

కాలక్రమ వివరాలు

మార్చు

ఈ WPWP పోటీ ఏటా జరుగుతుంది.

  • పోటీ ప్రారంభం: 2023 జూలై 1 00:01 (UTC)
  • పోటీ చివరి తేదీ: 2023 ఆగస్టు 31 23:59 (UTC)


అంతర్జాతీయ బహుమతుల వివరాలు

మార్చు

ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:

  1. మొదటి బహుమతి ― ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  2. రెండవ బహుమతి ― ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  3. మూడవ బహుమతి ― ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

ఆడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:

  • ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

వీడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:

  • ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన కొత్త వాడుకరికి బహుమతి:

  • ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్